HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Womens Day 2025 Life Highlights Of Telugu Freedom Fighter Sarojini Naidu Who Fought For Womens Right To Vote

Sarojini Naidu : తెలుగు వీర వనిత సరోజినీ నాయుడు.. నిజాం నవాబు మెచ్చిన రచయిత్రి !

సరోజినీ(Sarojini Naidu) కూడా ఆరేళ్ల వయసు నుంచే ఆంగ్లంలో కవితలు రాసేది. ఆమెకు పర్షియన్ భాష కూడా వచ్చు.

  • By Pasha Published Date - 08:55 AM, Mon - 3 March 25
  • daily-hunt
Womens Day 2025 Telugu Freedom Fighter Sarojini Naidu Womens Vote

Sarojini Naidu : ‘ప్రపంచ మహిళా దినోత్సవం’ మార్చి 8న జరగబోతోంది. ఈసందర్భంగా మనం తప్పకుండా స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన ఒక తెలుగు వీర వనిత గురించి తెలుసుకోవాలి. ఆమె మరోవరో కాదు.. భారత కోకిలగా పేరుగాంచిన సరోజినీ నాయుడు.  ఈ మహా పోరాట యోధురాలి జీవిత విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Also Read :Oscars 2025 : ఆస్కార్ అవార్డుల్లో ‘వికెడ్‌’, ‘అనోరా’ హవా.. విజేతలు వీరే

సరోజినీ నాయుడు జీవిత విశేషాలు

  • సరోజినీ నాయుడు 1879  సంవత్సరం ఫిబ్రవరి 13న హైదరాబాద్‌లో జన్మించారు.
  • ఆమె పుట్టిన రోజున (ఫిబ్రవరి 13) భారత ప్రభుత్వం జాతీయ మహిళా దినోత్సవంగా సెలబ్రేట్ చేస్తోంది.
  • సరోజినీ తండ్రి పేరు అఘోర్ నాథ్ ఛటోపాధ్యాయ్. ఈయన ఇప్పటి బంగ్లాదేశ్‌లో జన్మించారు. అఘోర్ నాథ్ బెంగాలీ హిందువు.
  • నిజాం నవాబు కాలంలో హైదరాబాద్‌లోని నిజాం కాలేజీకి ప్రిన్సిపల్‌గా అఘోర్ నాథ్ ఛటోపాధ్యాయ్ వ్యవహరించేవారు.
  • అఘోర్ నాథ్ ఎడిన్ బర్గ్ యూనివర్సిటీలో డాక్టరేట్ చేశారు.
  • సరోజినీ(Sarojini Naidu) కూడా ఆరేళ్ల వయసు నుంచే ఆంగ్లంలో కవితలు రాసేది. ఆమెకు పర్షియన్ భాష కూడా వచ్చు.
  • తండ్రి అఘోర్ నాథ్ సహకారంతో మహెర్ మునీర్ పేరుతో ఒక పర్షియన్ నాటకాన్ని సరోజినీ రాశారు. అప్పుడు ఆమె వయసు 12 ఏళ్లు.
  • సరోజినీ నాయుడు తండ్రి నిజాం నవాబుకు బాగా సన్నిహితులు. ఆయన మహెర్ మునీర్ నాటకం పుస్తకాన్ని తీసుకెళ్లి నాటి నిజాం నవాబుకు ఇచ్చారు. దీన్ని చదివి ముగ్ధుడైన నిజాం నవాబు, సరోజినీ నాయుడుకు విదేశాల్లో చదివేందుకు స్కాలర్‌షిప్ ప్రకటించారు. ఈ ఉపకారవేతనంతోనే సరోజినీ నాయుడు లండన్‌లోని కింగ్స్ కాలేజీలో చదువుకున్నారు.
  • లండన్‌లో ఉండగా  పెద్దిపాటి గోవిందరాజులు నాయుడుతో  సరోజినీకి పరిచయం ఏర్పడింది. వాళ్లిద్దరూ కులాంతర వివాహం చేసుకున్నారు.  ఆ సమయానికి సరోజిని వయసు 19 ఏళ్లు.
  • పెద్దిపాటి గోవిందరాజులు, సరోజిని దంపతులకు ఐదుగురు సంతానం. వారి కుమార్తె పద్మజ కూడా స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు.

Also Read :Women’s Day : ఏపీలో మహిళలకు ఉమెన్స్ డే స్పెషల్ గిఫ్ట్

  • 1905లో ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్ (డబ్ల్యూఏఐ)ను సరోజినీ నాయుడు ప్రారంభించారు.
  • సరోజినీ నాయుడు తొలి కవితా సంకలనం 1905లో ప్రచురితమైంది. దాని పేరు  ‘ది గోల్డెన్ థ్రెషోల్డ్.’
  • 1906లో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ఆమె ప్రసంగించారు.
  • 1925లో ఆమె భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.
  • ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్లారు.
  • సరోజినీ నాయుడు భారతదేశపు తొలి మహిళా గవర్నర్. ఆమె 1947 నుంచి 1949 వరకు యునైటెడ్ ప్రావిన్స్ ఆఫ్ ఆగ్రా అండ్‌ ఔద్‌‌కు గవర్నర్‌గా పనిచేశారు.
  • సరోజినీ నాయుడు గౌరవార్ధం దేశంలోని పలు సంస్థలు, పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులకు ఆమె పేరు పెట్టారు.
  • మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రెండేళ్ల తర్వాత 1949 మార్చి 2న సరోజినీ నాయుడు తన 70వ ఏట ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో గుండెపోటుతో కన్నుమూశారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • freedom fighter
  • Sarojini Naidu
  • Telugu Freedom Fighter
  • WOmen's day 2025
  • Womens Vote

Related News

    Latest News

    • BC Bandh : BCలను రోడ్డెక్కించిన ‘రాజకీయం’.. కారణమెవరు?

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    • BC Bandh: బీసీ బంద్.. కవిత ఆటో ర్యాలీ

    • CM Chandrababu: లండన్‌ పర్యటనకు సీఎం చంద్రబాబు.. ఆస్ట్రేలియా పర్యటనకు మంత్రి లోకేశ్!

    • Kiran Navgire: చ‌రిత్ర సృష్టించిన టీమిండియా క్రికెట‌ర్‌!

    Trending News

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

      • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

      • Rivaba Jadeja: గుజరాత్ మంత్రిగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd