1000 Crore Seize : 5 పోల్ రాష్ట్రాల్లో 1000 కోట్ల క్యాష్ సీజ్.. తెలంగాణలో ?
1000 Crore Seize : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ జోరుగా ధన ప్రవాహం జరుగుతోంది.
- Author : Pasha
Date : 17-11-2023 - 8:07 IST
Published By : Hashtagu Telugu Desk
1000 Crore Seize : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ జోరుగా ధన ప్రవాహం జరుగుతోంది. రాజకీయ పార్టీల అభ్యర్థులు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పెద్దఎత్తున డబ్బులు ఖర్చుచేస్తున్నారు. మద్యం, కానుకల పంపిణీ సంగతి సరేసరి. దీనిపై కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్మన్ నితిన్ గుప్తా కీలక ప్రకటన చేశారు. తెలంగాణ, రాజస్థాన్, మిజోరం, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో గత నెల 9న ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు సీజ్ చేసిన నగదు మొత్తం రూ.1000 కోట్లకుపైనే ఉంటుందన్నారు. ఇక పోలీసులు స్వాధీనం చేసుకున్న బంగారం, వెండి, మద్యం విలువ వందల కోట్లు ఉంటుందని తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
తెలంగాణలో ఎంతో తెలుసా ?
తెలంగాణలో అక్టోబర్ 9 నుంచి ఇప్పటివరకు మొత్తం రూ.585 కోట్ల సొత్తును తనిఖీల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఉదయం 9 నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకూ రాష్ట్రంలో రూ.2.86 కోట్ల విలువైన నగదు, రూ.2.94 కోట్ల విలువైన మద్యం, రూ.59 లక్షల విలువైన మత్తుమందులు, రూ.1.11 కోట్ల విలువైన బంగారం, రూ.44 లక్షల విలువైన చీరలు, కుక్కర్ల వంటి వస్తువులు కలిపి మొత్తం రూ.7.95 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం(1000 Crore Seize) చేసుకున్నారు.