Pooja Hegde Tweet:హీరోయిన్ పూజాహెగ్డేకు అవమానం..ఏం జరిగిదంటే.!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్, పొడుగుకాళ్ల సుందరి పూజా హెగ్డే...ప్రస్తుతం తన హవా కొనసాగుతోంది. టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉంది ఈ అమ్మడు.
- By hashtagu Published Date - 07:54 PM, Thu - 9 June 22

టాలీవుడ్ స్టార్ హీరోయిన్, పొడుగుకాళ్ల సుందరి పూజా హెగ్డే…ప్రస్తుతం తన హవా కొనసాగుతోంది. టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉంది ఈ అమ్మడు. తెలుగు ఇండస్ట్రీలోనే కాదు…ఇతర సినీ ఇండస్ట్రీల్లోనూ సత్తా చాటుతోందీ బ్యూటీ. అయితే తాజాగా పూజా హెగ్డే చేసిన ఓ ట్వీట్ తెగ వైరల్ అయ్యింది. ఇండిగో -6 ఈ స్టాఫ్ సిబ్బంది తనతో అసభ్యంగా ప్రవర్తించారని ట్వీట్ చేసింది.
ముంబై నుంచి ఇండిగో -6ఈ విమానంలో బయలుదేరిన పూజా విపుల్ నకాషే అనే స్టాఫ్ అసభ్యంగా ప్రవర్తించడాని చెప్పింది. నేను ముంబైలో ఇండిగో -6ఈ విమానంలో ఎక్కాను. విమాన స్టాఫ్ విపుల్ నకాషే ఎలాంటి కారణం లేకుండా అసభ్యంగా ప్రవర్తించాడు. అహంకారంతో బెదిరింపులకు పాల్పడ్డాడు. మాపై గట్టిగా అరిచాడు. నిజంగా అతడి మాటలు విని చాలా భయం వేసింది. సాధారణంగా ఇలాంటి విషయాలను నేను పట్టించుకోను. కానీ ఈ వ్యక్తి ప్రవర్తన చూసి భయమేసింది. అని ట్వీట్ చేసింది.
ఇక పూజా ట్వీట్ పై నెటిజన్లు రియాక్ట్ అయ్యారు. ఆమె అభిమానులు మాత్రం ఆ వ్యక్తిపై నిప్పులు కురిపిస్తున్నారు. మరికొందరు తొందర ఎందుకు…ఆ వ్యక్తి మాటలు కూడా వినాలి కదా…అప్పుడు అతడిపై యాక్షన్ తీసుకోవచ్చని అంటున్నారు. మొత్తానికి పూజ చేసిన ట్వీట్ మాత్రం తెగ వైరల్ అయ్యింది.
Extremely sad with how rude @IndiGo6E staff member, by the name of Vipul Nakashe behaved with us today on our flight out from Mumbai.Absolutely arrogant, ignorant and threatening tone used with us for no reason.Normally I don’t tweet abt these issues, but this was truly appalling
— Pooja Hegde (@hegdepooja) June 9, 2022