Sri Ram Navami Remedies : శ్రీరామనవమి రోజు ఎరుపు దుస్తులు ధరిస్తే ఏమవుతుందో తెలుసా ?
Sri Ram Navami Remedies : ఏప్రిల్ 17న పవిత్ర శ్రీరామ నవమి పర్వదినం ఉంది.
- Author : Pasha
Date : 15-04-2024 - 2:52 IST
Published By : Hashtagu Telugu Desk
Sri Ram Navami Remedies : ఏప్రిల్ 17న పవిత్ర శ్రీరామ నవమి పర్వదినం ఉంది. శ్రీ మహావిష్ణువు త్రేతాయుగంలో ధర్మస్థాపన కోసం శ్రీరాముడిగా అవతరించిన రోజే చైత్ర మాస శుక్లపక్ష నవమి శ్రీరామ నవమి. ఈ పండుగ రోజున రామభక్తులు శ్రీరామ నామాన్ని జపించి ఆధ్యాత్మిక తన్మయత్వం పొందుతారు. ఈ పండుగ వేళ కొన్ని పరిహారాలు చేయడం వల్ల జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయి. పండితులు చెబుతున్న ఆ పరిహారాలేంటో(Sri Ram Navami Remedies) ఇప్పుడు చూద్దాం..
We’re now on WhatsApp. Click to Join
హనుమంతుడి అనుగ్రహం
హనుమంతుడి అనుగ్రహం ఉంటే మన భయాలు తొలగిపోతాయి. వ్యాధులు కూడా దరిచేరవు. శ్రీరామనవమి రోజు సాయంత్రం ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకుంటే మంచిది. పండుగ వేళ హనుమాన్ చాలీసా చదివితే మంచిది. సంతోషంగా ఉండేందుకు నవమి రోజున రామాలయంలో నెయ్యి లేదా నూనెతో దీపాన్ని వెలిగించాలి. జై శ్రీరామ్ నామాన్ని 108 సార్లు జపించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.
ఎరుపు రంగు
ఎరుపు రంగు దుస్తులను మనం శ్రీరామనవమి రోజున ధరించాలి. ఇలా చేస్తే ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కొచ్చు అని జ్యోతిష్యులు చెబుతారు. ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని అందులో 11 గోమతి చక్రాలు, 11 కరివేపాకులు, 11 లవంగాలు, పంచదారతో చేసిన 11 బతషాలు ఉంచి లక్ష్మీదేవికి, రాముడికి సమర్పించాలి. ఇలా చేస్తే మన ఆర్థిక సమస్యలు క్రమంగా తొలగిపోవడం మొదలవు తుంది. ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని 108 సార్లు శ్రీరామరక్ష మంత్రాన్ని చదివి.. ఆ నీటిని ఇంట్లో చల్లుకుంటే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి సానుకూల శక్తి ప్రసరిస్తుంది.
Also Read :Summer Special Trains : 15 సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ వస్తున్నాయ్.. వివరాలివీ
108 సార్లు జైశ్రీరామ్
చాలామంది వివాహ జీవితంలో గొడవలతో బాధపడుతుంటారు. ఇలాంటి వారు శ్రీరామనవమి వేళ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి సీతారాములకు పసుపు, కుంకుమ, గంధాన్ని సమర్పించాలి. దీంతోపాటు ‘ఓం జై సీతారాం’ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఈ మంత్రం భార్యాభర్తల మధ్య సఖ్యతను పెంచుతుంది. ఇక సంతాన భాగ్యం కావాలని భావించే వారు. ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని.. అందులో కొబ్బరికాయను చుట్టేసి సీతాదేవికి సమర్పించాలి. అనంతరం జైశ్రీరామ్ మంత్రాన్ని 108 సార్లు జపించి, సీతమ్మ తల్లికి పూజలు చేయాలి.