HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Ys Sharmila Decision

YS Sharmila : షర్మిల సకాల సముచిత నిర్ణయం

వైయస్ షర్మిల తెలంగాణ ఎన్నికల పోటీ నుంచి తాము వైదొలుగుతున్నట్టు ప్రకటించడం ఆమె రాజకీయ విజ్ఞతకు సమయస్ఫూర్తికి అద్దం పడుతుంది

  • By Sudheer Published Date - 07:16 PM, Fri - 3 November 23
  • daily-hunt
Sharmila Decision
Sharmila Decision

డా. ప్రసాదమూర్తి

ఏ కాలంలో ఏ సందర్భంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో, ఆ కాలంలో ఆ సందర్భంలో అలా స్పందించిన వారే రాజకీయాలకు అర్హులవుతారు. వైయస్ షర్మిల (YS Sharmila )తెలంగాణ ఎన్నికల పోటీ నుంచి తాము వైదొలుగుతున్నట్టు (YS Sharmila Not Contesting Election) ప్రకటించడం ఆమె రాజకీయ విజ్ఞతకు సమయస్ఫూర్తికి అద్దం పడుతుంది. నిన్నటి వరకు షర్మిల కాంగ్రెస్ పార్టీలో తమ పార్టీ విలీనం కాకుండా కొందరు వ్యక్తులు అడ్డుకున్నారని, దానికి ప్రతీకారంగా ఎన్నికలలో తాను పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ విజయవకాశాలను దెబ్బతీయాలని ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వెల్లువెత్తాయి.

కేవలం ఊహాగానాలు, సందేహాలే కాదు స్వయంగా షర్మిల తాము అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు ఇంతకుముందు పేర్కొన్నారు కూడా. కానీ జరుగుతున్న పరిణామాలు, వెలువడుతున్న సర్వేలు, పలు జాతీయ మీడియా సంస్థలు, రాజకీయ విజ్ఞుల విశ్లేషణలు పరిగణనలోకి తీసుకొని, షర్మిల పునరాలోచనలో పడినట్టు అర్థమవుతుంది. అందుకే తమ పార్టీ ఎన్నికలలో అభ్యర్థులను నిలబెట్టి ఘోర పరాజయం పొంది కాలగర్భంలో కలిసిపోవడం కంటే, సకాలంలో సముచిత నిర్ణయం తీసుకొని సరైన రాజకీయ వ్యూహంతో ముందుకు వెళ్లడమే మంచిదని షర్మిల నిర్ణయించుకున్నట్టున్నారు. అందుకే ఎన్నికలలో పోటీకి దిగడం లేదని, అలా దిగడం వల్ల కాంగ్రెస్ పార్టీ విజయవకాశాలను దెబ్బతీసినట్టు అవుతుందని అది అధికార బీఆర్ఎస్ విజయానికి దోహదపడుతుందని షర్మిల ఇప్పుడు చెబుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించడమే కాదు ఆ విషయాన్ని కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీకి కూడా ఒక లేఖ ద్వారా తెలియజేశారు. తెలంగాణలో కేసీఆర్ నీచ పరిపాలనను అంతమొందించడమే తన లక్ష్యమని, అందుకు ఎలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా తాను సిద్ధమేనని, అందుకే ఎన్నికలలో పోటీ చేయకుండా కాంగ్రెస్ విజయావకాశాలు మెరుగుపరచడానికి తాను త్యాగం చేస్తున్నానని రాహుల్ కి రాసిన లెటర్ లేఖలో షర్మిల పేర్కొన్నారు. మొత్తానికి షర్మిల తీసుకున్న ఈ నిర్ణయం ఆమె రాజకీయ భవిష్యత్తుకు దోహదపడేదనే చెప్పాలి.

