Sharmila : నేను అక్కడి నుంచే పోటీ చేస్తా: షర్మిల
రాజన్న రాజ్యాన్ని తెలంగాణలో (Telangana) ఏర్పాటు చేయడమే లక్ష్యంగా షర్మిల పాదయాత్ర.
- Author : Maheswara Rao Nadella
Date : 14-12-2022 - 6:03 IST
Published By : Hashtagu Telugu Desk
రాజన్న రాజ్యాన్ని తెలంగాణలో (Telangana) ఏర్పాటు చేయడమే లక్ష్యంగా షర్మిల (Sharmila) పాదయాత్ర. కానీ పాదయాత్రకు పోలీసులు అనుమతిని ఇవ్వకపోవడంతో ఆమె హైకోర్టును (High Court) ఆశ్రయించారు. దీంతో, పాదయాత్ర చేసుకోవడానికి హైకోర్టు అనుమతిస్తూ, కొన్ని షరతులను విధించింది. రాజకీయ విమర్శలు మాత్రమే చేయాలని, వ్యక్తిగత విమర్శలు చేయకూదని కండిషన్ పెట్టింది. ఇదే సమయంలో షర్మిల (Sharmila) ఇంటి వద్ద ఉంచిన బ్యారికేడ్లను తొలగించాని పోలీసులను ఆదేశించింది. మరోవైపు షర్మిల (Sharmila) మాట్లాడుతూ కీలక ప్రకటన చేశారు. పాలేరు నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తున్నట్టు తెలిపారు. పాలేరు పార్టీ కార్యాలయానికి ఈనెల 16న భూమిపూజ జరుగుతుందని వెల్లడించారు. పార్టీ విధానాలను ఆ రోజు ప్రకటిస్తానని చెప్పారు.
Also Read: Komati Reddy Venkat Reddy : కాంగ్రెస్ చీఫ్ తో కోమటిరెడ్డి భేటీ..!