Kejriwal : ఢిల్లీ లిక్కర్ కేసు..కేజ్రీవాల్ సీబీఐ కస్టడీ పొడిగింపు
ప్రస్తుతం సీఎం అరవింద్ కేజ్రీవాల్ సీబీఐ కేసులో తీహార్ జైలులో జ్యుడీషీయల్ కస్టడీలో ఉన్నారు.
- By Latha Suma Published Date - 04:44 PM, Thu - 8 August 24

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు(Delhi liquor scam case) లో సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ పొడిగించారు. ఈ నెల 20 వరకు కేజ్రీవాల్ కు సీబీఐ కేసులో కస్టడీ పొడిగిస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ మేరకు గరువారం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కస్టడీ గడువు ముగియడంతో సీబీఐ అధికారులు తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ విచారణకు హాజరుపరిచారు.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, మద్యం పాలసీ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు సోమవారం కొట్టివేసిన విషయం తెలిసిందే. లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్ ను ఈడీ మార్చి 21న అరెస్ట్ చేయగా, సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేజ్రీవాల్ ప్రస్తుతం సీబీఐ కేసులో జైలులో ఉన్నారు.
కేజ్రీవాల్ అరెస్టు సరైన కారణం లేకుండా జరిగిందని చెప్పలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో సీఎం కేజ్రీవాల్‌కు మంజూరైన బెయిల్‌ను రద్దు చేయాలంటూ దాఖలైనా పిటిషన్‌కు సంబంధించి ఈడీ వాయిదా కోరింది. కేజ్రీవాల్ బెయిల్‌ను రద్దు చేస్తే మళ్లీ అరెస్టు చేస్తారా? అని హైకోర్టు ఈడీని ప్రశ్నించింది. కోర్టు ఈ కేసును సెప్టెంబర్ 5కి వాయిదా వేసింది. ఎక్సైజ్ పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మార్చి 21న కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన తెలిసిందే. ఈడీ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
Read Also:Gambhir : ఆ తప్పిదాలే కొంపముంచాయి బెడిసికొట్టిన గంభీర్ ప్లాన్స్