Die Hard Fan: బాలయ్య కోసం వాగులో దూకేసిన అభిమాని.. వీడియో వైరల్!
హిందుపురం ఎమ్మెల్యే, సినీ హీరో బాలయ్యకు మాస్ లో మంచి క్రేజ్ ఉంది. ఇటు రాజకీయాల్లో, ఇటు సినిమాల్లోనూ ఆయనకు
- By Balu J Published Date - 12:55 PM, Wed - 19 October 22
హిందుపురం ఎమ్మెల్యే, సినీ హీరో బాలయ్యకు మాస్ లో మంచి క్రేజ్ ఉంది. ఇటు రాజకీయాల్లో, ఇటు సినిమాల్లోనూ ఆయనకు అభిమానులున్నారు. ఏపీలో వరదల కారణంగా హిందూపురం జలమయమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ హిందూపూర్ నియోజకవర్గంలో పర్యటించారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారు. ఈ క్రమంలో ఓ వాగు వద్ద కూలిపోయిన వంతెనను పరిశీలించేందుకు వెళ్లగా, అవతలి వైపు ఉన్న ఓ అభిమాని వాగులో దూకి బాలకృష్ణను కలిసేందుకు ప్రయత్నించాడు. దీంతో అతడు వాగులో కొంతదూరం కొట్టుకుపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Related News
AP Volunteers: ఏపీలో ఇప్పటివరకు 62 వేల వాలంటీర్ల రాజీనామా
గ్రామ వాలంటీర్ల రాజీనామాల ఆమోదానికి సంబంధించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాదనలు జరిగాయి. ఎన్నికలు ముగిసే వరకు వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ఉత్తర్వులు జారీ చేయాలని ప్రతిపక్ష పార్టీలు కోర్టును అభ్యర్థించాయి.