Viral Video: ట్రాఫిక్ జామ్ లో చిక్కుకున్న కేంద్రమంత్రి…స్వెటర్లు అల్లుతూ కాలక్షేపం..!!
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో జరుగుతున్న ఉపాధి మేళా కార్యక్రమానికి కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
- By hashtagu Published Date - 07:20 AM, Sun - 23 October 22
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో జరుగుతున్న ఉపాధి మేళా కార్యక్రమానికి కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. యువతకు నియామక పత్రాలు పంపిణీ చేసేందుకు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే కాన్పూర్-లక్నో మధ్య రైల్వే గేటు దగ్గర మంత్రి స్మృతి ఇరానీ ట్రాఫిక్ జామ్ లో చిక్కుకున్నారు. కారులో కూర్చున్న మంత్రి చేసేదేం లేక స్వెటర్లు అల్లుతూ కూర్చున్నారు. దీనికిసంబంధించిన వీడియో కేంద్రమంత్రి తన అధికారిక ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు.
చిన్న సంతోషతోనే ఆనందం అంటూ క్యాప్షన్ జోడించారు. చిన్న చిన్న క్షణాల్లో ఆనందాన్ని వెతుక్కొండి. మీరు ట్రాఫిక్ లో చిక్కుక్కున్నప్పుడు కూడా ఇలాంటి చిన్న చిన్న విషయాలను ఆస్వాదించండంటూ తెలిపారు. ట్రాఫిక్ క్లియర్ అయిన అనంతరం కాన్పూర్ లో జరిగిన ఉపాధి మేళాలో యువతకు నియామక పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా యువతను ఉద్దేశించి ప్రసంగించారు. ఈరోజు మీలో ఉత్సాహం, ఉల్లాసంగా ఉందని..రానున్న రోజుల్లో ఇదే ఉత్సాహాన్ని ప్రజల్లో నింపాలని పిలుపునిచ్చారు.
Related News
Uttar Pradesh: ఇద్దరు యువకులతో మహిళ డాక్టర్ రాసలీలలు
ఉత్తరప్రదేశ్లోని కస్గంజ్ జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళా వైద్యురాలు ఇద్దరు మగ స్నేహితులతో కలిసి ఓ హోటల్లో పట్టుబడింది. సదరు మహిళా వైద్యురాలిని తన భర్త అభ్యంతరకర పరిస్థితుల్లో పట్టుకున్నాడు.