7th Grader: ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఎలా జరుగుతాయన్న ప్రశ్నకు..విద్యార్థి షాకింగ్ ఆన్సర్..!!
సాధారణంగా ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఎలా జరుగుతాయని అడుగుతే ఏం చెబుతారు.
- By Hashtag U Published Date - 01:38 PM, Sun - 24 April 22
సాధారణంగా ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఎలా జరుగుతాయని అడుగుతే ఏం చెబుతారు. ప్రజలు ఓట్లు వేస్తే…ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే…వాళ్లు ఎమ్మెల్యేగా గెలుస్తారని చెబుతుంటారు. కానీ ఈ ప్రశ్నకు ఏడో తరగతి విద్యార్థి రాసిన సమాధానం మైండ్ బ్లాంక్ అయ్యేలా ఉంది. రంగారెడ్డి జిల్లా ఫరూశ్ నగర్ మండలంలోని లింగారెడ్డిగూడ ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థి పరీక్షల్లో రాసిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అంతేకాదు ఆ విద్యార్థి రాసిన సమాధానం అందర్నీని ఆలోచించేలా చేస్తోంది.
ఎమ్మెల్యే ఎన్నికలు ఎలా జరుగుతాయన్న ప్రశ్నకు ఆ విద్యార్థి జవాబు ఇలా రాసాడు. ఎమ్మెల్యే కోసం పోటీ పడేవాళ్లు ఇంటింటికి వస్తారు…పెద్దోళ్లకు పైసలు, బిర్యానీ ఇస్తారని రాసాడు. అలాగే ఆడోళ్లకు చీరలు పంచుతారని..అవి తీసుకుని పెద్దోళ్లు ఓట్లు వేస్తారని…ఎవరికి ఓట్లు ఎక్కువగా వస్తే వారు గెలుస్తారని రాసాడు. విద్యార్థి రాసిన ఈ జవాబుకు ప్రశ్నపత్రం దిద్దిన టీచర్ నాలుగు మార్కులు వేయడం గమనార్హం.