Air pollution : ఢిల్లీలో వాయుకాలుష్య కట్టడికి ప్రవేశ మార్గాల పై నిఘా ఉంచండి: సుప్రీంకోర్టు
ట్రక్కుల ప్రవేశాన్ని తనిఖీ చేయడానికి ఎవరూ లేరు. ఢిల్లీ ప్రభుత్వం, పోలీసులు వెంటనే అన్ని ఎంట్రీ పాయింట్ల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలి అని సుప్రీం కోర్టు ఆదేశించింది.
- By Latha Suma Published Date - 06:23 PM, Fri - 22 November 24

Supreme Court : సుప్రీంకోర్టు మరోసారి ఢిల్లీలో వ్యాయుకాలుష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వాయు కాలుష్యాన్ని కట్టడి చేయాలంటే 113 ప్రవేశ మార్గాల వద్ద నిఘా తప్పనిసరిగా ఉండాలని ఢిల్లీ పోలీసులకు ఆదేశాలిచ్చింది. నిషేధం ఉన్నప్పటికీ డీజిల్ ట్రక్కులు, బస్సులు స్వేచ్ఛగా ఢిల్లీ రోడ్లపై తిరుగుతుండటాన్ని సుప్రీంకోర్టు సీరియస్‌గా పరిగణించింది. 113 మార్గాల్లో దాదాపు 100 ఎంట్రీ పాయింట్లు మానవరహితంగా ఉన్నాయి. ట్రక్కుల ప్రవేశాన్ని తనిఖీ చేయడానికి ఎవరూ లేరు. ఢిల్లీ ప్రభుత్వం, పోలీసులు వెంటనే అన్ని ఎంట్రీ పాయింట్ల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలి అని సుప్రీం కోర్టు ఆదేశించింది.
అంతేకాక..13 ఎంట్రీ పాయింట్ల వద్ద రికార్డయిన సీసీటీవీ మెటీరియల్ ను అందజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వాటి పర్యవేక్షణను తనిఖీ చేయాలని బార్ సభ్యులను కోరింది. ఆ నివేదికను బట్టి గ్రాప్ 4 ఆంక్షలపై నిర్ణయం తీసుకుంటామని సుప్రీం తెలిపింది. ఇక జీఆర్ఎ్ప-IV ఆంక్షలు సడలించాలా? వద్దా? అన్న విషయంపై వచ్చే వారం సమీక్షిస్తామని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ మసీహ్లతో కూడిన సుప్రీం ధర్మాసనం తెలిపింది. ఢిల్లీలో ఈ వారంలో వాతావరణ కాలుష్య నాణ్యత ”సివియర్ ప్లస్” స్థాయికి చేరుకోవడంతో ఈ చర్యలు తీసుకున్నారు. దీనిపై సుప్రీం ధర్మాసనం విచారణ సందర్భంగా, మొత్తం 113 ప్రవేశమార్గాల్లో 100 ఎంట్రీ పాయింట్ల వద్ద ట్రక్కుల ప్రవేశంపై చెకింగ్‌లు లేవని, తక్షణం మొత్తం అన్ని చెక్‌పాయింట్ల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.