Telangana: ప్రాజెక్టుల రీ-డిజైనింగ్ పేరుతో కోట్లు నొక్కేసిన కేసీఆర్: షర్మిల
తెలంగాణాలో దొర కేసీఆర్ ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో కోట్లు దండుకున్నారని ఆరోపించారు వైఎస్ఆర్టీపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును 38 వేల కోట్లతో
- By Praveen Aluthuru Published Date - 03:09 PM, Thu - 17 August 23

Telangana: తెలంగాణాలో దొర కేసీఆర్ ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో కోట్లు దండుకున్నారని ఆరోపించారు వైఎస్ఆర్టీపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును 38 వేల కోట్లతో పూర్తి చేయాలనీ అనుకున్నాడని, కానీ కేసీఆర్ కమీషన్ల కోసం రీడిజైనింగ్ పేరుతో లక్షా 25 కోట్లకు పెంచాడని ధ్వజమెత్తారు షర్మిల. సగం డబ్బు కాజేసి, వేల కోట్ల కరెంటు బిల్లులకు కారణమయ్యే ప్రాజెక్టును నిర్మించి ప్రజలపై భారం మోపడంటూ మండిపడ్డారు ఆమె. అది కూడా మూణాళ్లకే మునిగింది. కాళేశ్వరంతో 45 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పిన పెద్ద దొర.. కేవలం 1.50లక్షల ఎకరాలకే నీళ్లు ఇచ్చారు. కుద్దు హరీశ్ రావే అసెంబ్లీలో ఈ విషయం చెప్పాడు. 1.50 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి రూ.1.25లక్షల కోట్లు ఖర్చు చేసిన అపరమేధావి కేసీఆర్. అందుకే అన్నాం ఇది బంధిపోట్ల రాష్ట్ర సమితి అని. దోచుకోవడం, దాచుకోవడమే వీళ్ల పని అని తుర్పాబట్టారు. ఇప్పుడు నిస్సిగ్గుగా కాళేశ్వరంతో నీళ్లు రాలేదని, భూగర్భ జలాలు మాత్రమే పెరిగాయని చెబుతున్నాడు చిన్న దొర కేటీఆర్ అంటూ కేటీఆర్ పై ఫైర్ అయ్యారు.మరి మీది పాలన అనాలో,దిక్కుమాలిన పాలన అనాలో మీరే చెప్పాలంటూ ఎద్దేవా చేశారు వైఎస్ షర్మిల.
Also Read: TTD Chairman: అటవీ అధికారుల సూచన మేరకే కర్రలు ఇచ్చాం, ట్రోల్స్ పై టీటీడీ చైర్మన్ రియాక్షన్