Kate Middleton : కోమాలో బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్టన్ ?
Kate Middleton : బ్రిటన్ ప్రిన్స్ విలియమ్స్ సతీమణి, యువరాణి కేట్ మిడిల్టన్‌కు ఏమైంది ?
- Author : Pasha
Date : 01-03-2024 - 9:00 IST
Published By : Hashtagu Telugu Desk
Kate Middleton : బ్రిటన్ ప్రిన్స్ విలియమ్స్ సతీమణి, యువరాణి కేట్ మిడిల్టన్‌కు ఏమైంది ? గత డిసెంబరు నుంచి ఆమె ఎక్కడా ఎందుకు కనిపించడం లేదు ? దీనిపైనే ఇప్పుడు బ్రిటన్ అంతటా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆరోగ్య సమస్యలతో ఇటీవల సర్జరీ చేయించుకున్న కేట్.. కోమాలోకి వెళ్లిపోయారంటూ వదంతులు వ్యాపిస్తున్నాయి. కేట్ మిడిల్టన్‌కు పొత్తికడుపులో సర్జరీ అయిందనే విషయాన్ని ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కార్యాలయం జనవరి 17న వెల్లడించింది. ఆమె రెండువారాల పాటు ఆస్పత్రిలో ఉండాల్సి వస్తుందని అప్పట్లో తెలిపింది. ఈ ప్రకటన చేసినప్పటి నుంచి ఇప్పటివరకు యువరాణి కేట్ మిడిల్టన్ బాహ్య ప్రపంచానికి కనిపించలేదు. దీంతో సర్జరీ తర్వాత ఆమె కోమాలోకి జారుకున్నారనే పుకార్లు పుట్టుకొచ్చాయి.
We’re now on WhatsApp. Click to Join
ఇటీవల పలు కార్యక్రమాలలో ప్రిన్స్ విలియం ఒక్కరే పాల్గొనడంతో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. కేట్ మిడిల్టన్ (Kate Middleton) త్వరలోనే ప్రజల ముందుకు వస్తారని బ్రిటన్ రాజకుటుంబ వర్గాలు చెబుతుండగా.. ఆమె పూర్తిగా కోలుకోవడానికి దాదాపు 9 నెలల టైం పట్టొచ్చని బ్రిటన్ మీడియా అంటోంది. ప్రిన్సెస్ కేట్ ప్రతినిధి మాత్రం ఈ ప్రచారాన్ని కుట్రగా అభివర్ణించారు. ‘వేల్స్ యువరాణి ఈస్టర్ తర్వాత, కెన్సింగ్టన్ ప్యాలెస్‌లో ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాల సమయంలోనే ప్రకటన చేస్తుంది.. మేము మొదటి నుంచి ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నాం’ అని తెలిపారు.
బ్రిటన్ రాజ కుటుంబంలో చీమ చిటుక్కమన్నా ప్రపంచానికి వార్తే. ఆ కుటుంబానికి సంబంధించిన ఏ విషయాన్నైనా ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిని ప్రదర్శిస్తుంది. కేట్ మిడిల్టన్ ఆరోగ్యంపై జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారమేనని చెబుతున్నప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం దానిపై పుకార్లు ఆగడం లేదు. మరోవైపు బ్రిటన్ రాజు ఛార్లెస్-3 కి కేన్సర్ నిర్ధరణ అయిందని బకింగ్‌హామ్ ప్యాలెస్ ఇటీవల ప్రకటించింది. ఆయన క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్నారని తెలిపింది. వేల్స్ యువరాణి కేట్ కు శస్త్రచికిత్స జరిగిన ఆసుపత్రిలోనే బ్రిటన్ రాజు కూడా చేరినట్లు తెలుస్తోంది.