Honey: ఒక తేనెటీగ తన జీవితకాలంలో ఎంత తేనెను తయారు చేస్తుందో తెలుసా.?
తేనె ఇందులో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. తేనెను ఇష్టపడనివారు ఎవరు ఉండరు.
- By Nakshatra Published Date - 05:06 PM, Wed - 15 June 22
తేనె ఇందులో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. తేనెను ఇష్టపడనివారు ఎవరు ఉండరు. అందులోనూ స్వచ్ఛమైన తేనె దొరికింది అంటే చాలు లొట్టలేసుకుని మరి తింటూ ఉంటారు.తేనె ఎన్ని సంవత్సరాలు అయినా కూడా పాడవకుండా అలాగే ఉంటుంది. మరి అలాంటి దీని వెనుక తేనెటీగల జీవితకాల కృషి ఇమిడి ఉంది. తేనెటీగలు ఒక చెంచా తేనెను తయారు చేయడానికి కొన్ని వేల కిలోమీటర్లు ఎగర వలసి ఉంటుంది. అంతేకాకుండా జీవితకాలంలో ఒక తేనెటీగ ఒక చెంచా కూడా తయారు చేయలేదు.
ఇక తేనేటీగలన్నింటీలొ మొదటగా ఆడ తేనెటీగలు మాత్రమే తేనెను తయారుచేస్తాయి. ఆ సమయంలో తేనేటీగల గుంపులో ఉండే మగ తేనెటీగలు ఏ పని చేయవు. ఈ ఆడ తేనెటీగల గుంపు ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అక్కడే మగ తేనేటీగలు కూడా ఉంటాయి. ఇకపోతే తేనెటీగ జీవిత కాలంలో ఎంత తేనెను సేకరిస్తుంది అనే విషయానికి వస్తే.. తేనెటీగ తన జీవిత కాలంలో ఒక చెంచా తేనెను కూడా తయారు చేయలేదు. తేనెటీగ తన జీవిత కాలంలో ఒక టీ స్పూన్ లో 12 వ వంతు వరకు మాత్రమే తేనెను తయారు చేస్తుంది.
ఒక చెంచా తేనె కోసం పన్నెండు తేనెటీగలు జీవితాంతం కష్ట పడతాయి. ఒక చెంచా తేనెను తయారు చేయడానికి తేనెటీగలు చాలా కష్టపడాలి. ఇక తేనెటీగ జీవిత కాలం కేవలం 45 రోజులు మాత్రమే. ఇకపోతే ఒక కిలో తేనెను తయారు చేయడం కోసం తేనేటీగలు దాదాపుగా 40 లక్షల పువ్వుల రసాన్ని పీల్చుకొని, 90 వేల మైళ్ళు ప్రయాణించవలసి ఉంటుంది అని నిపుణులు చెబుతున్నారు.
Related News
Honey: స్త్రీ, పురుషులు అందంగా కనిపించాలంటే ఇది రాస్తే చాలు?
సాధారణంగా చలికాలంలో చర్మం పొడిబారిపోవడం అన్నది సహజం. అయితే కొందరికి వేసవిలో కూడా చర్మం డ్రై గా అయిపోయి పగుళ్లు ఏర్పడటంతో పాటు చర్మం నిర్జీవంగా మారుతుంది. చలి తీవ్రత ఎక్కువగా ఉండటంల్ల ప్రతి మనిషి చర్మాన్ని రక్షించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తారు. అయితే తేనెను వాడటం వల్ల మంచి ఫలితాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి తేనెను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ము