CM Revanth : సీఎం రేవంత్ రెడ్డి నిజంగా తప్పు చేస్తున్నాడా..?
CM Revanth : ప్రభుత్వ భూమిగా గుర్తించిన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నా, అక్కడ ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి
- By Sudheer Published Date - 04:09 PM, Tue - 1 April 25

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) పాలనలో తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తాజాగా కంచ గచ్చిబౌలి భూముల వివాదం (Gachibowli Land Dispute) రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ప్రభుత్వ భూమిగా గుర్తించిన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నా, అక్కడ ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో చెట్లు, పక్షులు, నీటి వనరులు ఉన్న దృశ్యాలు ప్రజలను కదిలించాయి. దీంతో న్యూట్రల్‌గా ఉన్నవారు కూడా ప్రభుత్వ చర్యలపై విమర్శలు చేయడం ప్రారంభించారు.
Be Careful : రూటు మార్చిన సైబర్ నేరగాళ్లు..ఏంచేస్తున్నారో తెలుసా ?
ఇలాంటి పరిణామాలు చూసిన రాజకీయ విశ్లేషకులు, రేవంత్ రెడ్డి వైఖరిని వైఎస్ జగన్ మూడు రాజధానుల ప్రణాళికతో పోల్చుతున్నారు. జగన్ విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా మార్చాలని నిర్ణయించుకున్నప్పుడు కూడా ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడింది. ముఖ్యంగా రుషికొండ ప్రాంతంలో నిర్మించిన పాలెస్‌లు ఎన్నికల్లో వైసీపీకి ఎదురుదెబ్బగా మారాయి. ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి కూడా అభివృద్ధి పేరిట ప్రకృతి నాశనం చేస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. “భూమి ప్రభుత్వదే కావచ్చు, కానీ దాన్ని అభివృద్ధి చేయడం కంటే ప్రకృతిని కాపాడటం అవసరం” అని నిపుణులు సూచిస్తున్నారు.
ఇది నిజంగా రేవంత్ రెడ్డి చేసిన తప్పేనా? లేక రాజకీయ వ్యూహాల ఫలితమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రేవంత్ రెడ్డి తెలంగాణలో కొత్త పాలన తీసుకొచ్చినప్పటికీ, ప్రజల మనసు గెలుచుకోవడానికి కీలక నిర్ణయాల్లో ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవడం అవసరం. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఈ అంశాన్ని రాజకీయం చేయడం సహజమే, కానీ సామాన్య ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ముందుకు సాగితేనే ఇలాంటి వివాదాలు తగ్గుతాయి. లేదంటే ఈ వ్యవహారం రేవంత్ పాలనకు ప్రతికూలంగా మారే అవకాశముంది.
Dear Twitter fam, due to the #HCU land auction, 400 acres of land, 734 plant species, 220 bird species, star tortoises, spotted deer, wild boars, hedgehogs, and rabbits will lose their habitat.
Let’s urge the government to stop this auction 🙏#SaveHCUBioDiversity #greenindia pic.twitter.com/CYGu4sgHBY
— AKA Tharun (@mech_bug) March 31, 2025
HEARTWRENCHING CRY FOR HELP!
Next time some politician speaks about taking care of environment, protecting the biodiversity of #Telangana – play this video for them please.
Video shared by #HCU students that is a literal cry for help!
If only anyone could help 🙏🏼💔
PS:… pic.twitter.com/d6Pu8K2T03
— Revathi (@revathitweets) March 31, 2025