HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Microsoft Founder Bill Gates Revealed He Did Not Believe In Weekends Or Vacations

Bill Gates : జీవిత పరమార్ధంపై బిల్‌గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు

Bill Gates : ‘వర్క్ అండ్ లైఫ్ బ్యాలెన్స్‌’పై ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

  • By Pasha Published Date - 08:56 PM, Sun - 24 December 23
  • daily-hunt
Bill Gates
bill gates

Bill Gates : ‘వర్క్ అండ్ లైఫ్ బ్యాలెన్స్‌’పై ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తండ్రి అయ్యే దాకా తనకు వీకెండ్ హాలిడేస్‌పై, రెస్ట్ తీసుకోవడంపై ఇంట్రెస్ట్ ఉండేది కాదని ఆయన చెప్పారు. తండ్రి అయ్యాక ఈ అంశాలపై తన అభిప్రాయం మారిపోయిందని తెలిపారు. చివరకు పని కంటే జీవితమే విలువైందని గ్రహించానని బిల్‌ గేట్స్‌ కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. ఈమేరకు ఆయన ఒక బ్లాగ్‌ పోస్టు రాశారు. గోల్‌కీపర్స్ ఈవెంట్‌లో తన చిన్న కుమార్తె ఫోబ్‌తో కలిసి పాల్గొన్న సందర్భంగా ఈ అంశాలపై తాను  ప్రసంగించినట్లు బిల్ గేట్స్ రాసుకొచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

‘‘జీవితాన్ని ఆస్వాదించడం కూడా మర్చిపోయేంతగా కష్టపడొద్దు. పనికంటే జీవితమే ఎంతో గొప్పది. ఈ విషయం తెలుసుకోవటానికి నాకు చాలా టైం పట్టింది. అయితే మీరు అంత కాలం వేచి ఉండకండి. మీ బంధాలను బలపరుచుకోవడానికి, విజయాన్ని పంచుకోవడానికి, నష్టాల నుంచి కోలుకోవడానికి కొంత టైం వెచ్చించండి’’ అని గోల్‌కీపర్స్ ఈవెంట్‌లో పాల్గొన్న యూత్‌కు బిల్ గేట్స్(Bill Gates) పిలుపునిచ్చారు.

Also Read: IAS Transfers in Telangana : తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బదిలీలు..

ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తి ఏమన్నారంటే..

ఇటీవల జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఇన్ఫోసిస్‌లో వారంలో 85 నుంచి 90 గంటల పాటు పని చేసిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పారు. అయితే ఆ కష్టం వ్యర్థం కాలేదన్నారు. కంపెనీని స్థాపించిన కొత్తలో వారానికి 70గంటల కంటే ఎక్కువే పని చేశానని తెలిపారు.  1994 వరకు వారానికి 85 నుంచి 90 గంటలు పని చేశానని నారాయణ మూర్తి అన్నారు. అప్పట్లో వారంలో ఆరు పనిదినాలు ఉండేవని వివరించారు. ఉదయం 6.20 గంటలకు ఆఫీసుకు చేరుకుంటే.. రాత్రి 8.30 గంటల సమయంలో ఆఫీసు నుంచి బయలుదేరేవాడినని తెలిపారు. పేదరికం నుంచి బయటపడేందుకు ఏకైక మార్గం చాలా కష్టపడి పని చేయడమేనని తన తల్లిదండ్రులు తనకు నేర్పించారని నారాయణ మూర్తి చెప్పారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bill gates
  • business
  • Microsoft
  • Vacations
  • Weekends

Related News

Layoffs

Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

ఎవరైనా తమ ఉద్యోగం కోల్పోబోతున్నప్పుడు వారికి అనేక రకాల సంకేతాలు (Hints) లభిస్తాయి. అయితే మీకు ఇలా జరుగుతున్నంత మాత్రాన మీ ఉద్యోగం ప్రమాదంలో ఉందని చెప్పలేము.

  • Gold Prices

    Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

  • Diwali Break

    Diwali Break: దీపావళికి ఉద్యోగులకు 9 రోజుల సెలవు.. ఎక్క‌డంటే?

Latest News

  • WhatsApp: వాట్సాప్‌లో స్పామ్, అనవసర మెసేజ్‌లకు ఇక చెక్!

  • Air Pollution: వాయు కాలుష్యం.. గర్భంలో ఉన్న శిశువు మెదడుపై తీవ్ర ప్రభావం!

  • Confirm Ticket: ఐఆర్‌సీటీసీతో ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ యాప్స్‌తో టికెట్స్ బుక్ చేసుకోవ‌చ్చు!

  • CNG Cars: త‌క్కువ బ‌డ్జెట్‌లో సీఎన్‌జీ కారును కొనుగోలు చేయాల‌ని చూస్తున్నారా?

  • Sadar Sammelan: సదర్ సమ్మేళనానికి సర్వం సిద్ధం.. సీఎం రేవంత్ రెడ్డి రాక!

Trending News

    • Diwali: రేపే దీపావ‌ళి.. ఈ విష‌యాల‌ను అస్సలు మ‌ర్చిపోకండి!

    • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd