HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Ktr Counter To Minister Ponguleti Comments

KTR : అరెస్ట్ కు మేము సిద్దం..ఏం చేస్తారో చేసుకోండి: కేటీఆర్‌ సవాల్‌

KTR : చంద్రబాబు, వైఎస్‌ఆర్‌ వంటి వారితోనే పోరాటం చేశామని.. మీరో లెక్కా అంటూ విరుచుకుపడ్డారు. పొంగులేటి బాంబులు తుస్సే అంటూ వ్యాఖ్యానించారు. తాము ఒరిజనల్ బాంబులకే భయపడలేదన్నారు.

  • Author : Latha Suma Date : 25-10-2024 - 4:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
KTR Counter to Minister Ponguleti Comments
KTR Counter to Minister Ponguleti Comments

KTR Vs Ponguleti Srinivas Reddy : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మంత్రి పొంగులేటీ వ్యాఖ్యల పై స్పందించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాల్లో ఆ పార్టీ నేతలను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దమైందని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. నవంబర్ తొలి వారంలో అరెస్టులు ఉంటాయని చెప్పుకొచ్చారు. దీని పైన స్పందించిన కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేసారు. నిజమైన బాంబులకే తాము భయపడలేదని.. ఏం చేస్తారో చేసుకోమని సవాల్ విసిరారు.

త్వరలోనే బీఆర్ఎస్ నేతల అరెస్టులు తప్పవని..బాంబులు పేలుతాయని మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలానికి కారణమయ్యాయి. తాము ఎలాంటి బాంబులకు భయపడేది లేదని కేటీఆర్ తేల్చి చెప్పారు. చంద్రబాబు, వైఎస్‌ఆర్‌ వంటి వారితోనే పోరాటం చేశామని.. మీరో లెక్కా అంటూ విరుచుకుపడ్డారు. పొంగులేటి బాంబులు తుస్సే అంటూ వ్యాఖ్యానించారు. తాము ఒరిజనల్ బాంబులకే భయపడలేదన్నారు.

దొంగ కేసులు పెడితే పెట్టుకోవాలని..ముందు పొంగులేటి తన ఈడీ కేసులు, మోడీ కాళ్ళు మొక్కిన బాంబుల గురించి చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేసారు. తాము చంద్రబాబు, వైఎస్‌ఆర్‌తోనే కొట్లాడినామని గుర్తు చేసారు. ఈ చిట్టి నాయుడు ఓ లెక్కనా అంటూ వ్యాఖ్యానించారు. అడ్డమైన కేసులు పెట్టి జైలుకు పంపితే పంపు అంటూనే.. ఆర్‌ఆర్ టాక్స్‌లపై తాము వచ్చాక లెక్క తెలుస్తామని హెచ్చరించారు. సీఎం రేవంత్ బామ్మర్ది, పొంగులేటి బాగోతాలు అన్నీ బయటకు తీస్తామని… చావుకు మేం భయపడమని కేటీఆర్ స్పష్టం చేశారు.

సిరిసిల్లలో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ బహిరంగ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. రాష్ట్రంలో కరెంట్ కోతలు ఎక్కువయ్యాయన్నారు. విద్యుత్‌ను వ్యాపార ధోరణిలో చూడొద్దని తెలిపారు. విద్యుత్ భారం కాదని.. బాధ్యతగా ప్రభుత్వం భావించాలని సూచించారు. పేదల నడ్డి విరిచేలా సర్కార్ కుట్ర చేస్తోందని మండిపడ్డారు. రూ.963 కోట్ల చార్జీలు ప్రజల మీద రుద్దుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. విద్యుత్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రజల మీద తాము భారం పడనివ్వలేదని చెప్పుకొచ్చారు. 300 యూనిట్లు దాటితే.. ఒక్క యూనిట్‌కు 50 రూపాయలా.. ప్రభుత్వ ఖజానా నింపుకునేది ఇలాగేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: RS Praveen Kumar : సీఎం రేవంత్ రెడ్డికి పోలీస్ శాఖపై శ్రద్ద లేదు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • BRS leaders Arrests
  • ED Cases
  • Irregularities
  • ktr
  • ponguleti srinivas reddy

Related News

CM Chandrababu: Chandrababu Responds to Pawan's Meeting in Telangana

CM Chandrababu: తెలంగాణలో పవన్ సభపై స్పందించిన చంద్రబాబు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద తెలంగాణకు చెందిన కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. రాష్ట్ర విభజన జరిగి 12 సంవత్సరాలు గడిచిపోయాయని.. ప్రశాంతతను చెడగొట్టవద్దని సూచించారు. ప్రజలకు సేవ చేయడంలో పోటీ పడాలి కానీ.. ఇలాంటి వాటిలో కాదన్నారు. తెలంగాణకు ఎవరు ఎంత చేశారనే దానిపై అక్కడి ప్రజలకు అవగాహన ఉందని చంద్రబాబు అన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన

  • KTR Delivers Strong Counter to Pawan's Remarks

    KTR: పవన్‌ వ్యాఖ్యలపై కేటీఆర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

Latest News

  • Hardik Pandya: ఆఫ్గన్‌తో వన్డే సిరీస్‌ కు ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా ఫిట్‌

  • Pawan Kalyan: స్టీల్‌ ప్లాంట్‌ ఘటన..బాధితులకు పరామర్శ పవన్‌ కల్యాణ్‌

  • Chandrababu Naidu: ఢిల్లీకి సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్.!

  • Visakhapatnam Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించిన మంత్రి నారా లోకేష్

  • Peddi Collections: రూ.300 కోట్ల క్లబ్‌లోకి రామ్ చరణ్ ‘పెద్ది’

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd