Konda Pochamma Sagar Dam : సిద్ధిపేట జిల్లాలో తీవ్ర విషాదం
ఐదుగురి మృతదేహాలు లభ్యమైనట్లు సమాచారం. వీరంతా హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు.
- By Latha Suma Published Date - 04:17 PM, Sat - 11 January 25
Konda Pochamma Sagar Dam : సిద్దిపేట జిల్లాలో ఘోర విషాదం సంభవించింది. కొండపోచమ్మ సాగర్ డ్యామ్‌లో ఈత కోసం వచ్చి ఐదుగురు యువకులు దుర్మరణం పాలయ్యారు. మొత్తం ఏడుగురు డ్యాంలోకి దిగినట్లు తెలుస్తోంది. అందులో ఇద్దరు యువకులు సురక్షితంగా ప్రాణాలతో బయట పడ్డారు. ఐదుగురి మృతదేహాలు లభ్యమైనట్లు సమాచారం. వీరంతా హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు. మృతులను ధనుష్ (20), లోహిత్ (17), దినేశ్వర్ (17), జతిన్ (17), శ్రీనివాస్ (17)గా గుర్తించారు. మృతి చెందిన ధనుష్, లోహిత్ ఇద్దరూ సొంత అన్నదమ్ములు. మృతదేహాలను స్థానిక ఆసుపత్రికి తరలించారు.
పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదానికి సంభవించిన వివరాలను ప్రాణాలతో బయటు పడిన తోటి మిత్రులను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాలను పోస్టు మార్టం కోసం స్థానిక ఆస్పత్రికి తరలిస్తున్నారు. సరదాగా ఈత కోసం ఐదుగురు ఒకే సారి మరణించడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. కాగా, వీకెండ్ కావడంతో ప్రాజెక్ట్ సందర్శించడానికి వెళ్లిన ఏడుగురు యువకులు సెల్ఫీ కోసం సాగర్‌లో దిగి గల్లంతయ్యారు. ఈ ఘటనతో సంబంధిత కుటుంబాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. ప్రమాదానికి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: Apple CEO Tim Cook: పెరిగిన యాపిల్ సీఈవో జీతం.. దాదాపు రూ. 100 కోట్లు పెంపు!