Baldness : బట్టతల సమస్యకు పరిష్కారం.. వాటిని ప్రేరేపించాలి అంటున్న సైంటిస్టులు
బట్టతల సమస్యతో చాలామంది బాధపడుతుంటారు. జన్యు సమస్యలు, మానసిక ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం వంటి కారణాలతో కొందరు పురుషులకు బట్టతల వస్తుంటుంది.
- By Pasha Published Date - 07:37 AM, Mon - 24 June 24

Baldness : బట్టతల సమస్యతో చాలామంది బాధపడుతుంటారు. జన్యు సమస్యలు, మానసిక ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం వంటి కారణాలతో కొందరు పురుషులకు బట్టతల వస్తుంటుంది. కొంత మంది స్త్రీలకు కూడా ఈ ప్రాబ్లమ్ ఎదురవుతుంటుంది. ఈ సమస్యపై పరిశోధనలు చేసిన లండన్‌లోని మాంఛెస్టర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కీలకమైన విషయాలను గుర్తించారు. బట్టతల రావడానికి గల మూల కారణాలు, ఏం చేస్తే బట్టతల సమస్య సమసిపోతుందనే వివరాలను ఈ రీసెర్చ్ ద్వారా తెలుసుకోగలిగామని సైంటిస్టులు వెల్లడించారు.
We’re now on WhatsApp. Click to Join
రీసెర్చ్‌లో గుర్తించిన కొత్త విషయాలివీ..
- బయోలాజికల్ స్ట్రెస్ అనేది జుట్టు కుదుళ్లను చనిపోయేలా చేస్తుంది. అందుకే జుట్టు రాలిపోయి, మళ్లీ రావడం లేదని లండన్‌లోని మాంఛెస్టర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు.
- కొందరికి బాడీలో ఇన్ఫెక్షన్ ఏర్పడినప్పుడు కూడా జుట్టు కుదుళ్లు దెబ్బతింటున్నాయి.
- శరీరానికి సరైన పోషకాలు అందనప్పుడు జుట్టు పెరుగుదల నిలిచిపోతోంది.
- బాడీలో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, శరీరానికి పోషకాలు అందనప్పుడు జుట్టుకు వేళ్లలా ఉండే స్కాల్ప్ కణాలు క్రమక్రమంగా బలహీనంగా మారుతున్నాయి. కొన్నాళ్లకు జుట్టు కుదుళ్లు కూడా పూర్తిస్థాయిలో పని చేయడం లేదు.
- జుట్టు కుదుళ్లకు జరుగుతున్న ఈ నష్టాన్ని ముందుగా గుర్తిస్తే బట్టతల సమస్యకు ఆదిలోనే అడ్డుకట్ట వేయొచ్చని శాస్త్రవేత్తలు చెప్పారు.
- జుట్టు పూర్తిగా పోయాక దాని పునరుత్పత్తి సాధ్యం కాదు. అది రాలిపోయే దశలో సమస్యను గుర్తిస్తేనే, దాన్ని రక్షించుకోవచ్చు.
Also Read :Gautam Adani : గౌతం అదానీ శాలరీ.. వాళ్ల కంటే తక్కువేనట!
- బట్టతల సమస్య(Baldness)తో బాధపడుతున్న వారి సంఖ్య లండన్‌లో రోజు రోజుకు పెరుగుతోంది.
- లండన్‌లోని 50 ఏళ్లలోపు పురుషులలో 85 శాతం మంది, 70 ఏళ్ల వారిలో సగం మంది బట్టతల సమస్యను ఎదుర్కొంటున్నారు.
- లండన్‌లో కీమో థెరపీ, లూపస్, సోరియాసిస్ వంటి ఆరోగ్య సమస్యల వల్ల చాలా మంది జుట్టును కోల్పోతున్నారు.
- కుదుళ్ల నుంచి జుట్టు రావడం ఆగిపోవడానికి కారణం మానసిక ఒత్తిడేనని శాస్త్రవేత్తలు అధ్యయనంలో గుర్తించారు.
- జుట్టు కుదుళ్ల ఆరోగ్యానికి ఆయువుపట్టుగా ఉండే స్కాల్ప్ కణాలను ప్రేరేపించడం ద్వారా జుట్టు పెరుగుదలను యథావిధిగా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది.