Peerzadiguda : పిర్జాదీగూడ కొత్త మేయర్‌గా అమర్ సింగ్ ఎన్నిక
ఈ మేరకు అమర్ సింగ్ శుక్రవారం కార్యాలయంలో ప్రమాణస్వీకారం చేశారు. మేయర్ పదవీ బాధ్యతల స్వీకారానికి మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి తోటకూర వజ్రేశ్ యాదవ్, బొడిగె స్వాతి గౌడ్ తదితరులు హాజరయ్యారు.
- By Latha Suma Published Date - 01:12 PM, Fri - 30 August 24

Peerzadiguda : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్‌కు కొత్త మేయర్‌గా అమర్ సింగ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆయన శుక్రవారం కార్యాలయంలో ప్రమాణస్వీకారం చేశారు. మేయర్ పదవీ బాధ్యతల స్వీకారానికి మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి తోటకూర వజ్రేశ్ యాదవ్, బొడిగె స్వాతి గౌడ్ తదితరులు హాజరయ్యారు.
We’re now on WhatsApp. Click to Join.
అయితే, ఆగస్టు 9న నిర్వహించిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో జక్కా వెంకట్ రెడ్డి తన పదవిని కోల్పోవాల్సి వచ్చిన విషయం తెలిసిందే. ఆయనకు వ్యతిరేకంగా సుమారు 20 మంది కార్పొరేటర్లు ఓటు వేయడంతో ఆయన మేయర్ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
రాష్ట్రంలో తమ ప్రభుత్వం కొలువుదీరాక చాలా వరకు కార్పొరేషన్లు మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ తన వశం చేసుకుంది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా కాంగ్రెస్ హస్తగతమైంది. గతంలో గులాబీ పార్టీ సెక్రటరీ జనరల్‌గా ఉన్న కేకే కూతురు నగర మేయర్ విజయలక్ష్మి ముందుగా తండ్రితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరాక ఆమెకు మద్దతు నిచ్చే కార్పొరేటర్లు సైతం కాంగ్రెస్ గూటికి చేరిన విషయం తెలిసిందే.