HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Speed News
  • >Indias Debt Increased By 181 Percent In Last 9 Years To 155 Lakh Crore

Indias Debt Explained : మోడీ హయాంలో రూ.100 లక్షల కోట్ల అప్పు

Indias Debt Explained : మన దేశానికి ఎంత అప్పు ఉంది ? స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఇండియా చేసిన అప్పులు ఎన్ని ?గత 9 ఏళ్ళ బీజేపీ హయాంలో మన దేశం తీసుకున్న లోన్స్ ఎన్ని ? 

  • By Pasha Published Date - 02:59 PM, Mon - 19 June 23
  • daily-hunt
Indias Debt Explained
Indias Debt Explained

Indias Debt Explained : మన దేశానికి ఎంత అప్పు ఉంది ? 

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఇండియా చేసిన అప్పులు ఎన్ని ?

గత 9 ఏళ్ళ బీజేపీ హయాంలో మన దేశం తీసుకున్న లోన్స్ ఎన్ని ? 

లోన్స్ తీసుకొని, ఖర్చు చేసే విషయంలో మోడీ సర్కారుకు, మన్మోహన్ సర్కారుకు  ఉన్న తేడాలు ఏమిటి ?

ఇటువంటి ఆసక్తికర వివరాలతో ఓ జాతీయ మీడియా సంస్థ చక్కటి విశ్లేషణ అందించింది.. ఆ వివరాలు చూద్దాం..   

దేశంలోని 14 మంది ప్రధానులు కలిసి గత  67 ఏళ్లలో మొత్తం రూ.55 లక్షల కోట్ల రుణం తీసుకున్నారు. గత 9 ఏళ్లలో ప్రధాని నరేంద్ర మోడీ మన దేశ రుణాన్ని 3 రెట్లు పెంచారు. ఆయన నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత 9 సంవత్సరాలలో 100 లక్షల కోట్ల రూపాయలకు పైగా రుణం తీసుకుంది. 2014లో భారత  ప్రభుత్వంపై ఉన్న మొత్తం అప్పు రూ.55 లక్షల కోట్లు కాగా, ఇప్పుడది (2023లో)  181% పెరిగిపోయి రూ.155 లక్షల కోట్లకు చేరింది. ఈ వివరాలను కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాతే జూన్ 10న మీడియాకు  తెలిపారు. అప్పటి నుంచి భారత ప్రభుత్వ రుణంపై వాడివేడి చర్చ జరుగుతోంది. ఈనేపథ్యంలో ఆ సమాచారంలోని వాస్తవికతపై సదరు మీడియా సంస్థ పరిశీలన జరపగా కొన్ని ఆసక్తికర వివరాలు(Indias Debt Explained) వెల్లడయ్యాయి.   

  • భారత ప్రభుత్వంపై ఉన్న అప్పు ఎంత ?

→ కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 2023 మార్చి 31 వరకు భారత ప్రభుత్వం రూ.155 లక్షల కోట్ల అప్పులు చేసింది. వచ్చే ఏడాది మార్చి నాటికి ఇది రూ.172 లక్షల కోట్లకు పెరగొచ్చు.

→ ప్రభుత్వ అప్పులపై  2023 మార్చి 20న ఎంపీ నాగేశ్వరరావు అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2023 మార్చి 31  వరకు భారత ప్రభుత్వం రూ. 155 లక్షల కోట్ల అప్పులు చేసిందని చెప్పారు. దీని ప్రకారం గత 9 ఏళ్లలో దేశ రుణభారం 181% పెరిగింది.

  • 2004లో భారత ప్రభుత్వంపై ఎంత అప్పు ఉంది ? అది ఎలా పెరిగింది?

→ 2004లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు భారత ప్రభుత్వంపై ఉన్న మొత్తం అప్పు రూ. 17 లక్షల కోట్లు. 2014 నాటికి ఇది మూడు రెట్లు పెరిగి రూ.55 లక్షల కోట్లకు చేరుకుంది. ప్రస్తుతం భారత ప్రభుత్వంపై ఉన్న మొత్తం అప్పు రూ.155 లక్షల కోట్లు.

Also read : States Debt: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు తీసుకున్న అప్పులు!

  • దేశంలోని ప్రతి వ్యక్తిపై 9 సంవత్సరాలలో ఎంత అప్పు పెరిగింది?

→  2014-15 ఆర్థిక సంవత్సరం ప్రకారం.. అప్పుడు భారత ప్రభుత్వంపై ఉన్న మొత్తం అప్పు 55 లక్షల కోట్ల రూపాయలు. 2014లో దేశ జనాభా మొత్తం 130 కోట్లుగా అంచనా వేస్తే, అప్పట్లో ప్రతి భారతీయుడిపై ఉన్న సగటు అప్పు దాదాపు 42 వేల రూపాయలు. ఇప్పుడు 2023లో భారత ప్రభుత్వంపై ఉన్న మొత్తం అప్పు రూ.155 లక్షల కోట్లకు పెరిగింది. భారతదేశం యొక్క మొత్తం జనాభా 140 కోట్లు అని ఊహిస్తే, నేటి కాలంలో ప్రతి భారతీయునికి 1 లక్ష రూపాయల కంటే ఎక్కువ అప్పు ఉంది. విదేశీ అప్పుల గురించి మాట్లాడితే 2014-15లో భారతదేశ విదేశీ అప్పు రూ.31 లక్షల కోట్లు. ఇప్పుడు 2023లో భారతదేశ విదేశీ అప్పు రూ.50 లక్షల కోట్లకు పెరిగింది.