కేవలం కాంగ్రెస్ పార్టీ తన డిమాండ్లను అంగీకరించకపోవడం వల్ల తన పార్టీని పోటీకి నిలబెట్టి, కాంగ్రెస్ విజయావకాశాలను దెబ్బతీయాలని ముందు కక్షపూరితంగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విషయంలో పలువురు పెద్దలు ఆమెకు వ్యక్తిగతంగా ఎన్నో సలహాలు ఇచ్చి ఉంటారు. అంతకంటే ఎక్కువగా మీడియాలో వస్తున్నటువంటి చర్చలు, రాజకీయ పరిశీలకులు చేస్తున్న విశ్లేషణలు ఆమె గమనించే ఉంటారు. తన పార్టీ గెలవకపోయినా కాంగ్రెస్ ఓటమి మాత్రం ఖాయం కావాలని షర్మిల ఊహిస్తున్నట్టు ఎన్నో వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఎన్నికలలో షర్మిలకు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చి కాంగ్రెస్ విజయావకాశాలను దెబ్బతీసే బలం ఉందా లేదా అన్న మాట అలా ఉంచినా, పోటీ చేయడం వల్ల తన పార్టీ మీద, తనమీద పడిన మచ్చ శాశ్వతంగా ఉండిపోతుంది. అది షర్మిల రాజకీయ భవితవ్యానికి తీవ్ర విఘాతం కలిగిస్తుంది. షర్మిల తానే స్వయంగా చెబుతున్నట్లు, తెలంగాణలో కాంగ్రెస్ కు విజయావకాశాలు మెండుగా ఉన్నాయని, ఈ సమయంలో కాంగ్రెస్కు అంది వచ్చే ఓట్లను ఎవరు చీల్చినా అది కాంగ్రెస్ విజయావకాశాలను దెబ్బతీసినట్లే అవుతుందని ఆమె అర్థం చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. తన విజయం కంటే కాంగ్రెస్ పరాజయమే షర్మిల ఎక్కువగా కోరుకున్నట్టు వచ్చిన వార్తలు ఆమె మొత్తం రాజకీయ భవిష్యత్తుని గందరగోళపరిచేవిగా ఉన్నాయి. అందుకే షర్మిల వెంటనే తెలివి తెచ్చుకుని ఇప్పుడు తన నిర్ణయాన్ని ప్రకటించి ఉంటారు. రాష్ట్రంలో గాని దేశవ్యాప్తంగా గాని అటు బిజెపికి ఇటు ప్రతిపక్షాలకు మధ్య ఒక స్పష్టమైన సమీకరణ జరుగుతుంది.

ఈ నేపథ్యంలో బిజెపికి గాని ఆ పార్టీ పరోక్షంగా సహాయ సహకారాలు అందించే మరో పార్టీకి గానీ ఏ విధంగా సహాయపడినా, అది జాతీయ రాజకీయాలలో ప్రతిపక్ష అవకాశాలకు నష్టమే చేకూర్చుతుంది. షర్మిల తాను తెలంగాణలో పార్టీ పెట్టడం ఇక్కడ దొరల పాలనను అంతమందించాలనే ఉద్దేశంతోనే అని చెప్పుకొచ్చారు. అలాంటప్పుడు బీఆర్ఎస్ ను ఓడించే స్థితిలో కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ అవకాశాలను దెబ్బతీయాలనుకోవడం ఆత్మహత్యా సదృశమైన చర్య అవుతుంది అని షర్మిల సకాలంలో గుర్తించినట్టు ఉన్నారు. ఈ ఎన్నికలలో పోటీలో లేకపోయినా కనీసం కాంగ్రెస్ విజయావకాశాల కోసం తనదైన వంతు కృషి చేస్తే షర్మిల భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో ఒక కీలకమైన పాత్ర పోషించే అవకాశం లభిస్తుంది. కనుక తాత్కాలికమైన కక్షపూరిత చర్యల కంటే దీర్ఘకాలికమైన స్వీయ ప్రయోజనాలే ముఖ్యమని షర్మిల గుర్తించారు. అందుకే తాను పోటీలో నిలవకుండా కాంగ్రెస్ విజయానికి దోహదపడతానని బహిరంగంగా ప్రకటించారు. ఇది షర్మిల తీసుకున్న సకాల సముచిత నిర్ణయం అని అనుకోవచ్చు. ఏది ఏమైనా ఆఖరు ఘడియ లోనైనా తెలివిగా వ్యవహరించి షర్మిల కాంగ్రెస్ కు ఎంత మేలు చేకూర్చుతారో తెలియదు గానీ, తన భవిష్యత్తును మాత్రం పదిలం చేసుకున్నారని చెప్పాలి.

Read Also : KCR: భారీ మెజారిటీతో జీవన్ రెడ్డి గెలుపు ఖాయం: కేసీఆర్


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • not contesting
  • telangana elections
  • ys sharmila

Related News

    Latest News

    • Ministers Resign : మంత్రులందరూ రాజీనామా

    • Tamarind Seeds: ‎చింత గింజలు తినడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే తినకుండా అస్సలు ఉండలేరు.. అవేంటంటే!

    • Naxalism : నక్సలిజంపై పోరులో ల్యాండ్మార్క్ డే – అమిత్

    • Telangana Local Body Election : 50% కోటాలో ఎన్నెన్ని స్థానాలంటే…!!

    • ‎Diwali: దీపావళి పండుగ రోజు లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ఏ రంగు దుస్తులు ధరించాలో మీకు తెలుసా?

    Trending News

      • Chandrababu : కర్నూలు : ”సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్” బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగం

      • Infosys : ఉద్యోగులకు ఇన్ఫోసిస్ అదిరిపోయే శుభవార్త..!

      • PM Modi AP Tour LIVE: ప్రధాని మోదీ లైవ్ అప్డేట్స్

      • Sai Dharam Tej : మేన‌ల్లుడు సాయి దుర్గా తేజ్ బర్త్‌డే.. మామ ప‌వ‌న్ క‌ల్యాణ్ విషెస్

      • Nobel Peace Prize 2025 : డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్ ?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd