Income Tax : లోక్‌సభ ఎన్నికల వేళ.. రూ.1100 కోట్ల సోమ్ము సీజ్: ఐటీశాఖ
- By Latha Suma Published Date - 01:48 PM, Fri - 31 May 24

Income Tax Department: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశంలో ఆదాయపన్ను శాఖ దాడులు నిర్వహించింది. అయితే ఆ సోదాల్లో దాదాపు 1100 కోట్ల విలువైన నగదు, నగలను సీజ్ చేశారు. ఈసారి ఆదాయ పన్నుశాఖ అధికారులు రికార్డు స్థాయిలో డబ్బు, బంగారం, మద్యం, డ్రగ్స్‌ను జప్తు చేశారు. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన మార్చ్ 16వ తేదీ నుంచి.. మే 30వ తేదీ లోపు జప్తు చేసిన మొత్తం విలువ ఏకంగా 11 వందల కోట్లు ఉంటుందని అంచనా. 2019లోక్‌సభ ఎన్నికల వేళ 390 కోట్ల విలువ చేసే బంగారం, డబ్బును సీజ్ చేయగా ప్రస్తుతం అది అంతకు 182 శాతం ఎక్కువని ఐటీ శాఖ ప్రకటించింది. ఇదంతా ఓటర్లను ప్రభావితం చేయగల, లెక్కల్లో చూపని సొమ్ముగా పేర్కొంది.
We’re now on WhatsApp. Click to Join.
అత్యధికంగా ఢిల్లీ, కర్ణాటకల నుంచే సొమ్ము సీజ్ చేసినట్లు వెల్లడించింది. ఒక్కో రాష్ట్రంలో 200 కోట్లకు పైగా విలువైన నగదు, ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత తమిళనాడులో 150 కోట్లకు పైగా.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశాలలో 100 కోట్లకు పైగా విలువైన ఆస్తులను జప్తు చేశారు.
Read Also: WI vs Aus T20 World Cup: వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై వెస్టిండీస్ విజయం
కాగా, ఈ ఏడాది మే 16వ తేదీ నుంచి ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ నాటి నుంచి ఐటీ శాఖ అన్ని రాష్ట్రాల్లోనూ దాడులు, సోదాలు, తనిఖీలను పెంచేసింది. ఓటర్లను ప్రభావితం చేసేందుకు వాడుతున్న డబ్బును సీజ్ చేశారు. ఢిల్లీ, కర్నాటక రాష్ట్రాల్లో అత్యధిక మొత్తంలో అమౌంట్‌ను సీజ్ చేశారు. ఈ రెండు రాష్ట్రాల్లో రెండు వందల కోట్లకు పైగా నగదు, జ్వలరీని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత లిస్టులో తమిళనాడు ఉన్నది. ఆ రాష్ట్రంలో 150 కోట్ల వరకు సీజ్ చేశారు.