Janwada Farm House : జన్వాడ ఫాం హౌస్ కేసు..విజయ్ మద్దూరికి లుకౌట్ నోటీసులు
పార్టీలో పాల్గొన్న వారికి టెస్టులు నిర్వహించగా విజయ్ మద్దూరికి కొకైన్ పాజిటివ్ గా వచ్చినట్లు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే మద్దూరికి పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
- By Latha Suma Published Date - 05:12 PM, Tue - 12 November 24

Lookout Notices : కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు చెందిన జన్వాడ ఫాం హౌస్ పై పోలీసులు కొన్ని రోజుల కిందట ఆకస్మిక తనిఖీలు చేసి అక్కడ విదేశీ మద్యం బాటిల్స్, కొన్ని మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ పార్టీలో పాల్గొన్న వారికి టెస్టులు నిర్వహించగా విజయ్ మద్దూరికి కొకైన్ పాజిటివ్ గా వచ్చినట్లు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే మద్దూరికి పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దేశం విడిచి పారిపోకుండా ఉండేందుకు విజయ్ మద్దూరికి లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. జన్వాడ ఫాం హౌస్ పార్టీలో పాల్గొన్న వారికి కొకైన్ డ్రగ్ పాజిటివ్ రావటంతో మోకిల పోలీసులు NDPC సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
అయితే ఈ కేసులో విచారణ జరుగుతుండడంతో డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చేయన్న దానిపై అధికారులు ఫోకస్ చేశారు. ఇంతకీ డ్రగ్స్ ఎక్కడ తీసుకున్నాడు? ఆయన ఫోన్ విషయంలో పోలీసులను తప్పుదోవ పట్టించాడట. పట్టుబడిన రోజు తన ఫోన్ కాకుండా, మరో మహిళ ఫోన్‌ను పోలీసులకు అందజేశాడు. దీనిపై మరో కేసు నమోదు చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. అంతేకాక..విజయ్ ఎవరి ద్వారా డ్రగ్స్ తీసుకున్నాడనే దానిపై ఆరా తీస్తున్నారు. అరెస్ట్ కాకుండా ముందగా న్యాయస్థానాన్ని సంప్రదించాడు. విచారణకు సహకరించకుండా మరో దేశానికి వెళ్తాడనే సమాచారం పోలీసులకు వచ్చింది. దీంతో విజయ్‌కు పోలీసులు లుక్ అవుట్ నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది.
మరోవైపు ఈ వ్యవహారంపై కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. ఫ్యామిలీ పార్టీ, ఫ్యామిలీ గెట్ టుగేదర్ పేరుతో డ్రగ్స్, మత్తు పదార్థాలు తీసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. రేవంత్ ప్రభుత్వం మాత్రం డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపుతామని చెబుతోంది. ఇందులో ఎంత పెద్ద వాళ్లు ఉన్న వదిలిపెట్టేది లేదని, యువత జీవితాలు నాశనం అవుతాయని కాంగ్రెస్ ప్రభుత్వం విషయాన్ని సీరియస్ గా తీసుకుంది.
Read Also: lagacherla Incident : సీఎం రేవంత్ ను బ్రోకర్ తో పోల్చిన ఈటెల..