Spam Calls : స్పామ్ కాల్స్ వస్తున్నాయా ? ఈ సెట్టింగ్స్‌తో చెక్
స్పామ్ కాల్స్ సమస్యతో నిత్యం ఎంతోమంది సతమతం అవుతున్నారు.
- By Pasha Published Date - 04:17 PM, Wed - 3 July 24

Spam Calls : స్పామ్ కాల్స్ సమస్యతో నిత్యం ఎంతోమంది సతమతం అవుతున్నారు. వాటిని ఎలా ఆపాలో అర్థం కాక ఆగమాగం అవుతున్నారు. లోన్ కావాలా అంటూ కొందరు.. క్రెడిట్ కార్డు ఇస్తామంటూ మరికొందరు.. స్పామ్ కాల్స్ చేసి ప్రజల బుర్ర తింటున్నారు. ఇటువంటి వాళ్లంతా ఉపయోగించాల్సిన ఒక యాప్ గురించి.. ఆ యాప్‌లో చేయాల్సిన సెట్టింగ్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join
స్పామ్ కాల్స్(Spam Calls) సమస్య నుంచి గట్టెక్కేందుకు గూగుల్ ఒక యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. దాని పేరు.. ‘Phone by Google’. ఈ యాప్‌ను మనం గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని దాన్ని మీ డీఫాల్ట్ డయలర్ యాప్‌గా సెట్ చేయండి. ఈ సెట్టింగ్ చేసే క్రమంలో మీకు నీలిరంగు చిహ్నంతో కూడిన ఫోన్ యాప్ కనిపిస్తుంది. దాన్ని ఎంపిక చేసుకొని, డీఫాల్ట్ డయలర్‌గా సెట్ చేసుకోవాలి. ఈ యాప్‌లోని మెయిన్ స్క్రీన్‌పై మూడు చుక్కల మెనూ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి సెట్టింగ్‌లలోకి వెళ్లి, అందులోని కాలర్ ఐడీ అండ్ స్పామ్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
Also Read :HDFC Bank : బీ అలర్ట్.. ఆ 13 గంటలు బ్యాంకు సేవలు బంద్
ఈ సెట్టింగ్ ఒక్కో మోడల్ ఫోనులో ఒక్కోలా ఉండే అవకాశం ఉంటుంది. మీ ఫోనుకు వచ్చిన స్పామ్ కాల్ నంబర్‌పై క్లిక్ చేసి ఫోన్, మెసేజ్, వీడియో, ఐ అని ఐకాన్స్ కనిపిస్తాయి.వాటిలో ఐ ఐకాన్‌పై క్లిక్ చేస్తే బ్లాక్, రిపోర్ట్ అని రెండు ఆప్షన్లు ఉంటాయి. స్పామ్ కాల్ వచ్చిన నంబర్‌ను బ్లాక్ చేయాలంటే బ్లాక్ ఆప్షన్‌పై, సదరు నంబరుపై రిపోర్ట్ చేయాలంటే రిపోర్టు ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ నంబర్ నుంచి మీకు ఫోన్‌కాల్స్ రావు.