HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Appointment Of Chairmen For Three Committees In The Assembly

Assembly : అసెంబ్లీలో మూడు కమిటీలకు చైర్మన్ల నియామకం

Assembly : పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (PAC) చైర్మన్ గా అరికెపూడి గాంధీ, ఎస్టిమేషన్ కమిటీ చైర్మన్‌గా(అంచనాల కమిటీ) పద్మావతిరెడ్డి, పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్‌గా శంకరయ్యను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

  • Author : Latha Suma Date : 09-09-2024 - 7:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telangana assembly meetings from tomorrow
Telangana assembly

Appointment of chairmen for three committees in the Assembly : శాసనసభకు సంబంధించి మూడు కమిటీలను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సోమవారం ప్రకటించారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (PAC) చైర్మన్ గా అరికెపూడి గాంధీ, ఎస్టిమేషన్ కమిటీ చైర్మన్‌గా(అంచనాల కమిటీ) పద్మావతిరెడ్డి, పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్‌గా శంకరయ్యను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్‌గా షాద్ నగర్ ఎమ్మెల్యే కే శంకరయ్యని నియమించారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహాచార్యులు ఉత్తర్వులు జారీ చేశారు.

Read Also: Pawan Kalyan : వరద ప్రాంతాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పర్యటన

పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, అంచనాల కమిటీ, పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీలను ప్రకటించారు. పీఏసీ కమిటీకి చైర్మన్‌గా ప్రతిపక్ష ఎమ్మెల్యేను నియమించారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్‌గా అరికపూడి గాంధీ, సభ్యులుగా వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, రేవూరి ప్రకాశ్ రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, రామారావు పవర్, అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల, కూనంనేని సాంబశివరావు, టి. జీవన్ రెడ్డి, భానుప్రసాద్ రావు, ఎల్.రమణ, సత్యవతి రాథోడ్ ను నియమించారు.

అంచనాల కమిటీ చైర్ పర్సన్‌గా ఉత్తమ్ పద్మావతిరెడ్డి, సభ్యులుగా దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, మాగంటి గోపీనాథ్, సీహెచ్ విజయరమణారావు, కోరం కనకయ్య, రాందాసు మాలోతు, మామిడాల యశస్వీని, పి. రాకేష్ రెడ్డి, ఎంఎస్ ప్రభాకర్ రావు, సుంకరి రాజు, టి. రవీందర్ రావు, వి. యాదవరెడ్డిని నియమించారు. అదే విధంగా పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ చైర్మన్‌గా వీర్లపల్లి శంకర్, సభ్యులుగా పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి, కేపీ వివేకానంద, వేముల వీరేశం, కుంభం అనిల్‌కుమార్ రెడ్డి, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, పట్లోళ్ల సంజీవరెడ్డి, తోట లక్ష్మీకాంతారావు, కౌసర్ మోహినోద్దీన్, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, శేరి శుభాష్ రెడ్డి, తోట మధుసూదన్, మీరజ్ రియాజుల్ హాసన్ ఎఫెండీలను నియమిస్తూ స్పీకర్ బులెటెన్ విడుదల చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను తెలంగాణ శాసనసభ మొత్తంగా 3 ఆర్థిక కమిటీలను ఏర్పాటు చేసిందనమాట. అన్ని కమిటీల్లోనూ మొత్తం 12 మంది చొప్పున సభ్యులు ఉండనున్నారు.

కాగా, ప్రతిపక్ష పార్టీ నేతకు పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఆ పదవి ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. అరికెపూడి గాంధీకి ఆ పదవి కట్టబెట్టడం హాస్యాస్పదమన్నారు. అయితే.. పీఏసీ పదవి కోసం బీఆర్ఎస్ నుంచి హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్ నామినేషన్ వేసిన విషయం తెలిసిందే.

Read Also: Prabhas Salaar 2 : ప్రభాస్ సలార్ 2 లో మలయాళ స్టార్..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Arikepudi Gandhi
  • Public Accounts Committee
  • Speaker Gaddam Prasad Kumar
  • three committees Chairmen
  • ts assembly

Related News

Telangana Speaker G Prasad Kumar

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ సంచలన తీర్పు

Telangana Speaker Dismissed Disqualification Petition On Brs Mlas : పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్‌‌పై తెలంగాణ స్పీకర్ తీర్పు వెలువరించారు. మొత్తం ఐదుగురు ఎమ్మెల్యేలు ఎక్కడా పార్టీ మారినట్టు ఆధారాలు లేవని ఆయన తేల్చిచెప్పారు. కాగా, 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి. కాంగ్రెస్ విజయం సాధించి అధికారం చేపట

    Latest News

    • డిసెంబర్ 22 న జనసేన ‘పదవి-బాధ్యత’ సమావేశం

    • గ్రూప్-3 ఫలితాలను విడుదల చేసిన టీజీపీఎస్సీ

    • సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట

    • నిధి అగర్వాల్ చేదు అనుభవం, మాల్ ఆర్గనైజర్లపై కేసు నమోదు

    • ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

    Trending News

      • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

      • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

      • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

      • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

      • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd