Apple Warning : వారి ఐఫోన్లకు ‘స్టేట్ స్పాన్సర్డ్’ ఎటాక్ ముప్పు.. పలువురు ప్రతిపక్ష నేతలకు అలర్ట్
Apple Warning : మనదేశంలోని పలువురు ప్రతిపక్ష పార్టీల అగ్రనేతలు, ఇద్దరు ప్రముఖ జర్నలిస్టులకు ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్ (Apple) నుంచి ఒక అలర్ట్ నోటిఫికేషన్ వచ్చింది.
- Author : Pasha
Date : 31-10-2023 - 12:11 IST
Published By : Hashtagu Telugu Desk
Apple Warning : మనదేశంలోని పలువురు ప్రతిపక్ష పార్టీల అగ్రనేతలు, ఇద్దరు ప్రముఖ జర్నలిస్టులకు ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్ (Apple) నుంచి ఒక అలర్ట్ నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు దీనిపై అంతటా హాట్ డిబేట్ నడుస్తోంది. ఇంతకీ ఏమిటా అలర్ట్ నోటిఫికేషన్ ?
మెసేజ్‌లో ఏముంది ?
సంచలనం క్రియేట్ చేసేలా అందులో ఏవిషయం ఉంది ? అంటే.. ‘‘ప్రభుత్వం సపోర్ట్ కలిగిన కొందరు హ్యాకర్లు మీ ఐఫోన్‌ను హ్యాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. బహుశా మీకున్న నేపథ్యం దృష్ట్యా మిమ్మల్ని వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకొని ఈ హ్యాకింగ్ యత్నం జరుగుతుండొచ్చు. ఒకవేళ మీ ఐఫోన్ హ్యాక్ అయితే.. అందులోని సున్నితమైన సమాచారం, కెమెరాలోని వీడియోలు, ఫొటోలు, కాంటాక్ట్ వివరాలు, మైక్రోఫోన్ సమాచారం అన్నీ తస్కరించే రిస్క్ ఉంది. ఒకవేళ మా ఐఫోన్ రక్షణ వ్యవస్థలకు ఈమేరకు అందిన సమాచారం తప్పు కూడా అయి ఉండొచ్చు. ఎందుకైనా మంచిది మీరు మా వార్నింగ్‌ను సీరియస్‌గానే తీసుకోండి’’ అని పేర్కొంటూ యాపిల్ కంపెనీ అలర్ట్ మెసేజ్‌లను పంపింది. ఈ మెసేజ్‌పై స్పందిస్తూ.. పలువురు ప్రతిపక్ష నేతలు ట్వీట్లు కూడా చేశారు. తమ ఐఫోన్ల హ్యాక్‌కు యత్నాలు జరుగుతుండటం ఆందోళనకర పరిణామమని(Apple Warning) వ్యాఖ్యానించారు.
Wonder who? Shame on you.
Cc: @HMOIndia for your kind attention pic.twitter.com/COUJyisRDk— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) October 30, 2023
We’re now on WhatsApp. Click to Join.
యాపిల్ నుంచి అలర్ట్ మెసేజ్‌లు పొందిన ప్రముఖుల జాబితా..
- మహువా మొయిత్రా (తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ)
- ప్రియాంకా చతుర్వేది (శివసేన – ఉద్దవ్ ఎంపీ)
- రాఘవ్ చద్దా (ఆప్ ఎంపీ)
- శశి థరూర్ (కాంగ్రెస్ ఎంపీ)
- సీతారాం ఏచూరి (సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ)
- పవన్ ఖేరా (కాంగ్రెస్ అధికార ప్రతినిధి)
- అఖిలేష్ యాదవ్ (సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు)
- సిద్ధార్థ్ వరదరాజన్ (వ్యవస్థాపక సంపాదకుడు, ది వైర్ )
- శ్రీరామ్ కర్రీ (రెసిడెంట్ ఎడిటర్, డెక్కన్ క్రానికల్ )
- సమీర్ సరన్ (ప్రెసిడెంట్, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్)