Fancy Number: వెహికల్ కోసం ఫ్యాన్సీ నంబర్ బుకింగ్ ఇలా..
బైక్, స్కూటర్, కారు.. వాహనం ఏదైనా సరే.. అందరూ కోరుకునేది ఒక్కటే.
- By Pasha Published Date - 01:21 PM, Sat - 22 June 24

Fancy Number: బైక్, స్కూటర్, కారు.. వాహనం ఏదైనా సరే.. అందరూ కోరుకునేది ఒక్కటే. అదే.. ఫ్యాన్సీ వెహికల్ నంబర్. దీని కోసం చాలామంది లక్షలాది రూపాయలను చెల్లించేందుకు రెడీ అయిపోతుంటారు. ఫ్యాన్సీ వెహికల్ నంబరుతో తమ వాహనం లుక్‌కు రాయల్టీ కలగలుస్తుందని చాలామంది ఫీలవుతుంటారు. అందుకే ఆ నంబర్ల కోసం అంతగా అత్యుత్సాహం చూపిస్తుంటారు. కొందరు సెంటిమెంటు ప్రకారం.. ఇంకొందరు న్యూమరాలజీ ప్రకారం ఫ్యాన్సీ వెహికల్ నంబర్లను దక్కించుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. అయితే మన వాహనానికి వీఐపీ లుక్ ఇచ్చే ఫ్యాన్సీ నంబర్లను ఎలా దక్కించుకోవాలో తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join
ఫాన్సీ వెహికల్ నంబర్లు ఎక్కడో ఉండవు. మనకు సమీపంలో ఉండే ప్రాంతీయ రవాణా కార్యాలయం (ఆర్టీఓ)లోనే ఈ నంబర్ల లిస్టు ఉంటుంది. ఇందుకోసం మనం ఆర్టీఓ ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లో రోడ్డు రవాణా, హైవేల శాఖకు (MoRTH) చెందిన అధికారిక వెబ్‌సైట్‌లో పబ్లిక్ యూజర్‌గా నమోదు చేసుకోవాలి. ఇలా పర్సనల్ అకౌంటును క్రియేట్ చేసుకున్న తర్వాత.. దాని ద్వారా MoRTH వెబ్‌సైటులోకి లాగిన్ కావాలి. అందులో మనకు సమీపంలో ఉండే ఆర్టీఓ ఆఫీసును ఎంపిక చేసుకోవాలి. దాని పరిధిలో అందుబాటులో ఉన్న ఫ్యాన్సీ నంబర్ల జాబితా, వాటి రేట్లు మనకు కనిపిస్తాయి. వాటిలో నుంచి మనకు నచ్చిన ఫ్యాన్సీ నంబరును ఎంపిక చేసుకోవాలి. వెంటనే దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించాలి.
Also Read : Life Expectancy : చిన్న చేపలను ముళ్లతో సహా తింటే.. ఆయుష్షు అప్!
ఆ తర్వాత ఫ్యాన్సీ నంబర్ల(Fancy Number) కోసం ఆన్‌లైన్‌లో ఈ-వేలంపాట నిర్వహిస్తారు. ఎక్కువ రేటును చెల్లించే వారికే ఆ నంబర్లు సొంతం అవుతాయి. ఈ -వేలంలో విజేతలుగా నిలిచి ఫ్యాన్సీ వెహికల్ నంబర్లు దక్కించుకున్న వాళ్లు కాషనరీ డిపాజిట్ చేయాలి. అనంతరం నిర్దిష్ట సమయంలోగా మిగతా అమౌంటును చెల్లించాలి.చివరగా ఆ ఫ్యాన్సీ వాహన నంబరును మీకు కేటాయిస్తూ రోడ్డు రవాణా శాఖ మీకు లేఖను జారీ చేస్తుంది.