Cash

  • విదేశీ రుణాలు తీసుకునే విషయంలో యూపీఏ ప్రభుత్వం ముందుందా? ఎన్‌డీఏ ప్రభుత్వం ముందుందా?

→   2014లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందు, భారత ప్రభుత్వ రుణాన్ని తగ్గిస్తామని  ప్రజలకు బీజేపీ వాగ్దానం చేసింది. అయితే గత 9 సంవత్సరాలలో దేశ అప్పులు పెరిగాయి. 2014 నుంచి 2023 వరకు తొమ్మిదేళ్లలో మోడీ ప్రభుత్వం విదేశాల నుంచి రూ.19 లక్షల కోట్ల రుణం తీసుకోగా..  2005 నుంచి 2013 వరకు తొమ్మిదేళ్లలో యూపీఏ ప్రభుత్వం దాదాపు రూ.21 లక్షల కోట్ల విదేశీ రుణం తీసుకుంది. 2005లో దేశ విదేశీ అప్పు 10 లక్షల కోట్లు కాగా, 2013 నాటికి 31 లక్షల కోట్లకు పెరిగింది. అంటే 9 ఏళ్లలో విదేశీ అప్పు రూ.21 లక్షల కోట్లు పెరిగింది. 2014 నుంచి 2022 వరకు విదేశీ అప్పు రూ.33 లక్షల కోట్ల నుంచి రూ. 50 లక్షల కోట్లకు పెరిగిందని.. అంటే ఈ 9 ఏళ్లలో విదేశీ అప్పు రూ.19 లక్షల కోట్లు పెరిగింది. 2014 తర్వాత ఎన్‌డీఏ ప్రభుత్వంలో దేశ అప్పులు తగ్గలేదని దీన్ని బట్టి స్పష్టమవుతోంది.

  • ఏ కారణాల వల్ల దేశ ప్రభుత్వంపై రుణభారం పెరుగుతోంది ?

→    ప్రభుత్వ రుణం అనేది ప్రభుత్వ ఆదాయం ఎంత ?  ప్రభుత్వ వ్యయం ఎంత ? అనే రెండు విషయాలపై ఆధారపడి ఉంటుంది. ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉంటే ప్రభుత్వమే రుణం తీసుకోవాలి. ప్రభుత్వం రుణం తీసుకున్న వెంటనే రెవెన్యూ లోటు పెరుగుతుంది. అంటే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ. సాధారణంగా ప్రభుత్వం రుణం రాబడి రాని చోట ఖర్చు చేస్తే రెవెన్యూ లోటు ఎక్కువగా ఉంటుంది.

  • అప్పులు తీసుకుంటున్న డబ్బును భారత సర్కారు ఎక్కడ ఖర్చు చేస్తోంది ?

→    2020 లో కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచి భారత ప్రభుత్వం ప్రజలకు అనేక రకాల సబ్సిడీలను ఇస్తోంది. ప్రతి నెల 80 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాలు, . ఉజ్వల పథకం కింద సుమారు 10 కోట్ల మంది మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు, సుమారు 9 కోట్ల మంది రైతులకు ఏటా 3. 6 వేల రూపాయలు,  ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రెండు కోట్ల మందికి ఇళ్లు నిర్మించడంలో ఆర్థిక సహాయం ఇస్తున్నారు.

cash

  • దేశంపై ఉన్న అప్పుకు, ద్రవ్యోల్బణానికి మధ్య సంబంధం ఏమిటి?

→ దేశం అప్పులు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుందా అనేది అందరి మదిలో మెదులుతున్న ఒక ప్రశ్న. దీనికి ఆన్సర్ ఏమిటంటే..   దేశంపై పెరుగుతున్న అప్పులకు ద్రవ్యోల్బణంతో ప్రత్యక్ష సంబంధం లేదు. ప్రభుత్వం తీసుకున్న రుణాన్ని.. దేశ ఆదాయాన్ని పెంచుకోవడానికి వినియోగిస్తుంది. ఈవిధంగా అప్పుగా తెచ్చిన  డబ్బు మార్కెట్‌లోకి వస్తే అది ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుతుంది. రుణం సొమ్ము దుర్వినియోగం అయితే ద్రవ్యోల్బణం కూడా పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు.

  • ప్రపంచంలో అత్యధికంగా అప్పులు తీసుకుంటున్న దేశాలు ఏవి ?

→ ప్రపంచంలో అత్యధికంగా అప్పులు తీసుకున్న దేశాలలో జపాన్ ముందంజలో ఉంది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశం అమెరికా కూడా రుణాలు తీసుకునే విషయంలో భారత్ కంటే ముందుంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 14 Prime Ministers
  • 155 lakh crore
  • 2014
  • 2023
  • 9 years
  • government of india
  • India debt
  • Indias Debt Explained
  • money
  • pm narendra modi
  • total loan

Related News

Zodiac Signs

Zodiac Signs: ఈ రాశుల వారు చిన్న వయస్సులోనే ధనవంతులు అవుతారు!!

మకర రాశి వారు సహజంగానే కష్టపడి పనిచేస్తారు. వీరు తమ ఆర్థిక లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకుని, వాటిని సాధించడానికి ప్రణాళికలు వేసుకుంటారు. దీని ఫలితంగా వీరు చిన్న వయస్సులోనే చాలా డబ్బు సంపాదిస్తారు.

    Latest News

    • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

    • Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

    • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

    • Delhi : తీహార్‌ జైలును పరిశీలించిన బ్రిటన్‌ అధికారులు.. భారత్‌కు నీరవ్ మోదీ, మాల్యాను అప్పగిస్తారా..?!

    • ACB Court : ఏపీ లిక్కర్ స్కామ్ కేసు..ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd