HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Automobile
  • >Ferrari The Only Car Company That Has Its Own Testing Race Track

King Of Cars : ఫెరారీ కార్ల వెనుక దాగిన ఎమోషన్, సక్సెస్..

King Of Cars : ఫెరారీ.. లగ్జరీ కార్ల రంగంలో రారాజు. ఆ కార్ల స్పీడ్ గురించి మనకు తెలుసు.. స్టైలిష్ లుక్ గురించి మనకు తెలుసు.. కానీ ఆ కంపెనీకి ఉన్న మరెన్నో స్పెషాలిటీల గురించి మనలో చాలామందికి తెలియదు. 

  • By Pasha Published Date - 10:19 AM, Sun - 11 June 23
  • daily-hunt
King Of Cars
King Of Cars

King Of Cars : ఫెరారీ.. లగ్జరీ కార్ల రంగంలో రారాజు 

ఆ కార్ల స్పీడ్ గురించి మనకు తెలుసు.. స్టైలిష్ లుక్ గురించి మనకు తెలుసు.. 

కానీ ఆ కంపెనీకి ఉన్న మరెన్నో స్పెషాలిటీల గురించి మనలో చాలామందికి తెలియదు. 

లగ్జరీ కార్ల గురించి ప్రస్తావన వస్తే.. తప్పకుండా వచ్చే పేరు ఫెరారీ(King Of Cars). ఇది ఇటలీకి చెందిన లగ్జరీ కార్ల కంపెనీ. ఇది స్పోర్ట్స్ కార్ల ఉత్పత్తిలో టాప్. దీని కార్లలో ఇంజిన్ నుంచి వచ్చే స్పెషల్ సౌండ్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇటలీ, యునైటెడ్ కింగ్‌డమ్, జర్మనీ, మిడిల్ ఈస్ట్ లలో ఫెరారీ కార్లు ఎక్కువగా సేల్ అవుతుంటాయి. ఫెరారీ ప్రతి సంవత్సరం 5 వేలకు పైగా కార్లను విక్రయిస్తుంది. ఫార్ములా వన్ రేసింగ్‌లో గెలిచే ఎక్కువమంది రేసర్లు ఫెరారీ కార్లే వాడుతారు. ఇప్పటివరకు 39 మంది ఫెరారీ డ్రైవర్లు ఫార్ములా వన్ రేసింగ్‌లో విజయం సాధించారు. అమెరికా, భారతదేశం, దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సింగపూర్, సౌదీ అరేబియా, ఉక్రెయిన్, హాంకాంగ్ వంటి దేశాల్లోనూ ఫెరారీకి స్టోర్లు ఉన్నాయి. నేడు ఈ కంపెనీ మార్కెట్ విలువ దాదాపు రూ.4.45 లక్షల కోట్లు.

వడ్రంగిగా, ఆర్మీలో సైనికుడిగా.. ఫెరారీ ఓనర్ 

ఫెరారీ కథ 1939లో ప్రారంభమైంది. రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైన సంవత్సరం ఇదే. కంపెనీని ప్రారంభించిన వ్యక్తి ఎంజో ఫెరారీ. 1898లో జన్మించిన ఎంజో కుటుంబం వడ్రంగి పని చేసేది. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే..  1916లోనే అతని తండ్రి ఆల్ఫ్రెడో, సోదరుడు అల్ఫ్రెడో జూనియర్ ఫెరారీ ఇటాలియన్ ఫ్లూ మహమ్మారితో మరణించారు. ఇలా కుటుంబ బాధ్యత అంతా ఎంజోపై పడింది. ఉద్యోగం కోసం వెతుకుతూ ఎంజో  సైన్యంలో చేరాడు. మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నాడు. ఎంజో కూడా 1918లో ఫ్లూ మహమ్మారి బారిన పడ్డాడు. అదే సమయంలో మొదటి ప్రపంచ యుద్ధం ముగియడంతో అతనిని ఉద్యోగం నుంచి తొలగించారు. కొత్త ఉద్యోగం కోసం వెతుకుతూ ఎంజో CMN అనే కార్ల తయారీ కంపెనీలో టెస్ట్ డ్రైవర్‌గా పని చేయడం ప్రారంభించాడు. అక్కడ అతని  డ్రైవింగ్ నైపుణ్యాలను చూసి కారు రేసులో ప్రయత్నించమని  బాస్ సూచించాడు. ఈ విధంగా ఎంజో రేసింగ్ డ్రైవర్‌గా మారాడు. 1920 నుంచి 1939 మధ్య అతను అనేక గ్రాండ్ ప్రిక్స్ రేసుల్లో పాల్గొన్నాడు. 1932లో ఎంజో ఫెరారీ..  ఆల్ఫా రేస్ కార్స్ ఫ్యాక్టరీ జాబ్ లో  చేరడానికి రేసింగ్ నుంచి వైదొలిగారు. రేసింగ్ టీమ్‌ని ఏర్పాటు చేసుకున్నాడు. అప్పటి నుంచే ఎంజో తయారు చేసిన కార్లపై జంపింగ్ గుర్రాల బొమ్మలు కనిపించాయి. ఆల్ఫా రేస్ కార్స్ ఫ్యాక్టరీ మేనేజింగ్ డైరెక్టర్‌తో విభేదాల తర్వాత ఎంజో 1939లో ఆ కంపెనీని విడిచిపెట్టాడు.

Also read : Singh Is King: సూపర్ సర్దార్.. 15 టర్బన్స్.. 15 కలర్లు..15 లగ్జరీ కార్లులగ్జరీ కార్ల విడి భాగాలను తయారు చేసే కంపెనీ

ఆటో ఏవియో కాస్ట్రుజియోని అనే కంపెనీని ఎంజో ఫెరారీ ప్రారంభించాడు. ఇది లగ్జరీ కార్ల విడి భాగాలను తయారు చేసేది. ఇంతలో రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. ఇటలీ ఫాసిస్ట్ ముస్సోలిని ఒత్తిడితో ఎంజో తన ఫ్యాక్టరీలో ఆయుధాలను తయారు చేయవలసి వచ్చింది. ఈ కారణం వల్లే ఇటలీలోని  మోడెనాలో నిర్మించిన ఫెరారీ  కార్ల  కర్మాగారంపై అప్పట్లో అమెరికా వైమానిక దళం బాంబులు వేసింది. అప్పుడు ఎంజో ఫెరారీ మోడెనా సిటీ  నుంచి మారనెల్లాకు వెళ్లి మరొక కార్ల కర్మాగారాన్ని స్థాపించాడు. 1947లో ఎంజో ఫెరారీ S.p.A అనే ​​కంపెనీని ప్రారంభించాడు. ఈ కంపెనీ విడుదల చేసిన మొదటి కారు 125 S అంటే 125 స్పోర్ట్స్.

King Of Cars1

గుర్రాల లోగో వెనుక ఎమోషనల్ స్టోరీ 

రెండు ముందు కాళ్లను గాలిలో పైకి లేపి పసుపు రంగులో ఉన్న గుర్రం చిహ్నం ఫెరారీ కార్లపై ఉంటుంది. దీని వెనుక ఒక ఎమోషనల్ కథ ఉంది. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఇటాలియన్ ఫైటర్ ప్లేన్ పైలట్ ఫ్రాన్సిస్కో బరక్కా తన ప్రతి విమానంలో ఈ ముద్ర వేసేవాడు. మొదటి ప్రపంచ యుద్ధంలో ఫ్రాన్సిస్కో మరణించాడు. ఎంజో ఫెరారీ వెళ్లి ఫ్రాన్సిస్కో తల్లిదండ్రులు కౌంట్ ఎన్రికో బార్కా, కౌంటెస్ పోలీనాలను పరామర్శించాడు. వారిని ఓదార్చాడు. ఈక్రమంలో ఫ్రాన్సెస్కో తండ్రి కౌంటెస్..  మీ కార్లలో నా కొడుకు తయారు చేసిన  గ్యాలపింగ్ గుర్రాలను ఉంచండి అని ఎమోషనల్ గా అడిగారు. ఫెరారీ ఓకే అన్నాడు. అతను తన కంపెనీలో తొలి కారును నిర్మించినప్పుడు,  ఫ్రాన్సిస్కో యొక్క గ్యాలపింగ్ గుర్రాన్ని దానిపై ఉంచాడు. ఇప్పటిదాకా ఆ సింబల్ అలాగే కంటిన్యూ అవుతోంది.

Also read  : Honda Cars: హోండా సిటీ, Amaze కార్లు కొనాలని చూస్తున్నారా.. అయితే ఇప్పుడే కొనండి.. జూన్ నుంచి ధరలు పెంపు..!

ఫెరారీ కారు కొనడానికి దరఖాస్తు పంపాలి

ఫెరారీ కారును కొనడానికి.. ఆ కారు విడుదల తేదీకి ఒక సంవత్సరం ముందే దరఖాస్తు చేసుకోవాలి. ప్రపంచం నలుమూలల నుంచి ధనవంతుల చేసుకునే ఈ అప్లికేషన్‌లను  క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఒక్కోసారి చాలామంది శక్తివంతమైన ధనవంతుల దరఖాస్తులను కూడా కంపెనీ తిరస్కరిస్తుంది. ఫెరారీ కొత్త కార్లను లాంచ్ చేసే సమయంలో శ్రద్ధ వహించే సుమారు 200 మంది వ్యక్తుల జాబితాను కలిగి ఉంది. కంపెనీ తన క్లయింట్‌ల డిమాండ్‌కు అనుగుణంగా ప్రతి కారుకు స్పెసిఫికేషన్‌లను జోడిస్తుంది. క్లయింట్‌లను నేరుగా కార్ డిజైనర్‌లతో కనెక్ట్ చేస్తుంది. వారు తమ డిమాండ్లకు అనుగుణంగా కారును డిజైన్ చేయించుకునే వెసులుబాటును కల్పిస్తుంది. ఫెరారీ కంపెనీ ఫిలాసఫీకి సంబంధించి మాట్లాడుతూ..  “నా కారు మోటార్లకు ఆత్మ ఉంది” అని ఎంజో ఫెరారీ  చెప్పాడు.

ఎంజో ఫెరారీ అహంకారం.. లాంబోర్ఘిని కార్ల ఆవిర్భావం 

అది 1958 నాటి మాట..  ఇటలీకి చెందిన ఫెర్రుకియో అనే వ్యక్తికి స్పోర్ట్స్ కార్లు అంటే చాలా ఇష్టం. అతనికి సొంతంగా ట్రాక్టర్ల తయారీ  వ్యాపారం ఉండేది. అతడు ఎన్నో స్పోర్ట్స్ కార్లను కొన్నాడు. అందులో ఒకటి ‘ఫెరారీ 250 జిటి కూపే’. ఫెర్రుకియో తన ఫెరారీలో అనేక లోపాలను గుర్తించాడు. ఈ వివరాలు చెప్పేందుకు అతను ఫెరారీ కార్యాలయానికి వెళ్ళాడు.  ఎంజో ఫెరారీని కలిసి  ఈవిషయాన్ని చెప్పగా.. “తప్పు కారులో లేదు. బహుశా డ్రైవర్‌లోనే ఉంది. మీరు మీ ట్రాక్టర్ పనిని చూసుకోండి” అని ఎగతాళిగా ఎంజో ఆన్సర్ ఇచ్చాడు.  దీన్ని ఫెర్రుకియో అవమానంగా భావించాడు. ప్రతీకారం తీర్చుకునేందుకు ఓ స్పోర్ట్స్ కారును మార్కెట్లోకి విడుదల చేయాలని భావించాడు. అలా ఆయన పెట్టిన లగ్జరీ కార్ల కంపెనీయే లాంబోర్ఘిని. ఈ కంపెనీ 1963లో తన మొదటి స్పోర్ట్స్ కారు 350GTVని విడుదల చేసింది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Application to buy a car
  • Full story of Ferrari company
  • italian luxury car brand
  • King Of Cars
  • only car company
  • own testing race track

Related News

    Latest News

    • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

    • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

    • Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

    • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

    • Delhi : తీహార్‌ జైలును పరిశీలించిన బ్రిటన్‌ అధికారులు.. భారత్‌కు నీరవ్ మోదీ, మాల్యాను అప్పగిస్తారా..?!

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd