AIMIM Leading In Aurangabad : ఔరంగాబాద్ లో ఎంఐఎం హవా
Aurangabad Election Results 2024 : ఔరంగాబాద్ నియోజకవర్గంలోని ఎంఐఎం అభ్యర్థి ఇంతియాజ్ (AIMIM Candidate Imtiaz) తన సమీప ప్రత్యర్థుల కంటే ముందంజలో ఉన్నారు. అయితే ఎగ్జిట్ పోల్స్ లో మాత్రం ఎంఐఎంకు ఒక్క స్థానం కూడా దక్కవని చెప్పినా, ఇప్పుడు కౌంటింగ్ ప్రారంభమయిన తర్వాత ఎంఐఎం అభ్యర్థి లీడ్ లో ఉండడం విశేషం
- By Sudheer Published Date - 11:40 AM, Sat - 23 November 24

మహారాష్ట్ర ఎన్నికల్లో (Maharashtra Elections) ఎంఐఎం (AIMIM ) హావ కనిపిస్తుండడం అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది. ఔరంగాబాద్ నియోజకవర్గంలోని ఎంఐఎం అభ్యర్థి ఇంతియాజ్ (AIMIM Candidate Imtiaz) తన సమీప ప్రత్యర్థుల కంటే ముందంజలో ఉన్నారు. అయితే ఎగ్జిట్ పోల్స్ లో మాత్రం ఎంఐఎంకు ఒక్క స్థానం కూడా దక్కవని చెప్పినా, ఇప్పుడు కౌంటింగ్ ప్రారంభమయిన తర్వాత ఎంఐఎం అభ్యర్థి లీడ్ లో ఉండడం విశేషం. మహారాష్ట్ర ఎన్నికల్లో కౌంటింగ్ ప్రారంభమయిన తర్వాత రెండు కూటముల మధ్య హోరా హోరీ పోరు కొనసాగడం మొదలైంది. 288 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఎన్నికల కౌంటింగ్ ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమయింది. అయితే మహారాష్ట్రలో మహాయుత కూటమి, మహా వికాస్ అఘాడీ కూటమి నువ్వా? నేనా అన్నట్లు పోరు ఉంటుందని భావించిన మూడు రౌండ్స్ తరువాత మహాయుత హావ మొదలైంది. డబుల్ సెంచరీ దిశగా మహాయుత పరుగులు పెడుతుంది.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి ఏకంగా 216 స్థానాల్లో కూటమి అభ్యర్థులు లీడ్ లో కొనసాగుతున్నారు. బీజేపీ సింగిల్ గానే వంద స్థానాలకు పైగా స్థానాలలో అధీక్యంలో ఉంది… 288 స్థానాలున్న మహారాష్ట్రలో 145 స్థానాలలో విజయం సాధించిన వారికి అధికారం లభిస్తుంది. ఈ మ్యాజిక్ ఫిగర్ ను మహాయుతి దాటేసింది… దీంతో మహారాష్ట్రలో మరోసారి మహాయుతి ప్రభుత్వమే ఏర్పడనుందని తేలిపోయింది. కాంగ్రెస్ ఎంవిఎ కూటమి కేవలం 59 స్థానాలలో మాత్రమే లీడ్ లో ఉంది.
కొలాబా స్థానంలో బీజేపీ అభ్యర్థి రాహుల్ నర్వేకర్, బారామతిలో అజిత్ పవార్, వర్లిలో శివసేన (యూబీటీ) అభ్యర్థి ఆదిత్య ఠాక్రే ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కోప్రిలో మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిండే ఆధిక్యంలో ఉండగా, వాండ్రే ఈస్ట్‌లో బాబా సిద్దిఖీ కుమారుడు జిశాన్ సిద్దిఖీ (ఎన్‌సీపీ), ఇస్లాంపూర్‌లో ఎన్సీపీ ఎస్పీ అభ్యర్థి జయంత్ పాటిల్, ఔరంగాబాద్ ఈస్ట్‌లో ఎంఐఎం అభ్యర్థి ఇంజియాజ్ జలీల్ లీడ్‌లో ఉన్నారు.
ఇక కూటమిలో ముఖ్యమంత్రి సీటు కోసం నేతల మధ్య పోటీ నెలకొంది. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన (షిండే వర్గం) చీఫ్, ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, ఎన్సీపీ (అజిత్ వర్గం) చీఫ్ అజిత్ పవార్ లతో పాటు పలువురు ఇతర కీలక నేతలు కుర్చీ కోసం అంతర్గతంగా డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Read Also : Prajapalana : నిరుద్యోగికి జీవనోపాధి.. ఇదికదా.. సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన.. అంటూ ట్వీట్