Pratima Bhullar : ఇండియా ఆడబిడ్డకు అమెరికాలో టాప్ పోలీస్ పోస్ట్
అమెరికాలో భారత సంతతి ప్రజలు ఆకాశమే హద్దుగా అవకాశాలను అందుకుంటున్నారు. తాజాగా భారత సంతతికి చెందిన మహిళా పోలీస్ అధికారి కెప్టెన్ ప్రతిమ భుల్లార్ మాల్డోనాడో(Pratima Bhullar) న్యూయార్క్ పోలీస్ విభాగంలో అత్యున్నత ర్యాంక్ పొందారు.
- By Pasha Published Date - 01:57 PM, Fri - 19 May 23

అమెరికాలో భారత సంతతి ప్రజలు ఆకాశమే హద్దుగా అవకాశాలను అందుకుంటున్నారు. తాజాగా భారత సంతతికి చెందిన మహిళా పోలీస్ అధికారి కెప్టెన్ ప్రతిమ భుల్లార్ మాల్డోనాడో(Pratima Bhullar) న్యూయార్క్ పోలీస్ విభాగంలో అత్యున్నత ర్యాంక్ పొందారు. ఈ పోస్ట్ పొందిన తొలి దక్షిణాసియా మహిళగా ఆమె రికార్డుల్లోకి ఎక్కింది. క్వీన్స్ ఏరియాలోని రిచ్‌మండ్ హిల్‌లో ఉన్న 102వ పోలీస్ స్టేషన్‌కు ఇన్‌ఛార్జ్ గా ఉన్న ఆమెకు.. ఈ ఏడాది ఏప్రిల్‌లో కెప్టెన్‌గా ప్రమోషన్ లభించింది. నలుగురు పిల్లల తల్లి అయిన ప్రతిమ (Pratima Bhullar) మన దేశంలోని పంజాబ్‌లో జన్మించారు. ప్రతిమ 9 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు.. ఆమె పేరెంట్స్ అమెరికాకు వెళ్లారు. అక్కడ న్యూయార్క్‌లోని క్వీన్స్‌లో సెటిల్ అయ్యారు. ప్రతిమ ఉంటున్న సౌత్ రిచ్‌మండ్ హిల్ ఏరియా అమెరికాలోని అతిపెద్ద సిక్కు ప్రాబల్య ఏరియాలలో ఒకటి.
ALSO READ : Indian-American Neera Tanden: జో బైడెన్ ప్రభుత్వంలో మరో భారత సంతతి మహిళకు చోటు..!
తనకు దక్కిన గౌరవం పట్ల ప్రతిమ (Pratima Bhullar) ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ” ఇక్కడ భాషాపరమైన అవరోధాలు ఉన్నాయి. ఇలా ఇబ్బందులుపడే వాళ్ళను నేను ప్రత్యక్షంగా చూశాను. ఈసందర్భంగా ఆమె తన తండ్రిని గుర్తుచేసుకున్నారు. న్యూయార్క్ పోలీస్ శాఖలోని 33,787 మంది సిబ్బందిలో 10.5 శాతం మంది ఆసియా మూలాలున్నవాళ్ళు ఉన్నారు” అని ప్రతిమ చెప్పారు.