Mahayuti Sweep In Maharashtra : ‘మహాయుతి’కి ఏపీ సీఎం చంద్రబాబు విషెస్
Mahayuti Sweep In Maharashtra : సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షా, సీఎం ఏక్నాథ్ శిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్కు ఆయన ఫోన్ చేసి హర్షం వ్యక్తం చేశారు.
- By Sudheer Published Date - 04:40 PM, Sat - 23 November 24

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో మహాయుతి కూటమి భారీ విజయం (Mahayuti Sweep In Maharashtra) సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు (AP CM Chandrababu) అభినందనలు తెలిపారు. కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షా, సీఎం ఏక్నాథ్ శిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్కు ఆయన ఫోన్ చేసి హర్షం వ్యక్తం చేశారు. మొత్తం 288 స్థానాల్లో పోలింగ్ జరుగగా..మహాయుతి దాదాపు 225 స్థానాల్లో విజయం సాదించబోతున్నట్లు తెలుస్తుంది.
నవంబర్ 20న పోలింగ్ జరుగగా 66 శాతం పోలింగ్ నమోదైంది. బీజేపీ, శివసేన, ఎన్‌సీపీతో కూడిన మహాయుతి కూటమి మరోసారి అధికారంలోకి వస్తామనే బలమైన అంచనాలతో ఉండగా, కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్‌సీపీ(ఎస్‌పీ) కూటమి ఈసారి బీజేపీ నుంచి అధికారం కైవసం చేసుకుంటామనే లక్ష్యంతో ఎన్నికల బరిలోకి దిగింది. శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అడ్డంగా చీలిపోయిన తర్వాత మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ మహారాష్ట్రలో నువ్వానేనా అనే రీతిలో పోటీ ఉంటుందని అంచనా వేశాయి. కానీ ఎగ్జిట్ పోల్ అంచనాలకు రివర్స్ లో ఓటర్లు మహాయుతి బ్రహ్మ రథంపట్టారు.
Congratulations to the Mahayuti Alliance on securing a historic mandate in Maharashtra. This victory reflects people’s continued trust in the leadership of the Hon’ble Prime Minister Shri @narendramodi Ji, whose strategic vision, transformative policies and devotion to the people… pic.twitter.com/u40WTplSyh
— N Chandrababu Naidu (@ncbn) November 23, 2024
Read Also : Diabetes: డయాబెటిస్ పేషెంట్లు తప్పనిసరిగా తీసుకోవలసిన చిరు ధాన్యాల గురించి మీకు తెలుసా?