Viral Video: రూల్స్ బ్రేక్ చేసే వారు.. ఈ వీడియో తప్పక చూడాల్సిందే..!
- By HashtagU Desk Published Date - 02:54 PM, Thu - 24 March 22

ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా దేశంలోని ప్రధాన నగరాల్లో టూవీలర్ యాక్సిడెంట్‌లు జరుతున్న సంగతి తెలిసిందే. దీంతో ద్విచక్ర వాహనాలపై బయటకు వెళ్ళిన వారు తిరిగి ఇంటికి క్షేమంగా చేరుకునే వరకు కుటుంబ సభ్యులు టెన్షన్ పడుతూ ఉండాల్సిన పరిస్థిలు చూస్తూనే ఉన్నాం.
ప్రభుత్వాలు, పోలీసులు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని ఎంతగా ప్రచారం చేస్తున్నా, ఇప్పటికీ చాలామంది కేర్‌లెస్‌లో హెల్‌మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలతో రోడ్డెక్కుతున్నారు. అయితే కొందరు మాత్రం వాహనాలు నడిపే సమయంలో తమతో పాటు తమ పిల్లలకు కూడా హెల్మెట్ ధరిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా హైదారాబాద్‌లో టూవీలర్ పై వెళుతున్న తళ్ళీ కూతురుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో హైదరాబాద్ శివారులోని నానక్ రామ్ గూడలో ఓ తల్లి తన కూతురిని స్కూటీ పై స్కూల్‌కు తీసుకెళుతోంది. ఈ క్రమంలో టూవీలర్ నడుపుతున్న ఆ మహిళతో పాటు ఆమె కూతురు కూడా హెల్మెట్ పెట్టుకుని ఉంది. అదే సమయంలో కారులో అదే రూట్‌లో వెళుతున్న ఎమ్మెల్సీ కవిత వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ స్ఫూర్తిమంతమైన తల్లీకూతుళ్లు.. తల్లితో పాటు కూతురికి కూడా హెల్మెట్ ధరించి స్కూటీ డ్రైవ్ చేస్తున్న మహిళ ఎందరికో స్ఫూర్తిగా నిలిచిందంటూ ఆమె ట్వీట్ చేసింది. ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకోండి, సురక్షితంగా ఉండండి అంటూ సందేశాన్నిచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Inspiring Mother & Daughter duo I ran into at Nanakram guda chourastha today !!!
Wear Helmet & Be safe 😊🙏🏻 pic.twitter.com/0RfV6Bj2rH— Kavitha Kalvakuntla (@RaoKavitha) March 23, 2022