Tragedy : BMW కారు కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య
Tragedy : బీఎండబ్ల్యూ కారు (BMW Car) కొనివ్వలేదనే మనస్థాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య (Suicide) చేసుకోవడం
- By Sudheer Published Date - 03:39 PM, Mon - 2 June 25

సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం చాట్లపల్లి గ్రామంలో ఓ యువకుడు బీఎండబ్ల్యూ కారు (BMW Car) కొనివ్వలేదనే మనస్థాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య (Suicide) చేసుకోవడం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. స్థానికంగా కనకయ్య కుమారుడైన జానీ (Jani) (21) పదో తరగతి వరకు చదివాడు. తల్లిదండ్రులతో కలిసి వ్యవసాయకూలీగా పనిచేస్తున్న జానీకి విలాసవంతమైన జీవితంపై ఆకర్షణ ఎక్కువగా ఉండేది. ఈ మధ్య పదే పదే బీఎండబ్ల్యూ కారు కావాలంటూ తండ్రిని అడుగుతున్నాడు.
Pawan : సరికొత్త కార్యక్రమానికి పవన్ శ్రీకారం..టైటిల్ అదిరిపోయిందంటున్న శ్రేణులు
శుక్రవారం జానీని కార్ షోరూంకు తీసుకెళ్లిన తల్లిదండ్రులు తమ ఆర్థిక పరిస్థితి వల్ల బీఎండబ్ల్యూ కాకుండా స్విఫ్ట్ కారు కొనిచ్చే అవకాశం మాత్రమే ఉందని తెలిపారు. తండ్రి చెప్పిన మాటలతో తీవ్ర నిరాశకు గురైన జానీ ఇంటికి వచ్చి పురుగుల మందు తాగాడు. పరిస్థితిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ములుగులోని ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఘటన తల్లిదండ్రులకు, గ్రామస్థులకు తీవ్ర ఆవేదనను కలిగించింది. చిన్నతనంలోనే పెద్ద కలలు కన్న జానీ వంటి యువతరం ఆర్థిక స్థితిగతుల్ని పరిగణనలోకి తీసుకోకుండా నిర్ణయాలు తీసుకోవడం దురదృష్టకరం. తల్లిదండ్రులపై ఒత్తిడి కలిగించడం కంటే వారి పరిస్థితిని అర్థం చేసుకుని నెమ్మదిగా జీవితాన్ని నిలబెట్టుకునే విధంగా ప్రవర్తించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కుటుంబ సభ్యులు, సమాజం మార్గనిర్దేశం చేయాలని అధికారులు సూచిస్తున్నారు.