Mukesh Ambani’s Chef: ముకేశ్ అంబానీ ‘వంట మనిషి’ జీతం ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
అయితే ముఖేష్ సంపాదన గురించి చాలామందికి కొద్దో గొప్పో తెలిసే ఉంటుంది. కానీ వాళ్ల ఇంట్లో పనిచేసేవాళ్ల జీతాలు
- By Balu J Updated On - 01:12 PM, Thu - 16 March 23

వరల్డ్ రెచెస్ట్ పర్సన్స్ లో ముకేశ్ అంబానీ (Mukesh Ambani) ఒకరు. అయితే ముఖేష్ సంపాదన గురించి చాలామందికి కొద్దో గొప్పో తెలిసే ఉంటుంది. కానీ వాళ్ల ఇంట్లో పనిచేసేవాళ్లకు ఆయన ఎంతమేరకు జీతాలు ఇస్తారనే విషయం తెలియదు. అయితే ఇటీవలే అంబానీ (Mukesh Ambani)) డ్రైవర్ సంపాదన వైరల్ గా మారిన విషయం తెలిసిందే. నెలకు రూ.2 లక్షల వరకు వేతనం ఇస్తారని తెలిసింది. ఎమ్మెల్యేల కంటే చాలా ఎక్కువట. అంబానీ ఏం తింటారో తెలుసుకునేందుకు ప్రత్యేకంగా చెఫ్ (Chef) ఒకరు ఉంటారు కూడా.
ఇతను రోజూ ముఖేష్ కు కావల్సినవి వండిపెట్టడమే ఇతని పని. ఇతని జీతం నెలకు 2 లక్షల పైనే. ఇతనికే కాదు అంబానీ (Mukesh Ambani) నివాసంలో పనిచేసే ప్రతి సిబ్బందికీ దాదాపు ఇంతే మొత్తంలో వేతనం ఉంటుందని సమాచారం. ఇక నెల జీతంతో పాటు ఇన్సూరెన్స్, పిల్లలకు ట్యూషన్ ఫీజులను కూడా అందిస్తారట. కొద్దిరోజుల కిందట అంబానీ వ్యక్తిగత డ్రైవర్ నెల వేతనం గురించి మీడియాల్లో వార్తలు వచ్చాయి. పెద్ద పెద్ద ప్రముఖుల ఇళ్లల్లో పనిచేసే డ్రైవర్లను ఏజెన్సీల ద్వారా నియమించుకుంటారు.
అంబానీ ఇంట్లో డ్రైవర్ కూడా ఇలాగే వెళ్లారు. ఇక ఆయనకు కూడా ఐదేళ్ల కిందట నెలకు రూ.2 లక్షలు చెల్లించేవారట అంబానీ. ఇప్పుడు అది ఇంకా చాలా ఎక్కువే ఉండొచ్చు. తాజాగా దిల్లీ ఎమ్మెల్యేల (MLA’s) వేతనాలు 66 శాతం పెరిగాయి. దీంతో దిల్లీలో ఎమ్మెల్యే సగటున నెల జీతం రూ.90 వేలు అందుకుంటున్నారట. ఇక అంబానీ ఇంట్లో పనిచేసే సిబ్బంది నెలకు రూ.2 లక్షలు సహా అదనంగా ఇతర ప్రయోజనాలు పొందుతున్నారు. దీంతో అంబానీ ఇంట్లో పని చేసే వంటమనిషి జీతం .. దేశంలోని చాలా మంది ఎమ్మెల్యేల కంటే ఎక్కువ అని లెక్కలు గడుతున్నారు.
Also Read: Rashmika Mandanna: నేషనల్ క్రష్ ‘రష్మిక మందన్న’ బ్యూటీ సీక్రెట్స్ ఇవే..

Related News

Mukesh Ambani: ముఖేష్ అంబానీ రాకతో కళగా మారిన ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ సమ్మిట్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ గ్రాండ్ గా ప్రారంభమైంది..