Watch Video: లైక్స్ కన్నా లైఫ్ ముఖ్యం.. వైరల్ అవుతున్న వీడియో!
ఈ జనరేషన్ అంతా సోషల్ మీడియాలో మునిగితేలుతుంది.
- Author : Balu J
Date : 14-07-2022 - 2:52 IST
Published By : Hashtagu Telugu Desk
ఈ జనరేషన్ అంతా సోషల్ మీడియాలో మునిగితేలుతుంది. తమకు నచ్చేవిధంగా ఫొటోలు, సెల్ఫీలను తీసుకుంటూ ఇన్ స్టాలోనో, ఫేస్ బుక్ లోనో ఆప్ లోడ్ చేసుకుంటూ కామెంట్లతో బతికేస్తున్నారు. సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించుకోవడం ప్రాణాలకు సైతం తెగించి సెల్ఫీలు తీసుకుంటున్నారు. అయితే దేశమంతా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొంతమంది సముద్ర తీరానికి వెళ్లి ఫొటోషూట్, సెల్ఫీలు దిగే ప్రయత్నం చేస్తారు. అలల ముందు ఆడుకుంటూ తమను తాము మరిచిపోతారు.
ఒక్కసారిగా అలలు వాళ్లపై విరుచుకపడటంతో దాదాపు ఎనిమిది మంది గల్లంతయ్యారు. సకాలంలో గజఈతగాళ్లు స్పందించి రక్షించడంతో కాపాడారు. అయితే ఎనిమిది మందిలో ముగ్గురు అచూకీ తెలియడం లేదు. సముద్రంలో గల్లంతైన వాళ్ల వీడియోను IPS అధికారి దీపాంషు కబ్రా ట్విట్టర్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. లైక్స్ కన్నా లైఫ్ ముఖ్యం అంటూ క్యాప్షన్ ఇచ్చిన వీడియో ప్రతిఒక్కరినీ ఆలోచింపజేస్తోంది.
Your "Life" is more important than your "Likes". pic.twitter.com/3XNjyirbwJ
— Dipanshu Kabra (@ipskabra) July 13, 2022