Marriage Bureau Refund: అతడికి వధువును తీసుకురాలేకపోయిన మ్యారేజ్ బ్యూరో.. షాకిచ్చిన కన్స్యూమర్ కోర్టు!
ఇంతకుముందు అయితే పెళ్లిళ్లు, పెళ్లిళ్ల పేరయ్యల ద్వారా లేదంటే తెలిసిన బంధువుల ద్వారా అడిగి కనుక్కొని మరి వివాహాలు చేసేవారు.
- By Anshu Published Date - 08:00 AM, Fri - 8 July 22

ఇంతకుముందు అయితే పెళ్లిళ్లు, పెళ్లిళ్ల పేరయ్యల ద్వారా లేదంటే తెలిసిన బంధువుల ద్వారా అడిగి కనుక్కొని మరి వివాహాలు చేసేవారు. కానీ కాలం మారుతున్న కొద్దీ పెళ్లిళ్ల పేరయ్యలు చేయాల్సిన పనిని మ్యారేజ్ బ్యూరోలు చేస్తున్నాయి. అంతేకాకుండా రకరకాల ప్రకటనలతో ప్రజలను ఆకట్టుకుంటూ వారి మ్యారేజ్ బ్యూరోల దగ్గరకు వచ్చే విధంగా చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే గుజరాత్ కు చెందిన శంకర్ లాల్ అనే వ్యక్తి తన కుమారుడి కోసం స్థానికంగా ఉన్న ఒక మ్యారేజ్ బ్యూరో ని సంప్రదించడం జరిగింది.
ఆ మ్యారేజ్ బ్యూరో కి తన కుమారుడు వివరాలు చెప్పి మంచి అమ్మాయిని చూడమని చెప్పాడట. అందుకుగాను లక్ష రూపాయలు చెల్లించి అక్కడ నుంచి వెళ్లిపోయాడట. అయితే కొద్దిరోజుల తర్వాత ఆ మ్యారేజ్ బ్యూరో శంకర్ లాల్ కి ఫోన్ చేసి తన కొడుకుని తీసుకొని రమ్మని చెప్పగా అతను కొడుకుతో పాటు అక్కడికి వెళ్లి వాళ్ళు చూపించిన అమ్మాయి ఫోటో చూపించి ఓకే చెప్పారట. ఆ అమ్మాయి గురించి పూర్తి వివరాలు తెలుసుకోమని చెప్పి ఇకనుంచి వాళ్లు అక్కడ నుంచి వెళ్లిపోయారట. ఆ తర్వాత మళ్లీ మ్యారేజ్ బ్యూరో నుంచి శంకర్ లాల్ కు ఫోన్ వచ్చిందట.
ఆ అమ్మాయికి ఇదివరకే పెళ్లయిందని మరో సంబంధం ఉందని చెప్పడంతో కొడుకుతో పాటు మ్యారేజ్ బ్యూరో దగ్గరికి వెళ్లాడట. అలా మల్లి చూపించిన అమ్మాయి కూడా నచ్చి ఓకే చెప్పి ఆ అమ్మాయి వివరాలు కనుక్కోమని చెప్పారట. ఆ తర్వాత ఆ మ్యారేజ్ బ్యూరో నుంచి శంకర్ లాల్ కు ఎటువంటి ఫోన్ రాలేదట. అలా నెల రెండు నెలలు కాదు ఏకంగా సంవత్సరం గడిచి పోయిందట. దీంతో శంకర్ ఆగ్రహం వ్యక్తం చేసి మ్యారేజ్ బ్యూరో కి వ్యతిరేకంగా కన్జ్యూమర్ కోర్టును ఆశ్రయించాడట. ఇక ఇరువురి వాదన విన్న కోర్టు సదరు మ్యారేజ్ బ్యూరో కి షాక్ ఇస్తూ ఫీజు కింద తీసుకున్న లక్ష రూపాయలు శంకర్ లాల్ కు ఇవ్వాలని ఆదేశిస్తూ ఐదువేల జరిమానా కూడా విధించిందట. దీనితో మ్యారేజ్ బ్యూరో ఒక్కసారిగా షాక్ అయ్యాడట. అయితే కోర్టు తీర్పు ప్రస్తుతం స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంపై స్పందించిన నెటిజెన్లు ఇకపై మ్యారేజ్ బ్యూరోలు మూసుకోవాల్సిందే అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు