Lion Hairstyle: ఏయ్ లయన్! నీ హెయిర్ స్టైల్ అదిరెన్! చైనా సింహం స్టైల్ అదుర్స్
అడవికి రారాజు సింహం. మరి రారాజు అంటే ఎలా ఉండాలి? ఆ దర్జా, దర్పం, హోదా అన్నీ వెలగబెట్టాలి కదా. గర్జించడంలో కాని, హుందాగా నడవడంలో కాని సింహానికి ఎదురులేదు.
- By Hashtag U Published Date - 12:50 PM, Wed - 1 June 22
అడవికి రారాజు సింహం. మరి రారాజు అంటే ఎలా ఉండాలి? ఆ దర్జా, దర్పం, హోదా అన్నీ వెలగబెట్టాలి కదా. గర్జించడంలో కాని, హుందాగా నడవడంలో కాని సింహానికి ఎదురులేదు. ఇక ఆ ముఖాన్ని చూస్తే.. ఎవ్వరికైనా సరే హార్టు బీటు పెరుగుతుంది. మామూలుగా అయితే సింహాలన్నీ ఇంతే. కానీ చైనాలో ఉన్న ఆ సింహాన్ని చూస్తే మాత్రం.. వార్నీ.. సింహం ఇంత అందంగా ఉంటుందా అనిపిస్తుంది.
చైనాలోని గ్వాంగ్జౌ జూలో ఉన్న ఈ సింహాన్ని చూడడానికి సందర్శకులు తెగ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. కానీ చైనాలో ఉన్న కరోనా పరిస్థితుల వల్ల ఎవరూ సరిగా వెళ్లలేకపోయినా.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ లయన్ ను చూసి మాత్రం ముచ్చటపడుతున్నారు. ఎందుకంటే ఈ సింహం బేబీ కటింగ్ లో అందరికీ దర్శనమిస్తోంది. జూ కి వచ్చిన వాళ్లు దీనిని ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇది కాస్తా వైరలైంది.
అసలు ఈ సింహానికి బేబీ కటింగ్ చేసింది ఎవర్రా బాబూ.. నవ్వలేక చచ్చిపోతున్నాం అంటూ క్యాప్షన్ లు పెడుతున్నారు నెటిజన్లు. అయినా సింహం దగ్గరకు వెళ్లాలంటేనే అంతా భయపడతారు. ఇక దానికి బేబీ కటింగ్ చేయాలంటే దమ్ముండాలి. అంతకంటే ముందు ధైర్యముండాలి. అయినా జూ అధికారులు ఇలాంటి వాటికి అనుమతిని ఇవ్వరు. మరి దీని హెయిర్… బేబీ కటింగ్ చేసినట్లుగా ఎలా మారింది?
ఈ ఫోటోలు బాగా వైరల్ అయ్యేసరికి.. జూ అధికారులు స్పందించక తప్పలేదు. సింహానికి వాళ్లు కటింగ్ ఏమీ చేయలేదట. కాకపోతే అక్కడి వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంది. అందుకే ఆ కారణం వల్లే దాని జుట్టు అలా అయ్యుండొచ్చంటున్నారు. మొత్తానికి సింహం రాజా గారి ఫోటోలు మాత్రం వైరల్ అయ్యేసరికి.. దీనికి ఫాలోవర్స్ బాగా పెరిగిపోయారు.
Related News
Russia : చైనాలో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు పుతిన్
Russia: రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) ఐదవసారి బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వత మొదటి సారి తన తొలి విదేశీ పర్యటనలో చైనాలో పర్యటించనున్నారు.మే 16 నుండి 17 వరకు చైనాలో పర్యటిస్తారని చైనా( China) విదేశాంగ ఇప్పటికే ప్రకటించింది. గడిచిన ఎనిమిది నెలల కాలంలో పుతిన్ రష్యాలో పర్యటించడం ఇది రెండోసారి. We’re now on WhatsApp. Click to Join. చైనా పర్యటనలో పుతిన్