56 Years Old Gym Video: చీరలో జిమ్ వర్కౌట్స్.. వావ్ అంటున్న నెటిజన్స్!
వర్కౌట్స్ చేయడానికి వయసుతో పనేంటి అని అంటోంది 56 ఏళ్ల మహిళ. చీరకట్టులోనూ వివిధ రకాల వర్కౌట్స్ చేస్తూ అదరగొడుతోంది.
- By Balu J Published Date - 12:31 PM, Wed - 23 November 22
వర్కౌట్స్ చేయడానికి వయసుతో పనేంటి అని అంటోంది 56 ఏళ్ల మహిళ. చీరకట్టులోనూ వివిధ రకాల వర్కౌట్స్ చేస్తూ అదరగొడుతోంది. ఆమె జిమ్ వీడియోను చూసినవారు ఎవరైనా శభాష్ అని మెచ్చుకోవాల్సిందే. లేటు వయసులో జిమ్ లో కష్టపడుతున్న ఆమె తపనకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. జిమ్, వెయిట్ లిఫ్టింగ్ కేవలం యువకులకు మాత్రమే కాదు మహిళలు కూడా చేయగలరని నిరూపిస్తోందీమె. మహిళ చీర కట్టుకుని జిమ్ చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. అయితే మహిళ నాలుగేళ్ల క్రితం తీవ్రమైన మోకాళ్ల నొప్పులతో బాధపడుతోంది.
జిమ్ సెంటర్ నిర్వహిస్తున్న ఆమె కొడుకు ఆమె సమస్య గురించి తెలుసుకున్నాడు. వ్యాయామంతో సమస్య నుంచి బయటపడొచ్చని సలహా ఇవ్వడంతో ఫిటెనెస్ ప్రయాణం మొదలుపెట్టింది. అప్పటి నుండి తన కోడలుతో వెయిట్ ట్రైనింగ్, పవర్ లిఫ్టింగ్ చేస్తోంది. జిమ్ ఆమె నొప్పిని నయం చేయడమే కాకుండా ఆమెను ఫిట్‌గా ఉంచింది. ఆమె స్ఫూర్తిదాయకమైన ప్రయాణం ఇప్పుడు నెటిజన్స్ హృదయాలను గెలుచుకుంటుంది. ఇన్ స్టాలో షేర్ చేసిన ఆమె వీడియోకు 98k లైక్‌లు వచ్చాయి.