HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >How Much More Time Should Be Given Supreme Court Comments On Defection

Defected MLAs Case : ఇంకా ఎంత టైం ఇవ్వాలి.. ఫిరాయింపులపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

పార్టీ ఫిరాయింపులకు వార్షికోత్సవం పూర్తయిందా అని జడ్జి జస్టిస్ గవాయి చురకలు అంటించారు. ఆయారాం, గయారాంలను నిరోధించేందుకే రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ ఉందని, అలాంటప్పుడు ఫిరాయింపులపై ఏ నిర్ణయం అనేది తీసుకోకపోతే ఆ షెడ్యూల్‌ను అపహాస్యం చేయడం కిందకే వస్తుందని స్పష్టం చేసింది.

  • Author : Latha Suma Date : 25-03-2025 - 1:51 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
How much more time should be given.. Supreme Court comments on defection
How much more time should be given.. Supreme Court comments on defection

Defected MLAs Case : నేడు సుప్రీంకోర్టులో తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల పిటిషన్లపై విచారణ జరిగింది. ఈ క్రమంలో ప్రతివాదులపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కౌంటర్ దాఖలు చేయడానికి ఇంకా ఎంత టైం ఇవ్వాలి, ఇంకా ఎన్ని రోజులు గడువు ఇవ్వాలంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ ఫిరాయింపులకు వార్షికోత్సవం పూర్తయిందా అని జడ్జి జస్టిస్ గవాయి చురకలు అంటించారు. ఆయారాం, గయారాంలను నిరోధించేందుకే రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ ఉందని, అలాంటప్పుడు ఫిరాయింపులపై ఏ నిర్ణయం అనేది తీసుకోకపోతే ఆ షెడ్యూల్‌ను అపహాస్యం చేయడం కిందకే వస్తుందని స్పష్టం చేసింది.

Read Also: Samsung Co-CEO: శాంసంగ్ కో-సీఈవో గుండెపోటుతో క‌న్నుమూత‌!

మరోవైపు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తరఫున లాయర్ సుందరం వాదనలు వినిపించారు. టీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరారని స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని ఒక ఎమ్మెల్యే అయితే కాంగ్రెస్ టికెట్ మీద లోకసభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారని టీఆర్ఎస్ తరఫున వాదనలు వినిపించారు. ఇక, జడ్జి జస్టిస్ బీఆర్ గవాయ్ మాట్లాడుతూ..ఫిర్యాదు వచ్చి ఎన్ని రోజులు అవుతుందని ప్రశ్నించారు. కాలయాపన చేసే విధానాలు మానుకోవాలని, ఎమ్మెల్యేల పదవీకాలం పూర్తయ్యేవరకు కాలయాపన చేస్తారా అంటూ ధర్మాసనం ప్రతివాదులను ప్రశ్నించింది. బీఆర్‌ఎస్‌ తరఫున వాదనలు ముగియడంతో తదుపరి విచారణను ఏప్రిల్‌ 2వ తేదీకి వాయిదా వేసింది. ఆరోజు స్పీకర్‌ తరఫున ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించనున్నారు.

కాగా, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఏం నిర్ణయం తీసుకుంటారు. ఫిర్యాదులపై 4 వారాల్లో షెడ్యూల్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కానీ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు కూడా ఇవ్వలేదు. ధర్మాసనం జోక్యం చేసుకున్నాక నామమాత్రంగా నోటీసులిచ్చారు. మూడు వారాల్లో రిప్లై ఇవ్వాలని ఫిబ్రవరి 13వ తేదీన స్పీకర్ నోటీసులు జారీ చేశారు. నెల రోజులు గడిచినా ఎలాంటి చర్యలు తీసుకోవలేదు. మేం చేసిన ఫిర్యాదుకు ఏడాది గడుస్తున్నా స్పీకర్ షెడ్యూల్ చేయలేదు. యధేచ్ఛగా ఫిరాయింపులు జరుగుతున్నా, ఫిర్యాదులు అందుకున్న స్పీకర్ చర్యలు తీసుకోవడం లేదని కౌశిక్ రెడ్డి పిటిషన్ పై సీనియర్ లాయర్ సుందరం వాదనలు వినిపించారు.

Read Also: Rajasingh : వాళ్లతో పెట్టుకోవద్దంటూ కేటీఆర్ కు రాజాసింగ్ వార్నింగ్

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • BRS MLA Padi Kaushik Reddy
  • Defected MLAs Case
  • Supreme Court

Related News

Supreme Court allows passive euthanasia for Harish Rana

సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. హరీశ్ రాణా కారుణ్య మరణానికి అనుమతి

Supreme Court Allows Passive Euthanasia For Harish Rana  గౌరవంగా మరణించే హక్కుపై సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. 13 సంవత్సరాలుగా జీవచ్ఛవంగా ఉన్న 32 ఏళ్ల హరీశ్‌ రాణాకు అందిస్తున్న వైద్య సహాయాన్ని నిలిపివేసేందుకు అతని తల్లిదండ్రులకు అనుమతి ఇచ్చింది. జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఇవాళ ఈ మేరకు తీర్పు చెప్పింది. 13 ఏళ్ల క్రితం భవనంపై నుంచి కింద పడటం

  • Speaker Clean Chit To Danam, Kadiyam Srihari

    కడియం,దానంకు క్లీన్ చిట్.. అనర్హత పిటిషన్లను కొట్టేసిన స్పీకర్‌

  • Brs Car

    Rajyasabha : రాజ్యసభ పోటీకి దూరంగా బిఆర్ఎస్..ఆ రెండు స్థానాలు కాంగ్రెస్ కేనా ?

  • kaleshwaram-notices-i-will-explain-what-happened-during-kcr-rule-etela-rajender

    Etela Rajender : బిఆర్ఎస్ లోకి ఈటెల..? నిజమేనా ?

Latest News

  • Tata Power : దేశ ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న టాటా పవర్

  • BSE : మెయిన్‌బోర్డ్‌లోకి ఇన్సోలేషన్ ఎనర్జీ.. పెట్టుబడిదారులకు కొత్త భరోసా

  • Kerala Assembly Election 2026 : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్

  • వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

  • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd