Viral Video : నెట్టింట్లో వైరల్ అవుతోన్న బైక్ స్టంట్…చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే…!!
బైక్ స్టంట్ వీడియోలు సోషల్ మీడియాలో కొత్తేమీ కాదు. చాలామంది సరదాగా ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా కొన్ని యాక్షన్ సన్నివేశాలు ప్రమాదకరంగానూ ఉంటాయి.
- By hashtagu Published Date - 05:26 PM, Tue - 19 July 22

బైక్ స్టంట్ వీడియోలు సోషల్ మీడియాలో కొత్తేమీ కాదు. చాలామంది సరదాగా ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా కొన్ని యాక్షన్ సన్నివేశాలు ప్రమాదకరంగానూ ఉంటాయి. అయితే అలాంటి సన్నివేశాలు నెటిజన్లదృష్టిని ఆకర్షించడంలో కూడా సక్సెస్ అవుతున్నాయి. ఇప్పుడు అలాంటి బైక్ స్టంట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియోను ఓ నెటిజన్ ఇన్ స్టాగ్రామ్ లో తన అకౌంట్లో షేర్ చేశాడు. క్లిప్ బైక్ హ్యాండిల్ పట్టుకుని తిరుగుతున్న వ్యక్తి ఈ వీడియోలో కనిపిస్తుంది. హ్యాండిల్ పట్టుకుని..తన కాళ్లను నేలపై గట్టిగా ఉంచి అతను స్పిన్ అద్భుతంగా ఉంది. ఈ సీన్ అక్కడున్న వారందరీని ఎంతో ఆకట్టుకుంటుంది. కొన్ని సెకన్ల పాటు ఈ స్టంట్ ఇంటర్నెట్లో హల్ చల్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు వేలాది లైక్స్ , కామెంట్స్ వైరల్ అవుతోంది. కొందరు ఫన్నీ రియాక్షన్ ఇవ్వగా…మరికొందరు మాత్రం ఇలాంటి సాహసాలు చేయద్దంటూ కామెంట్స్ పెడుతున్నారు.