Marriott International : ప్రపంచవ్యాప్తంగా తన లాడ్జింగ్ ఆఫర్‌లను విస్తరిస్తున్న మారియట్ ఇంటర్నేషనల్
మారియట్ బోన్‌వాయ్ పోర్ట్‌ఫోలియోలోకి సుస్థిర నాణ్యత, సేవలను అందించే బాగా స్థిరపడిన, ప్రాంతీయంగా సృష్టించబడిన బ్రాండ్‌లు, హోటళ్లను తీసుకు రావడం ద్వారా మారియట్ ప్రపంచ ఉనికిని ఈ సిరీస్ విస్తరిస్తుందని భావిస్తున్నారు.
- By Latha Suma Published Date - 05:42 PM, Sat - 24 May 25

Marriott International: ప్రపంచవ్యాప్తంగా తన లాడ్జింగ్ ఆఫర్‌లను విస్తరిస్తున్న మారియట్ ఇంటర్నేషనల్ (నాస్డాక్: MAR) ఈరోజు మిడ్‌స్కేల్, అప్‌స్కేల్ లాడ్జింగ్ విభాగాలకు సంబంధించి తన కొత్త కలెక్షన్ బ్రాండ్ – సిరీస్ బై మారియట్™ ప్రపంచవ్యాప్త ప్రారంభాన్ని ప్రకటించింది. మారియట్ బోన్‌వాయ్ పోర్ట్‌ఫోలియోలోకి సుస్థిర నాణ్యత, సేవలను అందించే బాగా స్థిరపడిన, ప్రాంతీయంగా సృష్టించబడిన బ్రాండ్‌లు, హోటళ్లను తీసుకు రావడం ద్వారా మారియట్ ప్రపంచ ఉనికిని ఈ సిరీస్ విస్తరిస్తుందని భావిస్తున్నారు. మారియట్ కు చెందిన ఈ సిరీస్ అతిథులకు మరిన్ని ప్రదేశాలలో సౌకర్యవంతమైన బసలను అందిస్తుంది. అంతేగాకుండా ప్రాంతీయ యజమానులకు ఈ కంపెనీ ప్రఖ్యాత మారియట్ బోన్‌వాయ్ లాయల్టీ ప్రోగ్రామ్‌తో సహా మారియట్ ప్లాట్‌ఫామ్‌ల ప్రయోజనాలను అందిస్తుంది, అదే సమయంలో వారి పోర్ట్‌ఫోలియో స్వతంత్ర గుర్తింపును కొనసాగిస్తుంది.
Read Also: Mango: మామిడి పండ్లు తిన్న తర్వాత ఇలాంటి ఫుడ్స్ తింటున్నారా.. అయితే జాగ్రత్త మీకు సమస్యలు రావడం ఖాయం!
మారియట్ సిరీస్, మారియట్‌కు కీలకమైన వృద్ధి మార్కెట్ అయిన భారతదేశంలో కాన్సెప్ట్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ (CHPL)తో ఫౌండింగ్ డీల్ ద్వారా ప్రారంభించబడింది. 1996లో పరమ్ కన్నంపిల్లి స్థాపించిన CHPL, ఆరు బ్రాండ్‌ల పోర్ట్‌ఫోలియో. 90 ప్రదేశాలలో పనిచేస్తున్న 100 కి పైగా హోటళ్లతో భారతదేశంలోని ప్రముఖ హోట ల్ మేనేజ్‌మెంట్ కంపెనీలలో ఒకటి. CHPL, మారియట్ మధ్య వ్యూహాత్మక ఒప్పందం ప్రకారం, CHPL ప్రధాన బ్రాండ్లు – ది ఫెర్న్, ది ఫెర్న్ రెసిడెన్సీ, ది ఫెర్న్ హాబిటాట్ – భారతదేశం అంతటా ప్రత్యేక ప్రాతిపదికన సిరీస్ బై మారియట్‌తో అనుబంధించబడతాయి. అంతేగాకుండా మారియట్ CHPLలో తక్కువ మొత్తంలో ఈక్విటీ పెట్టు బడి కూడా పెడుతుంది. ఫెర్న్ పోర్ట్‌ఫోలియోలో ప్రస్తుతం 84 ఓపెన్ ప్రాపర్టీలు, 31 అమలు చేయబడిన పైప్‌లైన్ ఒప్పందాలు ఉన్నాయి. మొత్తం 115 ప్రాపర్టీలు, సుమారు 8,000 గదులు ఉన్నాయి. థర్డ్ పార్టీ హోటల్ యజ మానులతో చర్చలు, ఆ యజమానులతో దీర్ఘకాలిక ఫ్రాంచైజ్ ఒప్పందాల అమలు తర్వాత ఫెర్న్ ఆస్తులు కాల క్రమేణా భారతదేశంలోని మారియట్ పోర్ట్‌ఫోలియోలో చేరుతాయని భావిస్తున్నారు. బహుళజాతి సంస్థ CG కార్ప్ గ్లోబల్ ఆతిథ్య విభాగం అయిన CG హాస్పిటాలిటీ, CHPLలో మెజారిటీ వాటాదారు.
‘‘సరైన స్థలంలో సరైన ధరకు, చక్కటి ప్రాథమిక సదుపాయాలతో బసను అందించడంలో మారియట్ నిబద్ధతను మారియట్ సిరీస్ మరింతగా పెంచుతుంది” అని మారియట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్, సీఈఓ ఆంథోనీ కాపు వానో అన్నారు. “కొత్త, రీజనల్ కలెక్షన్ బ్రాండ్‌ను సృష్టించడం వల్ల విలువ-స్పృహ ఉన్న ప్రయాణికులకు మారి యట్ చేరువవుతుంది. మా ప్రస్తుత మారియట్ బోన్‌వాయ్ సభ్యులు, అతిథులకు అదనపు ఎంపికను అంది స్తుంది. స్థానిక యజమానులకు మరిన్ని అనుబంధ అవకాశాలను అందిస్తుంది. “CHPL తో మా ఫౌండింగ్ డీల్ ద్వారా సిరీస్ బై మారియట్‌ను ప్రారంభించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఒప్పందం కంపెనీకి కీలక మార్కెట్ అయిన భారతదేశంలో మారియట్ ప్రముఖ స్థానాన్ని అర్థవంతంగా విస్తరించడంలో సహాయపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అదనపు మార్కెట్లలో సిరీస్ బై మారియట్ కలెక్షన్ వృద్ధిని వేగవంతం చేయాలని భావిస్తున్న నేపథ్యంలో ఈ మల్టీ-యూనిట్ కన్వర్షన్ ఒప్పందాన్ని మేం బలమైన పునాదిగా భావిస్తున్నాం. భారతదేశం అంతటా ఫెర్న్ పోర్ట్‌ఫోలియో ఎంతో మన్నన పొందింది. చక్కటి పనితీరు, ప్రాంతీయ ప్రయాణికుల అవసరాలను తీర్చడంలో CHPL యొక్క నిబద్ధత, సిరీస్ బై మారియట్ బ్రాండ్ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది’’ అని కాపువానో అన్నారు.
‘‘భారతదేశం మారియట్ యొక్క అత్యంత డైనమిక్, వ్యూహాత్మక మార్కెట్లలో ఒకటి. ఇది సిరీస్ బై మారియట్ కు అనువైన లాంచ్ ప్యాడ్ గా మారింది’’ అని మారియట్ ఇంటర్నేషనల్, చైనా మినహా ఆసియా పసిఫిక్ ప్రెసి డెంట్ రాజీవ్ మీనన్ అన్నారు. “CHPL తో మా ఫౌండింగ్ డీల్ ప్రాంతీయ ప్రయాణికులతో ప్రతిధ్వనించే విశ్వసనీయ స్థానిక బ్రాండ్ తో కలసి ఎదిగేందుకు మాకు వీలు కల్పిస్తుంది. ఈ సహకారం CHPL లోతైన మార్కె ట్ జ్ఞానాన్ని మారియట్ ప్రపంచ వేదికతో మిళితం చేస్తుంది – నాణ్యమైన ఆతిథ్యానికి ప్రాప్యతను విస్తృతం చేయ డం, దేశవ్యాప్తంగా బలమైన వృద్ధి సామర్థ్యాన్ని పొందేందుకు వీలు కల్పిస్తుంది. భారతదేశంలో మారియట్ సిరీస్ ను ప్రారంభించడం మా దీర్ఘకాలిక వృద్ధి వ్యూహంలో ఈ ప్రాంతం కీలక పాత్రను ప్రతిబింబిస్తుంది’’ అని అన్నారు.