VIP arrogance in Bengaluru : ‘మా నాన్న ఎమ్మెల్యే.. నా కారే ఆపుతావా’.. బెంగళూరులో పోలీసులపై ఓ భామ చిందులు
మాట్లాడితే మా నాన్న ఎమ్మెల్యే అంటూ చిందులు తొక్కడం కొంతమందికి ఈమధ్య ఫ్యాషన్ అయిపోయింది.
- By Hashtag U Updated On - 01:28 PM, Fri - 10 June 22

మాట్లాడితే మా నాన్న ఎమ్మెల్యే అంటూ చిందులు తొక్కడం కొంతమందికి ఈమధ్య ఫ్యాషన్ అయిపోయింది. బెంగళూరులో ఆ యువతి కూడా అలాగే ట్రాఫిక్ పోలీసులపై ఫైర్ అయ్యింది. చేసిందే తప్పుడు పని.. పైగా దానిని సమర్థించుకుంది. తిరిగి పోలీసులు, జర్నలిస్టులపై నిప్పులు చెరిగింది. కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ లింబావలీ కూతురు చేసిన నిర్వాకమిది. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి విమర్శలు తప్పలేదు.
ఎమ్మెల్యే అరవింద్ లింబావలీ కూతురు బిఎండబల్యూ కారును డ్రైవ్ చేస్తూ సిగ్నల్ జంప్ చేసింది. రెడ్ సిగ్నల్ పడినా తన కారును ఆపలేదు. దీంతో ఆ వాహనాన్ని గమనించిన పోలీసులు.. రాజ్ భవన్ వద్ద ఆ బండిని ఆపారు. అంతే.. ‘నా కారునే ఆపుతావా’ అంటూ ఆ అమ్మాయి పోలీసులపై ఫైరైంది. అక్కడే ఉన్న విలేకరులతోనూ వాగ్వాదానికి దిగింది. ‘నేనెవరో తెలుసా ఇది ఎమ్మెల్యే వాహనం.. మా నాన్న ఎమ్మెల్యే అరవింద్ లింబావలీ’ అంటూ తన పుట్టుపూర్వోత్తరాలు చెప్పుకొచ్చింది.
తన కారును ఆపొద్దని.. ఓవర్ టేక్ చేసినందుకు తన బండిపై కేసు పెట్టలేరని.. ఎందుకంటే అది ఎమ్మెల్యే అయిన తన తండ్రి వాహనమంటూ పోలీసులనే దబాయించింది. ఆమె అరుపులు కేకలు విని చుట్టుపక్కల వారు రాజ్ భవన్ వద్ద గుమిగూడారు. సీటు బెల్టు కూడా పెట్టుకోకుండా ర్యాష్ గా డ్రైవింగ్ చేసిన ఆమె తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ కారు నెంబర్ కు చలాన్ రాద్దామని చూస్తే.. అప్పటికే రూ.9 వేల చలాన్లు పెండింగ్ లో ఉన్నాయి. దీంతో ట్రాఫిక్ రూల్స్ పాటించనందుకు, నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసినందుకు గాను మరో రూ.1000 ఫైన్ వేశారు. మొత్తం రూ.10 వేలను పోలీసులు ఆమె నుంచి వసూలు చేశారు.
తన కుమార్తె చేసిన తప్పు గురించి తెలిసినా సరే.. ఆ ఎమ్మెల్యే మాత్రం కూతురినే వెనకేసుకొచ్చారు. పైగా ఇలాంటివి రోజూ వేలకొద్దీ జరుగుతుంటాయన్నారు. కానీ ఈ వివాదం పెరిగి పెద్దది కావడంతో నేలకు దిగొచ్చారు. ట్రాఫిక్ పోలీసులు, జర్నలిస్టులకు తన కూతురు తరపున క్షమాపణలు చెప్పారు.
Related News

Traffic : హైదరాబాద్‌లో నేడు ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్ నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఖైత్లాపూర్ ఫ్లైఓవర్ మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభం కానున్న దృష్ట్యా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ అడ్వయిజరీ జారీ చేశారు. ప్రయాణికులు ట్రాఫిక్ పోలీసులు కింద ఇచ్చిన సూచనలను పాటించాలని సూచించారు. ఎర్రగడ్డ నుండి మూసాపేట్ మీదుగా వచ్చే ట్రాఫిక్ మూసాపేట్ జంక్షన్ – వై-జంక్షన్ – కూకట్‌పల్లి – రోడ్ నెం: I, KPHB