Flying Deer: లాంగ్ జంప్ తో అందరిని అశ్చర్యపరిచిన జింక …?
జింక లాంగ్ జంప్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇలా విన్యాసాలు చేస్తున్న జంతువులను చూడటం జంతు ప్రేమికులకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ విడియోని చూసిన చాలామంది ఎంతో ఆశ్చర్యపోతున్నారు.
- Author : Hashtag U
Date : 16-01-2022 - 8:50 IST
Published By : Hashtagu Telugu Desk
జింక లాంగ్ జంప్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇలా విన్యాసాలు చేస్తున్న జంతువులను చూడటం జంతు ప్రేమికులకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ విడియోని చూసిన చాలామంది ఎంతో ఆశ్చర్యపోతున్నారు. గోల్డ్ మెడల్ కోసం పోటీల్లో లాంగ్ జంప్ చేసే వారిలా ఈ జింక కూడా లాంగ్ జంప్ చేసింది. దాదాపుగా మనిషి ఎత్తుకు ఈ జింక ఎగిరిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. జింకరహదారి దాటడానికి ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా చాలా ఎత్తులో ఎగిరి రోడ్డుని దాటింది.
మెరుపువేగంతో అది పక్కనే ఉన్న అడవీలోకి వెళ్లిపోయింది. అది అంత ఎత్తుకు దూకుతున్నప్పుడు గాలిలో కదులుతున్నట్లు అనిపిస్తుంది. ఈ వీడియోలో బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించే సందడిగల శబ్దం జంతువును చూడటంలో మరింత ఆసక్తిని పెంచుతుంది. కెమెరా ప్యాన్ చేస్తున్నప్పుడు, వీడియోలో కనిపించిన ఒక వ్యక్తి కూడా జింక చేసిన లాంగ్ జంప్‌తో ఆశ్చర్యపోయాడు.
ఈ వీడియో 41వేలకు పైగా వీక్షణలను పొందింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఖంగుతిన్నారు. ట్విట్టర్ లో చాలా మంది వీడియోకి కామెంట్స్ చేస్తున్నారు. ఎప్పుడూ ఇంత లాంగ్ జంప్ చేసిన జంతువుని చూడలేదని..జింక పక్షిలాగా ఎగురుతుందంటూ కామెంట్స్ చేశారు. దీనికి ముందు, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారి పర్వీన్ కస్వాన్ జింకలు ఉత్సాహంగా స్వేచ్ఛగా దూకుతున్న వీడియోను ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
And the gold medal for long & high jump goes to…….@ParveenKaswan
Forwarded as received pic.twitter.com/iY8u37KUxB— WildLense® Eco Foundation 🇮🇳 (@WildLense_India) January 15, 2022