HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Cbse Guidelines For Class 10th Board Exams

CBSE Guidelines: వ‌చ్చే ఏడాది నుంచి రెండు సార్లు సీబీఎస్ఈ టెన్త్ ఎగ్జామ్స్‌.. రూల్స్ ఇవే!

కొత్త నిబంధనల ప్రకారం ఏడాదికి రెండుసార్లు పరీక్ష నిర్వహిస్తారు. ముసాయిదా ప్రకారం.. CBSE బోర్డు 10వ పరీక్ష మొదటి దశ ఫిబ్రవరి 17 నుండి మార్చి 6 వరకు నిర్వహించనున్నారు. రెండవ దశ మే 5 నుండి 20 వరకు నిర్వహించనున్నారు.

  • Author : Gopi Date : 25-02-2025 - 10:39 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Supplementary Result
Supplementary Result

CBSE Guidelines: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE Guidelines) 10వ తరగతి బోర్డు పరీక్షలను వచ్చే ఏడాది (2026) నుంచి ఏడాదికి రెండుసార్లు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకోసం రూపొందించిన ముసాయిదాను సీబీఎస్ఈ ఆమోదించింది. CBSE 10వ తరగతి బోర్డు పరీక్ష మొదటి దశ ఫిబ్రవరి-మార్చిలో నిర్వహించనున్నారు. రెండవ దశ మే 2026లో నిర్వహించనున్నారు. ఒక్కో రౌండ్ పరీక్షకు కాలపరిమితి తగ్గుతుందని, రెండు సబ్జెక్టుల పరీక్షలో గ్యాప్ కూడా తగ్గుతుందని సీబీఎస్ఈ తెలిపింది.

ఏడాదికి రెండుసార్లు పరీక్ష నిర్వహిస్తారు

కొత్త నిబంధనల ప్రకారం ఏడాదికి రెండుసార్లు పరీక్ష నిర్వహిస్తారు. ముసాయిదా ప్రకారం.. CBSE బోర్డు 10వ పరీక్ష మొదటి దశ ఫిబ్రవరి 17 నుండి మార్చి 6 వరకు నిర్వహించనున్నారు. రెండవ దశ మే 5 నుండి 20 వరకు నిర్వహించనున్నారు.

Also Read: Bank Holiday: బ్యాంకు వినియోగ‌దారుల‌కు బిగ్ అల‌ర్ట్‌.. రేపు బ్యాంకుల‌కు సెల‌వు!

CBSE జారీ చేసిన మార్గదర్శకాలలోని ముఖ్యమైన అంశాలు

  • విద్యార్థి మొదటి ప్రయత్నంలోనే అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులై.. మ‌ళ్లీ మెరుగుదల కోసం పరీక్ష రాయాలనుకుంటే ఈ
  • మార్గ‌ద‌ర్శ‌కాల‌ను అనుస‌రించాల్సి ఉంటుంది.
  • విద్యార్థి మొదటి సారి ఫెయిల్ అయితే రెండోసారి పరీక్ష రాయవచ్చు.
  • రెండు రౌండ్ల తర్వాత 5 సబ్జెక్టులలో ఉత్తమ స్కోర్ ఎంపిక చేయబడుతుంది.
  • మొదటి రౌండ్ పరీక్షలు మార్చి 2026లో రెండవ రౌండ్ మేలో జరుగుతాయి.
  • మార్చి 9వ తేదీ వరకు ప్రజల నుంచి సూచనలు ఇవ్వాలని సీబీఎస్‌ఈ కోరింది.
  • నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం.. బోర్డు పరీక్షలలో విద్యార్థులు తమ పనితీరును మెరుగుపరచుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు.
  • మొదటి బోర్డ్ ఎగ్జామ్ 2026 ఫిబ్రవరి 17 నుండి మార్చి 6 వరకు, రెండవ పరీక్ష మే 5 నుండి 20 మే మధ్య నిర్వహించవచ్చు.

ప్రాక్టికల్ పరీక్ష ఒక్కసారి మాత్రమే నిర్వహిస్తారు

రెండు పరీక్షలను కచ్చితంగా సిలబస్‌ ప్రకారమే నిర్వహిస్తామని, అభ్యర్థులకు రెండు దశల్లో ఒకే పరీక్షా కేంద్రాలను కేటాయిస్తామని బోర్డు అధికారి ఒకరు తెలిపారు. దరఖాస్తు సమయంలో రెండు పరీక్షలకు పరీక్ష రుసుము పెర‌గ‌నుంది. కొత్త నిబంధనల ప్రకారం.. బోర్డు పరీక్షలు సంవత్సరానికి రెండుసార్లు నిర్వహిస్తారు. అయితే ప్రాక్టికల్స్, ఇంట‌ర్న‌ల్ మూల్యాంకనం సంవత్సరానికి ఒకసారి మాత్రమే చేస్తారు. బోర్డు పరీక్షల మొదటి, రెండవ దశలు సప్లిమెంటరీ పరీక్షలుగా కూడా పనిచేస్తాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యేక పరీక్ష నిర్వహించబడదని అధికారి తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 10th Exams
  • cbse
  • CBSE 10th Board Exams
  • CBSE Board Exams
  • CBSE Exam
  • CBSE Guidelines
  • CBSE News

Related News

Rahul Gandhi Sensational Allegations Against CBSE

Rahul Gandhi: సీబీఎస్‌ఈపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు

మొబైల్ ఫోన్లతో ఆన్సర్ షీట్లను స్కాన్ చేసి దేశంలోని లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేశారంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం, సీబీఎస్ఈ బోర్డుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 12వ తరగతి డిజిటల్ మూల్యాంకన ప్రక్రియ టెండర్లలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. ఓ ప్రైవేట్ సంస్థకు లబ్ధి చేకూర్చేందుకు నిబంధనలను తుంగలో తొక్కడం వల్లే విద్యా

    Latest News

    • Cockroach Janata Party: భారత్‌కు రానున్న కాక్రోచ్‌ జనతా పార్టీ వ్యవస్థాపకుడు

    • Cm Vijay: నా కడుపులో బిడ్డ చావుకు సీఎం విజయే కారణం: సంచలన ఆరోపణలు చేసిన నటి

    • CBN : డీఎస్సీ నుంచి విగ్రహాల ఘటనల వరకు వైసీపీ కుట్ర‌ల‌పై సీఎం ఫైర్

    • Bluetooth Name: కొంప ముంచిన బ్లూటూత్‌.. విమానం యూటర్న్‌.. ఎమర్జెన్సీ ల్యాండింగ్

    • TDP vs YCP : డైవర్షన్ రాజకీయాల కోసం విగ్రహాల ధ్వంసం – మంత్రి అన‌గాని

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd