Bill Gates : జీవిత పరమార్ధంపై బిల్‌గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు
Bill Gates : ‘వర్క్ అండ్ లైఫ్ బ్యాలెన్స్’పై ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కీలక వ్యాఖ్యలు చేశారు.
- By Pasha Published Date - 08:56 PM, Sun - 24 December 23

Bill Gates : ‘వర్క్ అండ్ లైఫ్ బ్యాలెన్స్’పై ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. తండ్రి అయ్యే దాకా తనకు వీకెండ్ హాలిడేస్‌పై, రెస్ట్ తీసుకోవడంపై ఇంట్రెస్ట్ ఉండేది కాదని ఆయన చెప్పారు. తండ్రి అయ్యాక ఈ అంశాలపై తన అభిప్రాయం మారిపోయిందని తెలిపారు. చివరకు పని కంటే జీవితమే విలువైందని గ్రహించానని బిల్ గేట్స్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. ఈమేరకు ఆయన ఒక బ్లాగ్ పోస్టు రాశారు. గోల్‌కీపర్స్ ఈవెంట్‌లో తన చిన్న కుమార్తె ఫోబ్‌తో కలిసి పాల్గొన్న సందర్భంగా ఈ అంశాలపై తాను ప్రసంగించినట్లు బిల్ గేట్స్ రాసుకొచ్చారు.
We’re now on WhatsApp. Click to Join.
‘‘జీవితాన్ని ఆస్వాదించడం కూడా మర్చిపోయేంతగా కష్టపడొద్దు. పనికంటే జీవితమే ఎంతో గొప్పది. ఈ విషయం తెలుసుకోవటానికి నాకు చాలా టైం పట్టింది. అయితే మీరు అంత కాలం వేచి ఉండకండి. మీ బంధాలను బలపరుచుకోవడానికి, విజయాన్ని పంచుకోవడానికి, నష్టాల నుంచి కోలుకోవడానికి కొంత టైం వెచ్చించండి’’ అని గోల్‌కీపర్స్ ఈవెంట్‌లో పాల్గొన్న యూత్‌కు బిల్ గేట్స్(Bill Gates) పిలుపునిచ్చారు.
Also Read: IAS Transfers in Telangana : తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బదిలీలు..
ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి ఏమన్నారంటే..
ఇటీవల జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఇన్ఫోసిస్‌లో వారంలో 85 నుంచి 90 గంటల పాటు పని చేసిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పారు. అయితే ఆ కష్టం వ్యర్థం కాలేదన్నారు. కంపెనీని స్థాపించిన కొత్తలో వారానికి 70గంటల కంటే ఎక్కువే పని చేశానని తెలిపారు. 1994 వరకు వారానికి 85 నుంచి 90 గంటలు పని చేశానని నారాయణ మూర్తి అన్నారు. అప్పట్లో వారంలో ఆరు పనిదినాలు ఉండేవని వివరించారు. ఉదయం 6.20 గంటలకు ఆఫీసుకు చేరుకుంటే.. రాత్రి 8.30 గంటల సమయంలో ఆఫీసు నుంచి బయలుదేరేవాడినని తెలిపారు. పేదరికం నుంచి బయటపడేందుకు ఏకైక మార్గం చాలా కష్టపడి పని చేయడమేనని తన తల్లిదండ్రులు తనకు నేర్పించారని నారాయణ మూర్తి చెప్పారు.