Ballaiya Yoga: వైరల్ ఫోటో… బసవతారకం ఆసుపత్రిలో బాలయ్య యోగాసనాలు!
టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సినిమాల విషయంలో బాలకృష్ణ ఎంత యాక్టివ్ గా ఉంటారో అదేవిధంగా రాజకీయాల విషయంలో కూడా అంతే యాక్టివ్గా ఉంటారు.
- By Nakshatra Updated On - 08:43 PM, Tue - 21 June 22

టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సినిమాల విషయంలో బాలకృష్ణ ఎంత యాక్టివ్ గా ఉంటారో అదేవిధంగా రాజకీయాల విషయంలో కూడా అంతే యాక్టివ్గా ఉంటారు. ఇకపోతే నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బాలకృష్ణ హైదరాబాద్ బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో యోగాసనాలు వేశారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి చైర్మన్ అయిన బాలకృష్ణ యోగా దినోత్సవం సందర్భంగా వివిధ ఆసనాల ద్వారా యోగ ప్రాముఖ్యతను వివరించే ప్రయత్నం చేశారు.
బాలకృష్ణ వేసిన యోగాసనాలు కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయంపై బాలకృష్ణ స్పందిస్తూ ప్రపంచానికి భారతదేశం అందించిన అద్భుతాలలో యోగ కూడా ఒకటి అని ఆయన తెలిపారు. దేశంలో వేదకాలం నుంచి యోగా ఉన్నట్టు ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయని, మానసిక శారీరక ప్రశాంతతకు ఆరోగ్యానికి యోగ ఎంతో దోహదపడుతుంది అని బాలకృష్ణ వివరించారు. కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు యోగాను పాటిస్తున్నాయని అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు అని తెలిపారు బాలకృష్ణ.
అలాగే యోగ అన్న పదం సంస్కృతం లోని యజ అన్న పదం నుంచి పుట్టింది అని. యజ అంటే దేనినైనా కూడా ఏకం చేయగలగడం అని బాలకృష్ణ తెలిపారు. మనసును శరీరాన్ని ఏకం చేసి ఆధ్యాత్మిక తాదాత్మ్యాన్ని అందించేదే యోగా అని బాలకృష్ణ తెలిపారు. ఏడాదిలో సగం పగటి సమయం ఎక్కువగా ఉండే రోజు జూన్ 21 అని అందువల్ల ఆ రోజున యోగ డేని పాటిస్తారు అని ఆయన చెప్పుకొచ్చారు.
Related News

5 Yoga Poses: కాళ్ళు, చేతుల్లో బలం కోసం 5 యోగాసనాలు!!
అయితే మీరు కొన్ని నిర్దిష్ట యోగాసనాల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. గాయాలు అయ్యేందుకు తక్కువ ఛాన్స్..