Megapixel or Sensor : ఫోన్ తో ఫోటో.. కెమెరా ముందా ? సెన్సర్ ముందా ?
Megapixel or Sensor : మీరు మొబైల్ ఫోన్ తో బెస్ట్ ఫోటో తీయాలనుకుంటే.. మెగాపిక్సెల్ ముఖ్యమా లేదా సెన్సర్ ముఖ్యమా ? ఫోన్ కెమెరాలోని మెగాపిక్సెల్, సెన్సర్ లలో దేనికి ఎక్కువ వెయిటేజీ ఇవ్వాలి ? కెమెరా మెగాపిక్సెల్‌లు ఎంత ఎక్కువ ఉంటే.. ఫోటో అంత బాగా వస్తుందని మనం భావిస్తాం. ఇందులో నిజమెంత ? మరి ఫోన్ కెమెరాలోని సెన్సర్ సంగతేంటి ?
- By Pasha Published Date - 12:05 PM, Tue - 30 May 23

Megapixel or Sensor : మీరు మొబైల్ ఫోన్ తో బెస్ట్ ఫోటో తీయాలనుకుంటే.. మెగాపిక్సెల్ ముఖ్యమా లేదా సెన్సర్ ముఖ్యమా ?
ఫోన్ కెమెరాలోని మెగాపిక్సెల్, సెన్సర్ లలో దేనికి ఎక్కువ వెయిటేజీ ఇవ్వాలి ?
కెమెరా మెగాపిక్సెల్‌లు ఎంత ఎక్కువ ఉంటే.. ఫోటో అంత బాగా వస్తుందని మనం భావిస్తాం.
ఇందులో నిజమెంత ? మరి ఫోన్ కెమెరాలోని సెన్సర్ సంగతేంటి ?
“పిక్సెల్” అనేది డిజిటల్ ఇమేజ్‌ని లెక్కించడానికి ఉపయోగించే అతిచిన్న కొలతకు సంబంధించిన ఒక యూనిట్. ఒక మెగాపిక్సెల్ (MP) లో 10 లక్షల పిక్సెల్ లు ఉంటాయి.అందుకే దీన్ని “మిలియన్ పిక్సెల్స్”(Megapixel or Sensor) అని కూడా పిలుస్తారు. మీటర్లను కిలోమీటర్‌లుగా మార్చి లెక్కించినట్టే.. పిక్సెల్‌లను మెగాపిక్సెల్‌లుగా మార్చి లెక్కిస్తారు. డిజిటల్ వీడియో, స్టిల్ ఇమేజ్‌ల రిజల్యూషన్‌ను చెప్పడానికి మెగాపిక్సెల్‌లను ఉపయోగిస్తారు. ఫోటోలను స్కాన్ చేస్తున్నప్పుడు , ప్రింట్ చేస్తున్నప్పుడు స్కానర్ లేదా ప్రింటర్.. అందులోని డాట్స్ పర్ ఇంచ్ (DPI)ను లెక్కిస్తుంది. ఈజీగా చెప్పాలంటే ఎక్కువ మెగాపిక్సెల్స్ ఉన్న ఇమేజ్‌కి ఎక్కువ రిజల్యూషన్ ఉంటుంది. మెగా పిక్సెల్స్ తక్కువ ఉన్న ఫోటోను పెద్ద సైజులోకి మార్చే ప్రయత్నం చేస్తే అది బ్లర్ అవుతుంది. ఇటీవలి కాలంలో డిజిటల్ ఫోటోగ్రఫీ టెక్నాలజీ చాలా పెరిగింది. మీ ఫోటోగ్రఫీ అవసరాలను తీర్చడానికి తగినన్ని మెగాపిక్సెల్స్ ఉన్న కెమెరాను తీసుకోవడం ముఖ్యమని తెలుసుకోండి. 4K కెమెరాలు , మిర్రర్‌లెస్ కెమెరాలు, డిజిటల్ వీడియో కెమెరాలలో మంచివి మనం కొనొచ్చు.
సెన్సర్ అంటే..?
ఫోన్ లోని కెమెరా లోపల దిగువ భాగంలో సెన్సర్ ఉంటుంది. ఈ సెన్సర్‌లోనే పిక్సెల్స్ ఉంటాయి. సెన్సర్‌లో ఉన్న ప్రతి పిక్సెల్ కాంతి, రంగు, కాంట్రాస్ట్‌ను సంగ్రహిస్తుంది. మనం ఫోన్ ద్వారా తీసే ఫోటోల క్వాలిటీని సెన్సరే డిసైడ్ చేస్తుంది. సెన్సర్ లో మెగా పిక్సెల్స్ ఎంత ఎక్కువ ఉంటే .. ఫోటో అంత హాయ్ క్వాలిటీతో ఉంటుంది. సెన్సర్ అనేది కాంతిని సంగ్రహించి.. దానిని సిగ్నల్‌లుగా మారుస్తుంది. దీని ఫలితంగా ఇమేజ్ వస్తుంది. కెమెరా సెన్సార్ పెద్ద సైజులో ఉంటే.. మెరుగైన నాణ్యత గల ఫోటోలు వస్తుంటాయి.
Also read : Camera Phone: హైక్వాలిటీ కెమెరా ఫోన్ కోసం చూస్తున్నారా..?రియల్ మీ బెస్ట్ ఆప్షన్…!
ఒక ఉదాహరణ..
ఎక్కువ పిక్సెల్స్ ఉంటేనే మీ కెమెరా మంచి క్వాలిటీ ఫోటో తీస్తుందని కాదు. ఉదాహరణకు మీరు ఐఫోన్ కెమెరాను చూస్తే.. దాని కెమెరాలో మెగాపిక్సెల్‌లు చాలా తక్కువగా ఉన్నాయి. కానీ దానితో తీసే ఫోటో క్వాలిటీ 100MP కెమెరాకు ధీటుగా ఉంటుంది. దీనికి కారణం ఐఫోన్ కెమెరా లోని సెన్సర్. సెన్సర్ పరిమాణం అనేది కూడా ఫోటో నాణ్యతను నిర్ణయిస్తుంది.
కెమెరాలో Depth Option , macro mode..
స్మార్ట్ ఫోన్ లోని బ్యాక్ కెమెరా లో ఎక్కువ మెగా పిక్సెల్స్ ఉన్నకారణంగా మంచి ఫోటో తీయడానికి వీలవుతుంది. అయితే ఇది డెప్త్ పిక్సెల్స్ కు పనికిరాదు. అంటే పిక్చర్లో రెండు ఆబ్జెక్ట్ ల మధ్య లోతును సరిగా చూపించలేదు. అందుకే డ్యూయల్ కెమెరా లో Depth Option కొరకు ఒక portrait కెమెరాను ఉపయోగించారు. ఇది Depth Option ను బాగా కవర్ చేస్తుంది. ఇక్కడ object క్లియర్ గా ఉండి, మిగితాది అంతా blur గా కనిపిస్తుంది. మీ దగ్గర back కెమెరాలో రెండు కెమెరాలు ఉంటే… ఈ portrait modeను ఉపయోగించవచ్చు. ఇక నాలుగో కెమెరా విషయానికి వస్తే అది macro mode . ఈ నాలుగో కెమెరా వేరువేరు మొబైల్స్ లో వేరువేరు విధాలుగా ఉపయోగించవచ్చు. అది వైడ్ యాంగిల్ కెమెరాగా కానీ… మాక్రో కెమెరాగా కానీ… Fish eye lenseగా కానీ… Extra 10x zoom గా కానీ ఇవ్వవచ్చు. మన ఫోన్ లో ఎన్ని కెమెరాల అయినా ఉండనీయండి దానిని సరిగా వాడకపోతే ఏ ఉపయోగం లేదు… అందుకే ఎక్కువగా ఖర్చు చేయకుండా ఎంత వరకు అవసరమో దానికి తగిన ఫోన్ ను తీసుకోండి.