Today Horoscope : ఆగస్టు 17 గురువారం రాశి ఫలితాలు.. వారికి వాహన గండం!
Today Horoscope : ఈరోజు మేషరాశి వారికి వృత్తి ఉద్యోగాలరీత్యా పైస్థాయి వారి వల్ల సమస్యలు ఏర్పడే అవకాశముంది. కళ్లకు సంబంధించి సమస్యలు ఉండొచ్చు జాగ్రత్త.
- By Pasha Published Date - 08:38 AM, Thu - 17 August 23
Today Horoscope : మేష రాశి నుంచి మీన రాశి వరకు ఈరోజు రాశి ఫలితాలు ఇవీ..
మేష రాశి
ఈరోజు మేషరాశి వారికి వృత్తి ఉద్యోగాలరీత్యా పైస్థాయి వారి వల్ల సమస్యలు ఏర్పడే అవకాశముంది. కళ్లకు సంబంధించి సమస్యలు ఉండొచ్చు జాగ్రత్త. ప్రైవేట్ ఉద్యోగం చేసేవారికి మంచి అవకాశం లభిస్తుంది. కోరుకున్న వస్తువులు కొనుక్కుంటారు. గురు దక్షిణామూర్తిని పూజించండి.
వృషభ రాశి
ఈరోజు వృషభ రాశి వారు భూమి లేదా ఆస్తి కొనుగోలుకు సంబంధించి చర్చలు జరుపుతారు. మానసిక ఒత్తిళ్ళను ఎదుర్కొంటారు. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఏ పనైనా చేయండి. మనసు భారం తేలికపడుతుంది. ఉద్యోగులకు మంచి అవకాశాలుంటాయి వాటిని మీరు గుర్తించగలగాలి. విదేశాల్లో ఉన్న బంధువుల నుంచి గుడ్ న్యూస్ వినే అవకాశం ఉంది. స్త్రీలకు అనుకూలం. దత్తాత్రేయుని పూజించాలి.
మిథునం
ఈరోజు మిథునరాశి వారి ఆర్థిక పరిస్థితి అంత అనుకూలంగా లేదు. ఖర్చులు నియంత్రించుకోవాలి. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సమస్యలు కలగొచ్చు. కొత్తగా ఉద్యోగంలో చేరేవారికి మంచి సమయం. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ఒత్తిళ్ళు, సమస్యలు అధికం. కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఆ విషయంపై మీరు చాలా కష్టపడతారు. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. బ్రాహ్మణులకు గానీ, ముత్తయిదువలకు గానీ తాంబూలం, శనగలను దానమివ్వడం మంచిది.
కర్కాటకం
ఈరోజు కర్కాటక రాశి వారి మనసులో ఉన్న ఓ గందరగోళం దాతృత్వంతో ముగుస్తుంది. ఈ రాశికి చెందిన అవివాహితుల పెళ్లికి ఇదే మంచి సమయం. కొత్త వ్యాపారం ప్రారంభించాలి అనుకునేవారికి ఇదే మంచి సమయం. విద్యార్థులు తమ ఉన్నతికి సంబంధించి మంచి సమాచారం వినే అవకాశం ఉంది. ప్రయాణాలు కలసివస్తాయి.దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించాలి.
సింహం
ఈరోజు సింహరాశి వారు ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. దూరప్రయాణాలు చేయడం మంచిదికాదు. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ఇబ్బందులు ఏర్పడును. కొన్ని పొట్ట సంబంధిత సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. వ్యాపారంలో మీకు అకస్మాత్తుగా డబ్బు రావడం సంతోషం కలిగిస్తుంది. దత్తాత్రేయుని పూజించాలి.
Also read : Sravana Masam 2023 : నేటి నుండి శ్రావణమాసం మొదలు..ఇక ప్రతి ఇల్లు భక్తి పరవశమే
కన్య(Today Horoscope)
ఈరోజు కన్యారాశి వారికి ఆకస్మిక ధనలాభం కలుగును. ఆర్థిక విషయాల్లో మిమ్మల్ని తప్పుతోవ పట్టించేవారున్నారు జాగ్రత్త. ప్రత్యర్థుల చురుకుదనం వల్ల మీకు ఇబ్బంది రావొచ్చు. భాగస్వామ్య వ్యాపారం చేసే వ్యక్తులు ఆర్థికంగా లాభపడతారు. బృహస్పతి అనుగ్రహం కోసం శనగలు దానమివ్వాలి. శనగలతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి అది ప్రసాదంగా పంచిపెట్టాలి.
తుల
ఈరోజు తులారాశి వారికి మిశ్రమ ఫలితాలున్నాయి. ఆర్థిక ఇబ్బందుల కారణంగా అప్పులు చేయాల్సి రావొచ్చు. వ్యాపారులకు కొన్ని సమస్యలు తీరుతాయి. కానీ నూతన పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. అవివాహితుల వివాహానికి ఎదురైన అడ్డంకులు తీరిపోతాయి. విద్యార్థులు ఉన్నత చదువులవైపు అడుగేసేందుకు మార్గం సుగమం అవుతుంది. శివపార్వతుల అర్ధనారీశ్వరుని రూపానికి ప్రతీక అయినటువంటి దక్షిణామూర్తిని చూడడం, దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత సమస్యలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.
వృశ్చికం
ఈరోజు వృశ్చిక రాశివారు బంధువుల నుంచి అప్పులు తీసుకోవడం, ఇవ్వడం మానుకోవాలి. మీ మాటల్లో మాధుర్యాన్ని కాపాడుకోవాలి. ఏదైనా విషయంపై చర్చలు జరగొచ్చు. ఈ రోజు విద్యార్థులకు మంచి రోజు అవుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సత్ఫలితాలు ఏర్పడును. నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆదాయం పెరుగుతుంది. శ్రీగురుచరిత్ర పఠించడం దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.
ధనుస్సు
ఈరోజు ధనుస్సు రాశి వారు తమ అత్యంత ప్రియమైన వ్యక్తి సమస్యను విని కొంచెం ఆందోళన చెందుతారు. దానిని తొలగించడానికి ప్రయత్నిస్తారు. అవసరమైన వారికి సహాయం చేసేందుకు సిద్ధంగా ఉంటారు. కుటుంబ జీవితంలో కొన్ని మార్పులు వస్తాయి. వాహనం కొనుగోలు చేయాలన్న కల నెరవేరుతుంది. మీరు తీసుకునే తెలివైన నిర్ణయాల వలన విజయం సాధిస్తారు. మంచి ఆదాయాన్ని పొందుతారు. బ్రాహ్మణులకు గానీ, ముత్తయిదువలకు గానీ తాంబూలం శనగలను దానమివ్వడం మంచిది. శనగలతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి అది ప్రసాదంగా పంచిపెట్టాలి.
Also read : Computer Vision Syndrome: కంప్యూటర్, ఫోన్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారా.. అయితే జాగ్రత్త?
మకరం
ఈరోజు మకర రాశిలోని ఉద్యోగస్తులకు ఉద్యోగంలో స్థాన మార్పులు ఉంటాయి. ఉద్యోగులకు ఈ రోజు ఆరంభంలో కొన్ని సమస్యలున్నప్పటికీ ఆ తర్వాత పరిష్కారం అవుతాయి.వివాదాలకు దూరంగా ఉండాలి. మాటల్లో మాధుర్యాన్ని తగ్గినీయకుండా చూసుకోవాలి. ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనులు పూర్తిచేస్తారు. గుండె, ఊపిరితిత్తులకు కలిగే వ్యాధుల వలన ఇబ్బందులకు గురవుతారు. సూర్యనారాయణ మూర్తిని ఆరాధించాలి.
కుంభం
ఈరోజు కుంభ రాశి వారు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ధనలాభం కలుగుతుంది. కొన్ని శుభవార్తలు వింటారు. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు అనుకూలం. ఉద్యోగస్తులు ఈరోజు కార్యాలయంలోని ఉన్నత అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. ఆరోగ్య విషయాలపై జాగ్రత్తలు వహించాలి. శ్రీగురుచరిత్ర పఠించడం దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.
మీనం
ఈరోజు మీన రాశి వారికి మానసిక ఒత్తిళ్ళు, ఇబ్బందులు ఏర్పడును. ఇతరులతో గొడవలకు దూరంగా ఉండండి. వ్యాపారంలో నష్టాల కారణంగా ఇబ్బంది పడతారు. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు వహించండి. సమాజంలో గొప్పవారితో పరిచయాలు పెరుగుతాయి. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం శనగలు దానమివ్వాలి.
గమనిక: ఈ కథనంలో ఉన్న సమాచారం జ్యోతిష్యులు/ పంచాంగాలు/ ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.
Related News
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చేతి వేళ్ళ వెనుక ఉన్న ఉంగరాల సీక్రెట్ ఇదే?
టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో యాక్టివ్ గా పాల్గొంటున్న విషయం తెలిసిందే. అయితే ఎన్నికల సమయం దగ్గర పడటంతో పవన్ కళ్యాణ్ సినిమాలను పక్కన పెట్టేశారు. ప్రస్తుతం పూర్తి స్థాయిలో రాజకీయాల పైన దృష్టి పెట్టారు. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఓడిపోయిన పవన్ కల్యాణ్ ఈసారి టీడీపీ, బీజేపీతో పొత్తుతో ఎన్నికల బరిలోక