Constable Sex Change : మగువ నుంచి మగవాడై.. తండ్రయిన మహిళా కానిస్టేబుల్ !
Constable Sex Change : మహారాష్ట్రలోని బీడ్ జిల్లా రాజేగావ్‌కు చెందిన ఒక లేడీ పోలీస్ కానిస్టేబుల్ లింగ మార్పిడి సర్జరీలు చేయించుకొని పురుషుడిగా మారింది.
- By Pasha Published Date - 07:18 PM, Sat - 20 January 24

Constable Sex Change : మహారాష్ట్రలోని బీడ్ జిల్లా రాజేగావ్‌కు చెందిన ఒక లేడీ పోలీస్ కానిస్టేబుల్ లింగ మార్పిడి సర్జరీలు చేయించుకొని పురుషుడిగా మారింది. తన పేరును లలితా సాల్వే నుంచి లలిత్ కుమార్ సాల్వేగా మార్చుకుంది. ఈ పోలీస్ కానిస్టేబుల్ 2020లో ఛత్రపతి శంభాజీనగర్ (ఔరంగాబాద్)కు చెందిన సీమాను పెళ్లి చేసుకుంది. పెళ్లయిన నాలుగేళ్ల తర్వాత జనవరి 15న ఈ జంటకు ఒక మగబిడ్డ పుట్టాడు. తండ్రి కావడంతో లలిత్ కుమార్ సాల్వే ఆనందానికి అంతులేకుండా పోయింది. ఈ సందర్భంగా లలిత్ మీడియాతో మాట్లాడుతూ.. ‘స్త్రీ నుంచి పురుషుడిగా నా ప్రయాణం ఎంతో కష్టాలతో నిండిపోయింది. ఈ సమయంలో చాలా మంది నన్ను ఆదరించి ఆశీర్వదించారు. నా భార్య సీమ బిడ్డను కనాలనుకుంది. ఇప్పుడు తండ్రిని అయినందుకు సంతోషంగా ఉంది. నా కుటుంబం థ్రిల్‌గా ఉంది’ అని చెప్పాడు. కుమారుడికి ఆరుష్ అని పేరు పెడతామని లలిత్, సీమా దంపతులు వెల్లడించారు.
We’re now on WhatsApp. Click to Join.
లలితా సాల్వే 1988 జూన్‌లో పుట్టింది. 25 ఏళ్ల వయసులో తన శరీరంలో మార్పులను ఆమె(Constable Sex Change) గమనించింది. 2013లో వైద్య పరీక్షలు చేయించుకోగా Y క్రోమోజోమ్ ఉనికి ఉందని తేలింది. సహజంగా పురుషుడు X, Y సెక్స్ క్రోమోజోమ్‌లను కలిగి ఉంటారు. స్త్రీలు రెండు కూడా X క్రోమోజోమ్‌లనే కలిగి ఉంటారు. దీంతో లలితా సాల్వేకు జెండర్ డిస్ఫోరియా ఉందని, లింగమార్పిడి చేయించుకోవాలని వైద్యులు సూచించారు. అప్పటికే ఆమె లేడీ కానిస్టేబుల్‌గా ఎంపికైంది. దీంతో 2017లో ఆమె బాంబే హైకోర్టును ఆశ్రయించింది. లింగమార్పిడి సర్జరీ కోసం నెల రోజులు సెలవు కోరింది. బాంబే హైకోర్టుతోపాటు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతితో లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకుంది. 2018 నుంచి 2020 వరకు పలు సర్జరీలు చేయించుకొని పురుషుడిగా మారింది.
Also Read: Rs 10000 Crore : జమిలి ఎన్నికల ఖర్చు.. ప్రతి 15 ఏళ్లకు రూ.10వేల కోట్లు : ఈసీ
సనా షోయబ్ మాలిక్‌గా పేరు మారింది
ప్రేమ, పెళ్లి, విడాకులు.. సినిమా ఇండస్ట్రీలో తరచూ వినిపించే పదాలు. అయితే సెలబ్రిటీల సినిమాలు, ఈవెంట్లు.. లేదంటే వారి ప్రేమ ముచ్చట్లు, పెళ్లి విశేషాలు, విడాకుల వార్తలే ఎక్కువగా వినిపిస్తూ, కనిపిస్తూ ఉంటాయి. అలా ఈరోజు పాకిస్తాన్ నటి పెళ్లి చర్చనీయాంశంగా మారింది. క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను రెండో పెళ్లి చేసుకుంది పాక్ నటి సనా జావెద్. గతకొంతకాలంగా షోయబ్‌తో సన్నిహితంగా మెదులుతున్నా ఇలా సడన్‌గా నిఖా చేసుకుని షాకిస్తారని ఎవరూ ఊహించలేదు. ఎందుకంటే షోయబ్ తన భార్య సానియా మీర్జాకు విడాకులిచ్చినట్లు ఎక్కడా వెల్లడించలేదు. ఏదో చిన్న సమస్యలు అనుకున్నారే తప్ప నిజంగానే విడిపోయి ఇంత త్వరగా మరో అమ్మాయితో కొత్త జీవితం ప్రారంభిస్తాడని ఎవరూ అనుకోలేదు. చివరకు శనివారం (జనవరి 20)నాడు షోయబ్- సనా జావెద్ షాదీ చేసుకుని ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. క్షణాల్లో ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా తన పేరును కూడా మార్చేసుకుంది సనా. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ నటి తన పేరును సనా షోయబ్ మాలిక్‌గా మార్చుకుంది.