HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Trending
  • >How To Watch Chandrayaan 3 Moon Landing Live

Chandrayaan-3 Live : చంద్రయాన్-3 మూన్ ల్యాండింగ్ లైవ్ చూడటం ఇలా..

Chandrayaan-3 Live :  చంద్రయాన్-3 ల్యాండర్ "విక్రమ్" బుధవారం (ఆగస్టు 23న) సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ కానుంది. చంద్రయాన్ -3 మిషన్ లోని ఈ దశను సాఫ్ట్ ల్యాండింగ్ అంటారు. 

  • By Pasha Published Date - 10:26 AM, Mon - 21 August 23
  • daily-hunt
Chandrayaan-3
Chandrayaan 3 Explained

Chandrayaan-3 Live :  చంద్రయాన్-3 ల్యాండర్ “విక్రమ్” బుధవారం (ఆగస్టు 23న) సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ కానుంది. చంద్రయాన్ -3 మిషన్ లోని ఈ దశను సాఫ్ట్ ల్యాండింగ్ అంటారు. గతంలో చంద్రయాన్-2 మిషన్ సాఫ్ట్ ల్యాండింగ్ దశలోనే ఫెయిల్ అయింది. చంద్రుడి దక్షిణ ధృవానికి ఇటీవల రష్యా పంపిన “లూనా-25” ల్యాండర్ ఆదివారం ఉదయం సాఫ్ట్ ల్యాండింగ్ లో విఫలమై కూలిపోయింది. కానీ భారత్ ప్రయోగించిన చంద్రయాన్-3 ల్యాండర్ “విక్రమ్” ఈసారి సక్సెస్ ఫుల్ గా ల్యాండ్ అవుతుందనే అంచనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం చంద్రయాన్-3 ల్యాండర్ చంద్రుడి ఉపరితలానికి దాదాపు 120 కిలోమీటర్ల ఎత్తులో ఉంది.

Also read : Rusty Car – 15 Crore : తుక్కు కారును రూ.15 కోట్లకు కొన్నాడు.. ఎందుకు ?

చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్ ను లైవ్ టెలికాస్ట్ లో చూసేందుకు (Chandrayaan-3 Live) యావత్ దేశ ప్రజలు రెడీ అవుతున్నారు. ఇస్రో అధికారిక వెబ్ సైట్‌ లేదా ఇస్రో యూట్యూబ్‌ ఛానల్ లేదా ఇస్రో ఫేస్‌బుక్‌ పేజీలో చంద్రయాన్ 3 ల్యాండింగ్ ను లైవ్‌లో చూడొచ్చు, ఆగస్టు 23న సాయంత్రం 5.27 గంటల నుంచే డీడీ నేషనల్ టీవీలో లైవ్ ను కూడా తిలకించవచ్చని ఇస్రో ట్వీట్ చేసి వెల్లడించింది. చంద్రయాన్‌-3 మిషన్‌ సాఫ్ట్‌ ల్యాండింగ్‌ ప్రక్రియను తిలకించే విధంగా ప్రత్యక్షప్రసారానికి ఏర్పాట్లు చేయాలని దేశంలోని పాఠశాలలు, ఇతర విద్యాసంస్థలను ఇస్రో కోరింది. చంద్రయాన్‌-3 మిషన్‌ సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చిరస్థాయిగా నిలిచేఘట్టం ఆసక్తి రేపటంతో పాటు యువత మనసులో అన్వేషణ పట్ల మక్కువ పెంచుతుందని ఇస్రో పేర్కొంది. దేశ శాస్త్ర, సాంకేతిక రంగంలో సాధించిన ఘనతను సమష్టిగా వేడుక చేసుకునేందుకు అవసరమైన ఖ్యాతిని, సమగ్రతను సృష్టిస్తుందని తెలిపింది. ఈ విజయం శాస్త్రీయ నూతన ఆవిష్కరణలకు దోహదం చేస్తుందని ఇస్రో వెల్లడించింది. ఈ విజయం శాస్త్ర, సాంకేతిక, ఇంజినీరింగ్‌, పరిశ్రమ, అంతరిక్ష పరిశోధనలో… భారత్‌ పురోగతికి ప్రతీకగా నిలవనుందని ఇస్రో పేర్కొంది.

ఇస్రో ఫేస్ బుక్ పేజీ లైవ్ : https://www.facebook.com/ISRO/

ఇస్రో యూట్యూబ్‌ ఛానల్ లైవ్ : isro live 

ఇస్రో వెబ్ సైట్ లైవ్ : https://www.isro.gov.in/

దూరదర్శన్ లైవ్ : DD NATIONAL LIVE 

Also read : Naga Panchami 2023 : ఇవాళ నాగ పంచమి.. పూజలు చేస్తే ఆ దోషాలు తొలగిపోతాయ్!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Chandrayaan
  • Chandrayaan 3
  • Chandrayaan-3 Live
  • how to Watch
  • lander vikram
  • moon landing

Related News

    Latest News

    • MP Mithun Reddy : జైలు నుంచి ఎంపీ మిథున్ రెడ్డి విడుదల

    • AI Effect : 2030 కల్లా 99% ఉద్యోగాలు మటాష్!

    • Lunar Eclipse : రేపు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

    • Pushpa 3 : సైమా వేదిక గా పుష్ప-3 అప్డేట్ ఇచ్చిన సుకుమార్

    • Drugs : హైదరాబాద్లో డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీ గుట్టు రట్టు

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd